Suryaa.co.in

Telangana

బడుగులకు సీట్లివ్వడం సంతోషం

– ఇదే ట్రెండ్ కొనసాగాలి
– వేములవాడ లో మీడియా తో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

వేములవాడ: రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల గణన చేసిన సర్వే తరువాత జరిగిన శాసనసభ్యుల ద్వారా ఎంపిక అయ్యే శాసన మండలి అభ్యర్థులను బలహీన వర్గాలకు కేటాయించడం శుభసూచకం. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ,ఎస్టీ, బీసీ brs ఒక బీసీ, సిపిఐ కి కేటాయించిన సీటు కూడా బీసీకి కేటాయించండి. ఈ ఐదు స్థానాలు కూడా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీకి ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా స్వాగతిస్తున్న.

అందరికీ ధన్యవాదాలు. ఇదే ఉత్సాహాన్ని ,ప్రోత్సాహాన్ని తీసుకుని రాబోయే కాలంలో 42 శాతం రిజర్వేషన్ల తో పాటు అందరూ ఐక్యంగా ఉండి సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల్లో ఎదగాలని కోరుతున్నా. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహచర మంత్రులకు ధన్యవాదాలు.

పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లు చదువుకునే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 11 వేల కోట్లతో 55 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం సంక్షన్ చేయడం దేశ చరిత్రలో విప్లవాత్మక నిర్ణయం. ఒక విద్యార్థి నాయకుడిగా, బలహీన శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.చాలా చారిత్రక నిర్ణయం.

11 వేల కోట్లు 55 నియోజకవర్గాల్లో ఈ యంగ్ ఇండియా స్కూల్లో ఏర్పాటు చేయనున్నారు. Msme పరిశ్రమల ఏర్పాటు బలహీన వర్గాలు ఉపయోగించుకుని ,బీసీ సబ్ ప్లాన్ భవిష్యత్తులో బీసీలు రాజకీయంగా ఉపయోగించుకోవాలి. శాసనమండలి అభ్యర్థులుగా ఎంపికైన ఐదుగురు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరికి హృదయపూర్వక అభినందనలు.

LEAVE A RESPONSE