– ఉద్యోగాల పేరుతో రూ. 45 కోట్ల మోసం
– అర్జీలు స్వీకరించిన నేతలు
మంగళగిరి: అన్నమయ్య జిల్లా, ఒంటిమిట్ట మండలం పిఎస్ గుంటుకానిపల్లె గ్రామానికి చెందిన అవసాని రమణయ్య విజ్ఞప్తి చేస్తూ.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మేడా భాస్కర్ రెడ్డిలు తమ గ్రామంలో ఎవరైనా చనిపోయినా, లేదా బతుకుదెరువకు ఊరు విడిచి బయటకు పోయినా వారు భూములను కొన్నట్లు డాక్యుమెంట్లు సృష్టించి భూములు కబ్జా చేస్తున్నారని ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఎమ్ఏ షరీఫ్, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ లకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
అలాగే తమ భూమిని కొట్టేశారని దీనిపై తాము కోర్టుకు వెళ్లగా కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని.. అయినా వైసీపీ కబ్జాదారులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు విన్నవించారు. అర్జీలు స్వీకరించిన నేతలు విచారణ జరిపించి తగిన న్యాయం జరిగేలా చూస్తామని బాధితుడికి హామీ ఇచ్చారు. పలువురు అధికార్లతో ఫోన్లలో మాట్లాడి వెనువెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం కొత్తబొమ్మువానిపాలెంకు చెందిన తుమ్మా శివరామిరెడ్డి గీవెన్స్ లో విజ్ఞప్తి చేస్తూ.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అండతో తుమ్మా వెంకట కృష్ణారెడ్డి ఆయన అనుచరులు పోర్జరీ డాక్యూమెంట్లు సృష్టించి పేదలు, ప్రభుత్వ భూములు కొట్టేశారని… వారి కబ్జాలపై అధికారులు విచారించి కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలని నేతలకు ఫిర్యాదు చేశారు.
తిరుపతి జిల్లా, తిరుపతి అర్బన్ మండలానికి చెందిన ఎస్. శామలాదేవి విజ్ఞప్తి చేస్తూ.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు రమేష్ రెడ్డి, సిద్దారెడ్డి, మధు, డి. నరేంద్రలు దౌర్జన్యంగా తమ భూమిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని. ప్రహారి గోడను ధ్వంసం చేశారని వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఆమె నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన సునీత విజ్ఞప్తి చేస్తూ.. గుంటూరులో ఉన్న బుద్ద మెగాషెక్త ఫౌండేషన్ వారు మేగా టీచర్స్ ఉద్యోగాల పేరుతో వందల మంది నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగల నుండి రూ. 45 కోట్ల వరకు దండుకున్నారని.. దీనిపై ఎన్ని సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆందోళన చెందారు. దయ చేసి డీజీపీ ప్రత్యేక చొరవ తీసుకొని నిరుద్యోగులను మోసం చేస్తున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు గ్రీవెన్స్ లో వాపోయింది.
అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన పి.నాగరంగయ్య విజ్ఞప్తి చేస్తూ.. 1969 లో ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని వైసీపీకి చెందిన వ్యక్తి తప్పుడు డాక్యూమెంట్లతో దౌర్జన్యంగా కొట్టేయాలని చూస్తున్నారని.. దయ చేసి అతనిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో తమ స్వాధీనంలో ఉన్న భూములను బలవంతంగా తీసుకొని ఎటువంటి పరిహారం ఇవ్వలేదని అన్యాయంగా పామాయిల్ చెట్లను తొలగించి తమను నష్టపరిచారని.. దయ చేసి తమకు న్యాయం చేయాలని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన కొంపల్లి వెంకట రవణమ్మ వేడుకున్నారు.
ప్రకాశం జిల్లా పామూరు మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన యమ్మని వెంకటరత్నం నేతలకు అర్జీ ఇస్తూ.. తన భూమి మరోకరిపేరుపై ఆన్ లైన్ అయ్యిందని దాన్ని సరి చేసి తను పేరున ఆన్ లైన్ చేయాలని విన్నవించారు.
అనంతపురం జిల్లా కుందుర్తి మండలం యర్రగుంట గ్రామానికి చెందిన ఎం.మంజునాథ్ విజ్ఞప్తి చేస్తూ.. తమ స్వాధీనంలో ఉన్న మెట్ట భూమిని కాపు శ్రీదేవి అనే మహిళ కబ్జా చేశారని అధికారులు విచారించి దయచేసి తమ భూమిని కబ్జా నుండి విడిపించాలని ఆమె వేడకున్నారు.
నాగావళి బ్యారేజీ నుండి ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు, మంచినీరు కల్పించేందుకు 2019 లో ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేస్తే.. ఆ ఉత్తర్వులను తారువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి మన్యం జిల్లాలోని గరుగుబిల్లి మండలంలోని గిరిజన గ్రామాలకు సాగు, తాగు నీరు లేకుండా తీవ్ర అన్యాయం చేసిందని ఆక్కడి ప్రజలు మండిపడ్డారు. దయ చేసి మళ్లీ నిధులు మంజూరు చేసి నీరు అందేలా చూడాలని ఆ గ్రామాలకు చెందిన రైతులు విజ్ఞప్తి చేశారు.