Suryaa.co.in

National

నిర్మూలనే కూటమి లక్ష్యం

– కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్

న్యూఢిల్లీ: కార్మిక సంస్కరణలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ముందంజలో ఉందని, విజనరీ లీడర్ నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కార్మిక సంస్కరణలు 2015 నుండే అమలు చేశారని, వాటినే ఇప్పుడు కేంద్రం చాలావరకు అమలు చేస్తుంది అని కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. వేదిక పైన అన్ని రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రుల్ని ఉద్దేశించి సుభాష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పెట్టుబడుల ఆకర్షణతో పారిశ్రామికీకరణలో ముందంజలో ఉండడంతో పాటు కార్మికుల సంక్షేమం పట్ల కూడా ఎంతో శ్రద్ధ వహిస్తుందని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

ఎన్టీఆర్ భరోసా ద్వారా 4000 నుండి 15000 వరకు పెన్షన్లను అందిస్తున్నారని, ఇది దేశంలోనే అత్యధికమని, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు బీమా అందిస్తున్నారని ఇది కూడా దేశంలోనే అత్యధికమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి పేదల ప్రజల పట్ల కార్మికుల పట్ల ఉండే నిబద్ధతకు ఇది నిదర్శనం అని కేంద్రమంత్రి కొనియాడారు.

ప్రస్తుతం కేంద్రం అమలు చేయాలనుకుంటున్న చాలావరకు కార్మిక సంస్కరణలు 2015 లోనే చంద్రబాబు నాయుడు అమలు చేయడం ఆయన విజనరీ నాయకత్వానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కొనియాడారు అని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమ ప్రోత్సాహకాల విషయంలోను, ఉద్యోగ అవకాశాల విషయంలోను ప్రణాళిక బద్దంగా సాగుతున్నాం. పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూటమిగా పని చేస్తున్నామని మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE