జిల్లాలో టీడీపీ స్వీప్ ఖాయం

– అచ్చెన్నాయుడు ని కలిసిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ని బుధవారం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులు ఎంఎస్ బేగ్, రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి పార్టీకి ఎప్పుడూ వెన్నంటూ ఉండి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తామని, ఐక్యమత్యంతో కష్టపడి పార్టీ గెలుపుకై పని చేస్తామని తెలియజేశారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాబోయే 2024 ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేయటం ఖాయమని, చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అవ్వటం తథ్యమని, తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కార్యకర్తలు తెలుగుదేశం జెండాను మోస్తూనే ఉన్నారు.

వారి శ్రేయస్సే పార్టీకి ముఖ్యమని, అందుకోసం కొన్ని నిర్ణయాలు తీసుకోబడతాయని కార్యకర్తలకు తెలియజేశారు. నాయకులు మారినంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం ఉండదని, రాష్ట్ర భవిష్యత్తుకై అందరూ కలిసి తెలుగుదేశం పార్టీని, మన నాయకుడు చంద్రబాబు నాయుడు ని గెలిపించుకోవాలని ఆయన తెలిపారు.

Leave a Reply