Suryaa.co.in

Andhra Pradesh

బీసీల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ లక్ష్యం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీగా మరోసారి రుజువైయింది
– బడుగు బలహీన వర్గాలకు చెందిన బీద రవిచంద్ర, బీటి నాయుడు, కావలి గ్రీష్మ ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడం ఇది నిదర్శనం
– ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు నందికనము బ్రహ్మయ్య

ఒంగోలు: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి నామినేటెడ్ పదవి (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి (పి.కృష్ణయ్య) కేటాయించింది. బీసీ అభ్యున్నతికి ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అదే బాటలో సీఎం చంద్రబాబు గారు కూడా బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. “నా బీసీలు” అంటూ అధికారంలోకి వచ్చి బీసీలను జగన్ రెడ్డి ఊచకోత కోస్తే… బడుగు, బలహీనవర్గాలు కూడా ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం అవ్వాలని చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు.

బీసీలకు కేటాయించిన కీలక పదవులు

* ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా 2 బీసీలు, ఒక్కరు దళిత మహిళకు కేటాయించి.. బడుగు, బలహీనవర్గాల బంధువుగా చంద్రన్న నిలిచారు.
* రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బీసీ అధికారి కె.విజయానంద్‌కు అవకాశం కల్పించారు. ఉమ్మడి ఏపీలో గాని, నవ్యాంధ్రలో గాని ఇప్పటి వరకు బీసీలకు సీఎస్ పోస్టు దక్కలేదు. తొలిసారిగా బీసీ అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన ఘనత సీఎం చంద్రబాబుదే.
* అత్యంత ప్రాధాన్యత కలిగిన టీటీడీ ఈఓగా బీసీ వర్గానికి చెందిన శ్యామల రావును నియమించారు.
* గత డీజీపీ ద్వారకా తిరుమలరావు బీసేనే, టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా బీసీ నేత పల్లా శ్రీనివాస్.
* అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ నేత, బీసీ వర్గానికి చెందిన వారు చింతకాయల అయ్యన్న పాత్రుడుకు అవకాశం.
* ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా మరో బీసీ ముద్దాడ రవిచంద్రను అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి పీ. కృష్ణయ్యను నియమించారు.

బీసీల సంక్షేమానికి తెలుగుదేశం కృషి

* రాష్ట్రంలోని మద్యం షాపుల్లో బీసీలకు 10 శాతం షాపులను కేటాయించారు.
* బీసీలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టారు.
* జగన్ రెడ్డి హయాంలో రద్దు చేసిన ఆదరణ లాంటి పథకాలు కూటమి ప్రభుత్వంలో మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1000 కోట్లు కేటాయించారు.
* కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీల సంక్షేమానికి 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రూ.39,007 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.47,000 కోట్లు నిధులను ప్రభుత్వం కేటాయించింది.
* టీడీపీ పాలనలో బీసీ కార్పొరేషన్లు, ఉపాధి అవకాశాలు, విద్య, ఉద్యోగుల్లో రిజర్వేషన్లు కల్పించి బీసీల ఎదుగుదలకు రెడ్ కార్పెట్ వేసింది.

వైసీపీ పాలనలో బీసీలపై వివక్ష

* జగన్ అధికారంలోకి రాక ముందు “నా బీసీలు” అని గొంతు చించుకొని చెప్పి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత రంగులు మార్చారు.
* స్థానిక సంస్థల్లో జగన్ రెడ్డి 34 శాతం నుంచి 24 శాతానికి బీసీలకు రిజర్వేషన్ కోత వేశారు. దీంతో 16,600 మంది బీసీలు పదవులకు దూరమయ్యారు.
* బీసీ కార్పొరేషన్ నిధుల నుండి రూ.3,432 కోట్లను జీవో నెం.6 ద్వారా దారి మళ్లించేశారు.
* వైసీపీ పాలనలో బీసీలకు నిధులు కేటాయించడంలో అసమర్థత, అవకాశాల కోత, రాజకీయంగా పక్కన పెట్టడం వంటివి చేసి వంచనకు గురి చేశారు.
* వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎస్, డీజీపీ సహా అన్ని కీలక స్థానాల్లో తన సామాజికవర్గానికి చెందిన వాళ్లనే జగన్ రెడ్డి నియమించారు.

LEAVE A RESPONSE