Suryaa.co.in

Devotional

భగవద్గీత చావు మేళం కాదు…కారాదు

ఇదేం దరిద్రం అసలు?
దయచేసి చనిపోయిన శవాల వద్ద భగవద్గీతను పెట్టకండి.
వినాశకాలే విపరీత బుద్ధి

భగవద్గీతను “శవ” సంకేతానికి , “శవయాత్రలకు” మొట్టమొదట ప్రారంబించిన..(………) ఎవరో కానీ..
పవిత్రమైన, జ్ఞానప్రదాయని అయిన భగవద్గీతను “పీనుగ లేచింది” అనే సంకేతంగా మార్చిన పైత్యం ఎవరు నేర్పినారు?
ఇంట్లో భగవద్గీత పెట్టుకోవాలంటేనే భయపడే స్తితికి తీసుకొచ్చారు.
ఒకప్పుడు బ్రహ్మముహూర్త కాలంలో , ప్రభాత వేళలో గుడి మైకులనుండి వినబడే ఆ మధురమైన ఘంటసాల గారి భగవద్గీత మనోల్లాసాన్ని కలిగించేది.
అనంత కాలగమనంలో మనిషి జీవితం ఎంతచిన్నదో … కాలస్వరూపమైన దైవం ఎంత విస్తృతమో నిత్యం గుర్తు చేస్తూ ఉండేది.
పండితుడైనా పామరుడైనా ఒక విధమైన ట్రాన్స్ లో కి తీసుకెళ్ళేది … ఏదో తెలియని ఆధ్యాత్మిక భావన అనిర్వచనీయమైన హృదయ వైశాల్యాన్ని కలిగించేది.
అటువంటి భగవద్గీతకు ఎంత భ్రష్టత్వం ఆపాదిస్తున్నాము.
కలికాల ప్రభావమా ?
దైవ ఉపాసనలకు బదులు, పిచాచ ఉపాసనలు.

అసలు ఏం ఖర్మ ఇది మనకు ?
ఈ దేశం మొత్తం భూత ప్రేతాలు ఆవహించాయా ?
ఇప్పటికైనా మారుదమా..? లేక పాపం మూట గట్టు కుందామా?
ఆలోచించండి ఈ నీచ సంస్కృతి నుండి బయటపడదాం.
ఒక ఉద్యమంలా అవేర్నెస్ కలిగించు దాం .
అవును నేను నిజమైన హిందువునే, మీరు నిజమైన హిందువే అయితే ఇప్పటినుండి చావుల దగ్గర, భగవద్గీత వేయకుండా ఆపుదాం.
ప్రతి రోజు ఒక గీత శ్లోకం చదువుదాం, అర్థం చేసుకుందాం. నలుగురికి తెలియచేద్దాం.
ఉత్తమ జీవన గ్రంథం గీతా
వేదిపనిషద్ లా సారం గీతా

– రమేష్ తాళ్లపల్లి

LEAVE A RESPONSE