Suryaa.co.in

Andhra Pradesh Telangana

చంద్రబాబు కోసం తెలుగు ప్రజలు నిలబడ్డారు: నారా భువనేశ్వరి

-ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో డిజిటల్ క్యాలెండర్‌ ను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి
-నారా భువనేశ్వరికి నూతన సంవత్సర‌ శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది
-రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన భువనేశ్వరి

53రోజులు పాటు చంద్రబాబు కోసం నిలబడిన‌ తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు. కేసులకు బయపడకుండా ప్రజలు బయటకు వచ్చి మాకు అండగా నిలబడ్డారు. చంద్రబాబు గారి కోసం నిలబడినందుకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మహిళలు నా మనస్సులో ఎప్పటికీ ఉండిపోతారు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు కోసం తెలుగు ప్రజలు నిలబడ్డారు. నూతన ఏడాదిలో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్ష. కొత్త ఏడాదిలో ప్రజలు అనుకున్న లక్ష్యాలను సాధించాలి. చిరునవ్వుతో రోజును ప్రారంభిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చు.

చంద్రబాబు వస్తేనే ఆంధ్రప్రదేశ్ మళ్లీ అగ్రస్థానానికి: మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్
ఆంధ్రప్రదేశ్ మళ్లీ అగ్రస్థానంలోకి రావాలంటే, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే అది సాధ్యం అవుతుందని, మాజీ ఎంపి కంభంపాటి రామమోహన రావు పేర్కొన్నారు..సోమవారం హైదరాబాద్ లోని మాజీ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి మాట్లాడుతూ ఎన్టీఆర్ సామాజిక సంస్కరణలు తెస్తే, చంద్రబాబు ఆర్ధిక సంస్కరణలతో సమాజంలో సంపద సృష్టించడమే కాకుండా, ఆ సంపద పేదలకు పంచిపెట్టారని కొనియాడారు..దేశవిదేశాలన్నీ తిరిగి పెట్టుబడులను పెద్దఎత్తున రాబట్టి అనేక పరిశ్రమలు నెలకొల్పి లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలను విస్తృతం చేశారని, వందలాది కాలేజీలను స్థాపించి ఎడ్యుకేషన్ హబ్ గా, ఎంప్లాయిమెంట్ హబ్ గా రాష్ట్రాన్ని మార్చారని గుర్తుచేశారు.

గత 5ఏళ్ల జగన్మోహన రెడ్డి పాలనలో పరిశ్రమలన్నీ ఏపీ నుంచి తరలిపోవడం, ఉపాధి కోసం యువత వలసలు పోవడం బాధాకరం అన్నారు..టిడిపి హయాంలో అగ్రస్థానంలో ఉన్న ఏపీని అధోగతి పాల్జేశారని ధ్వజమెత్తారు..మళ్లీ చంద్రబాబు సీఎం అయితేనే ఆంధ్రప్రదేశ్ కు పునర్ వైభవం సాధ్యమని ఆకాంక్షించారు.

బాబుకు “శ్రీమద్భగవద్గీత”ను అందజేసిన బక్కని
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ను టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, షాద్ నగర్ టిడిపి మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సోమవారం హైదరాబాద్ లోని చంద్రబాబు స్వగృహంలో ఆయనను కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర కానుకగా శ్రీమద్భగవద్గీతను బాబుకు స్వయంగా అందజేశారు. బాబును కలుసుకోవడం ఆనందంగా ఉందని ఈ నూతన సంవత్సరం రోజున చంద్రబాబు తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా కొనసాగాలని దేవుని ప్రార్థించినట్లు భక్తి చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు పార్టీ శ్రేణులకు అధికారులకు అనధికారులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేశారు

నూతన సంవత్సరంలో టీడీపీ మరిన్ని విజయాలు: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన
రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ హైదరాబాద్ లో ఎన్ టి ఆర్ ట్రస్టు చైర్ పర్సన్ నారా భువనేశ్వరి ఆవిష్కరించిన డిజిటల్ క్యాలెండర్ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ తెలుగువారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకునేది ఒక్క టీడీపీ మాత్రమేనన్నారు. నూతన సంవత్సరంలో టీడీపీ మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ భవిష్యత్తులో కీలకపాత్ర పోషించబోతోందని జోస్యం చెప్పారు.

ఏపీ సీఎంగా ప్రజలకు చంద్రబాబు నూతన సంవత్సర కానుక
– తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి

ఏపీ ప్రజలకు చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా నూతన సంవత్సరం కానుకగా ఇవ్వనుందని తెలంగాణ తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి జోస్యం చెప్పారు. చంద్రబాబును కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన షకీలా మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ప్రారంభం టీడీపీని వేధించినప్పటికీ, చివరలో విజయచైతన్య స్ఫూర్తి నింపిందన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, అందుకు జగన్ సర్కారు మరో మూడునెలల్లో తగిన మూల్యం చెల్లించుకోబోతోందన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీ కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేయనుందని షకీలా చెప్పారు.

తెలుగు యువత క్యాలెండర్ ఆవిష్కరణ
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని తెలుగు యువత మల్కాజ్‌గిరి పార్లమెంట్ అధ్యక్షులు సాయి నాగార్జున హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీస్సులు తీసుకుని, వారి చేతుల మీదగా “తెలుగు యువత – మల్కాజ్‌గిరి పార్లమెంట్ 2024” క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.

LEAVE A RESPONSE