Suryaa.co.in

Andhra Pradesh

బీసీల పార్టీ తెలుగుదేశం

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత
ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ

ఒంగోలు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో బడుగు, బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీల పార్టీగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు పొందింది. ఈ రాష్ట్రంలో బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీతోనే కలిసి నడుస్తున్నారు.

ఎమ్మెల్సీ స్థానాల జాబితాలో బడుగు బలహీన వర్గాలకు మూడు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించారు. ఒకటి బీద రవిచంద్ర కి, రెండవది బీటీ నాయుడు కి, మూడవది గ్రీష్మ కి కేటాయించారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎల్లప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందనేది మరోసారి రుజువైంది. దేశంలోని ఏ పార్టీ ఇవ్వని అవకాశాలను తెలుగుదేశం పార్టీ బీసీలకు కల్పిస్తోంది.

తెలుగుదేశం పార్టీ నినాదం బీసీల జీవిత నినాదంగా మారింది. అందుకే రాష్ట్రంలోని బీసీలందరూ కూడా తెలుగుదేశం వెంట నడవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలుగుదేశంతోనే బడుగు బలహీనవర్గాల భవిష్యత్తు సురక్షితం. గత ప్రభుత్వ కాలంలో బీసీలపై జరిగిన అన్యాయాలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఎత్తి చూపుతూనే ఉంది. బీసీల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. బీసీల సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తోంది.

రాష్ట్రంలో బీసీల జనాభా 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ, వారికి తగిన ప్రాతినిధ్యం లభించలేదు. తెలుగుదేశం పార్టీ మాత్రమే బీసీలకు తగిన గుర్తింపు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఈ ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపు బీసీల పట్ల తెలుగుదేశం పార్టీ ఉన్న నిబద్ధతను మరొకసారి చాటి చెప్పింది. రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని ఆశిస్తున్నాము.

LEAVE A RESPONSE