-మొదటి బ్యాచ్ ఉపాధ్యాయులకు జాబ్ ఆఫర్ లెటర్స్ అందచేసిన చంద్రబాబు నాయుడు
-టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు
చంద్రబాబు హామీ
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలోని ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ పొంది అమెరికాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సోమవారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలోఆయన జాబ్ ఆఫర్ లెటర్స్ అందచేశారు.
అమెరికాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన నార్ల కరుణశ్రీ, నీలిమ వల్లాల, హర్షిత ఫ్రియదర్శిని, ప్రీతికమల్ భల్లా, షేక్ మీరావలీ, బొబ్బిలి వెంకట సత్యనారాయణ, స్టాన్లీ శాంసన్, రామరాజు మరియు కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా ఆయన వారితో పాటు జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ ను మరియు ఉద్యోగాలను ఉచితంగా కల్పిస్తున్న డాక్టర్ వేమూరు రవికుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఇప్పటి నుంచే టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ పొంది భవిష్యత్తులో రాబోయే ఉద్యోగాలకు సిద్ధం కావాలని సూచించారు. వీరితో పాటు డిజిటల్ మార్కెటింగ్ లో శిక్షణ అనంతరం ఉద్యోగాలు పొందిన మరో నలుగురికి కూడ ఆఫర్ లెటర్స్ అందచేశారు.
ఎన్ఆర్ఐ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ వేమూరు రవికుమార్, టిడిపి బ్రాహ్మణ సాధికారత స్టేట్ కో-ఆర్డినేటర్ కె బుచ్చిరాంప్రసాద్, టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ ట్రైనిర్లు యామిని పెండ్యాల, భవానీ, భాను, అడ్మినిస్ట్రేషన్ విభాగం డివి రావు, హిమజ, సాయికృష్ణ, మరియు ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.