Suryaa.co.in

Telangana

నాన్-పర్ఫార్మింగ్ అకౌంట్ గా మారిన తెలంగాణ

– ప్రభుత్వ ‘సిబిల్ స్కోర్’ పడిపోయింది
– హాస్టళ్లలో గుడ్లు, పాలు లేని దుస్థితి
– చిన్న సరఫరాదారులకు బిల్లులు చెల్లించకుండా, పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం వేల కోట్ల రూపాయలు విడుదల
– కమిషన్లకు దొరికే అవకాశాలకే నిధులు
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం “నాన్-పర్ఫార్మింగ్” అకౌంట్ (ఎన్పీఏ) మారిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో 50% మంది రైతులకు కూడా మాఫీ చేయకుండా ఉన్నదని, ఇది కూడా ప్రభుత్వ పాలనలో ఎన్పీఏగానే భావించాల్సిన పరిస్థితి.

రైతుబంధు విషయంలో మూడు సీజన్ లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కేవలం ఒకే సీజన్ దాంట్లో కూడా చాలామందికి కోతలు పెట్టి దాంట్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్పీఏ అయిపోయింది.సివిల్ సప్లై కార్పొరేషన్‌కు ప్రభుత్వం సమయానికి చెల్లింపులు చేయకపోవడం వల్ల ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయింది. ఈ కారణంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్బీఐ కూడా మందలించిందని సమాచారం వస్తున్నది.

ప్రభుత్వం చేతిలో ఉన్న సంస్థలు రుణాలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకులు ఆ సంస్థలను ఎన్పీఏలుగా ప్రకటించబోయే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనూ, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ, 10-11% వడ్డీకి రుణాలు తీసుకుంటున్నా కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వటానికి వెనకడుగేయడం ఆర్థిక అనిశ్చితిని సూచిస్తున్నదని విమర్శించారు.

గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తరువాత ఏడున్నర నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాయి. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీపై, కేంద్ర మంత్రులపై, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అబద్ధపు ఆరోపణలు చేస్తోంది.

గత 11 సంవత్సరాల్లో కేంద్రం తెలంగాణకు 11 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది, బీఆర్ఎస్ హయాంలో కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పెద్దఎత్తున నిధులు కేటాయించింది.లెక్కలతో సహా చెప్పినం 11 సంవత్సరాలలో 11 లక్షల కోట్లు ఒక పక్కక ఇస్తే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చామనేది లెక్కలు చెప్పినం.

ఈ సంవత్సరన్నర కాలంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఎంత గొప్పగా సహాయం చేస్తున్నదో ఆ వివరాలు కూడా చెప్పినం. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాట్లాడినరు. అసెంబ్లీలో కూడా చెప్పారు. ప్రతి ఒక్క స్కీమ్ లో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావాలనుకుంటున్నాం. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ గొప్పగా కేంద్రం సహకరిస్తున్నది అని చెప్పారు.

స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందని చెప్పారు. కానీ మరోవైపు ఎనిమిది ఎంపీలు ఉన్నా కేంద్రం ఏమిచ్చిందని ప్రశ్నించడం ద్వంద్వ వైఖరిని సూచిస్తున్నది.

ఈరోజు కేంద్ర ప్రభుత్వమే సహకరించకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేసేటటువంటి పరిస్థితి లేదు. ప్రతి నెలా జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. ఇంత ఘోరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను తయారు చేసి, ఈరోజు ఫీజ్ రీయింబర్స్ మెంట్ విషయంలో కాలేజీలన్నీ కూడా మూతపడే స్థితిలో ఉన్నాయి. కాంట్రాక్టర్లకు మాత్రమే పేమెంట్లు అవుతున్నాయి.

ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు పేషెంట్లను పట్టించుకునే పరిస్థితిలో లేదు. కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, ఫీజు రీయింబర్స్‌మెంట్ జాప్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో గుంతలు పూడ్చే పరిస్థితి లేకపోవడం.. రాష్ట్రంలోని దుస్థితిని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం తీసుకున్న అప్పుల మీద ఆర్సి ఇప్పటికే ఎన్పిఏ డిక్లేర్ చేసింది.

ఈ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఒక్కొక్క సంస్థలు ఈ రకంగా బ్యాంకులు ఎన్పీఏ డిక్లేర్ చేస్తా పోతే.. రేపు రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ కూడా అప్పులు పుట్టేటటువంటి పరిస్థితి లేదు.బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద లక్షల కోట్ల రూపాయల అప్రలభారం మోపి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకా గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదుగుతుందని ప్రజలు ఆశించారు. ఉద్యమాలతో సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అప్పులరాష్ట్రంగా మార్చేశాయి. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మీద అనవసర నిందలు మోపుతూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. హాస్టళ్లలో గుడ్లు, పాలు లేకపోవడం దుస్థితికి ఉదాహరణ. చిన్న సరఫరాదారులకు బిల్లులు చెల్లించకుండా, పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారు. కమిషన్లకు దొరికే అవకాశాలకే నిధులు వెళ్తున్నాయి. ల్యాండ్ అక్విజేషన్ కోసం కావలసిన నిధులు విడుదల చేయక, ముఖ్యమైన ప్రాజెక్టులను నిలిపేశారు. దీనివల్ల అభివృద్ధి కుంటుపడింది.

దేశంలో మరే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణంగా పడిపోలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలిసి నాశనం చేశాయి. ప్రజలు పాలనకు అవకాశం ఇచ్చిన రాష్ట్రాన్ని సమర్థంగా నడపలేకపోతున్న కారణంగా ఈ రోజు అన్ని రంగాల్లో రాష్ట్రం ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్న కారణంతో ఇప్పుడు దోచుకోవాలన్న తపనతోనే ముందుకు పోతోంది.

అసెంబ్లీ సమావేశాలు వెంటనే ఏర్పాటు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పులను మించి, ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఎక్కువ అప్పులు చేస్తోంది. ప్రభుత్వ లావాదేవీల్లో పారదర్శకత లేకపోవడం వల్ల ప్రభుత్వ ‘సిబిల్ స్కోర్’ పడిపోయింది. బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.

రాష్ట్రంలో 5 లక్షల రూపాయల బిల్లు మీద సంతకం కావాలన్నా ఆర్థిక మంత్రి సంతకం చేస్తే గానీ ఈ రాష్ట్రంలో బిల్లులు మంజూరు అయ్యే పరిస్థితి లేదు. ఉద్యోగులు, హాస్టల్ విద్యార్థులు, రైతులు, వ్యాపారులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీ సబ్సిడీలు కూడా రావడం లేదు. అందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE