Suryaa.co.in

Andhra Pradesh

థ్యాంక్స్ లోకేశ్!

ఒక విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియేట్ ఒక గేంచేంజర్.

లాక్డౌన్ తరువాత ప్రపంచంలో పరిస్థితులు మారాయి.

పదవ తరగతి తరువాత ఇంటర్మీడియేట్‌లో పిల్లలను చేర్చడం మీద ప్రతి తల్లిదండ్రీ పడే తపన మామూలుగా ఉండదు.

టీనేజ్ వయసులో ఉంటారు పిల్లలు. తెలియక ఒక సారి ఇంటర్లో చేరాక, ఎంపీసీ చదివే పిల్లలు వైద్య విద్యకు, బైపీసీ చదివే పిల్లలు ఇంజినీరింగ్ చదువులకు మారే వెసులుబాటు లేదు.

పొరుగున కర్ణాటక లాంటి రాష్ట్రాలలో పిసిఎంబీ కోర్సు ఉంది. పిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్, బాటనీ చదువుతారు. వారు జేఈఈకి, నీట్‌కు రెంటికీ ప్రిపేర్ అవుతారు. అలా మన రాష్ట్రంలో పూర్వం ఉన్న ఎంబైపీసీని తిరిగి ప్రవేశపెట్టడం మంచి నిర్ణయం. కష్టపడే విద్యార్థులు రెండిటిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటారు. అప్పటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఇంజినీరింగ్, వైద్య విద్య వైపు వెళతారు. మేథ్స్ ఉండడం వలన పిజిక్స్ కొంత సులభంగా చెయ్యగలుగుతారు.

బోర్డు పరీక్షల మార్కుల మీద విపరీత శ్రద్ధ పెట్టే పెద్ద పెద్ద ప్రశ్నల సమాధానాలు మళ్లీ మళ్లీ వల్లెవేసే కష్టాలను తప్పించి, మల్టిపుల్ చాయిస్ కొచ్చన్స్ పెట్టడం వలన సబ్జెక్ట్ మీద కాన్సెంట్రేట్ చేస్తారు పిల్లలు. అలాగే ఎంట్రన్స్ పరీక్షల మీద సమయం కేటాయించి, శ్రద్ధ పెట్టే అవకాశం లభిస్తుంది.

తక్కువ ఖర్చుతో వివిధ రాష్ట్రాలలో చేరి, బీఎస్సీ నర్సింగ్ చేసుకొని కేరళ పిల్లలు, దేశంలోని డాక్టర్లకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు విదేశాల్లో, డిమాండ్ వలన.

ఆ విధంగా చూసినా.. ఒక వేళ ఇంజనీరింగ్ వద్దనుకొని, నీట్లో రాకపోతే బీఎస్సీ నర్సింగ్ చేసుకొనే వెసులుబాటు కలుగుతుంది. బీఎస్సీలో హాస్పిటల్లో వాడే టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ మీద కోర్సులకు కూడా డిమాండ్ వుంది. దానితో అతి తక్కువ ఖర్చుతో మంచి జీతాలు, విదేశీ అవకాశాలు లభిస్తాయి. దేశీయంగా కూడా డిమాండ్ వుంది. చాలా ఆసుపత్రులలో ఎమ్మారై స్కాన్ నుండి 2డి ఎకో వరకు ఆపరేటర్స్, డాక్టర్ల కొరతతో.. ఆ స్కానింగులు వాయిదాలు వేసి, అపాయింట్మెంట్లు ఇస్తున్నారు.

ప్రపంచం చదువుకొని వచ్చావు కాబట్టి నీకు ఇవన్నీ అర్థం అవుతాయి. పాదయాత్రతో ప్రజలలోకి వెళ్లావు కాబట్టి ఇక్కడ పరిస్థితులు నీకు అర్థం అయ్యింది. రెండూ చూసిన మీరు అవగాహనతో.. అద్భుతమైన నిర్ణయాలు తీసుకొన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రుల తరపున మీకు కృతజ్ఞతలు.

LEAVE A RESPONSE