అధికార యంత్రాగాన్నిజగన్ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు

– జబీన్ కు బీసీ-ఇ కులదృవీకరణ పత్రం ఇవ్వకపోవడం దుర్మార్గం
– ముస్లింలకు రాజకీయ సమాధి కట్టాలని వైసీపీ ప్రయత్నం
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్ నసీర్
దుగ్గిరాల ఎంపీపీగా పోటీ చేయాలనుకున్న షేక్. జబీన్ కు బీసీ-ఇ కుల దృవీకరణ పత్రం ఇవ్వాలని ఎమ్మార్వోకు అప్పీల్ చేసుకుంటే షేక్ కులానికి చెందిన వ్యక్తి కాదని తిరస్కరించారు. రాజకీయ ఒత్తిడితో ముస్లిం మహిళలకు బీసీ-ఇ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపుతున్నారు. దీనిపై వెంటనే విచారణ చేయాలని కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది. గతంలో 2012 జీవో నంబర్ 23 ద్వారా షేక్ ఇంటిపేరు కలిగిన వారిని బీసీ-ఇ కులాలుగా పరిగనించాలని జీవో విడుదల చేశారు. ఇది జబీన్ ఒక్కదానికే సంబందించిన విషయం కాదు.
అధికార యంత్రాంగాన్ని పూర్తిగా చెప్పుచేతల్లో పెట్టుకున్న ఈ ప్రభుత్వాన్ని అంతమొందించాలి. సామాన్య ముస్లిం కుటుంబానికి చెందిన ముస్లిం కుటుంబం మహిళ అధికార పార్టీని ఢీకొట్టి జబీన్ ఎంపీటీసీగా గెలిచారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని, ఎమ్మార్వోను లోబరుచుకుని సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. కోర్టుకెళ్లి ఆర్డర్ తెచ్చుకుని కోర్టు పరిశీలించాలని చెబితే కలెక్టర్ కూడా జబీన్ తండ్రి మొహ్మద్ అని పేరు పెట్టుకున్నారని అంటున్నారు.
మొహమ్మద్ అనే పేరు కూడా జీవో 23లో బీసీ-ఇ కిందకు వస్తుందన్న విషయం కలెక్టర్ కు తెలీదా.? జబీన్ కుటంబంలోని పిల్లలకు ఆరునెల్లకిందకు బీసీ-ఈ సర్టిఫికేట్ ఇచ్చారు. రాజకీయాల కోసం గొంతుకోసే కార్యాక్రమాన్ని కలెక్టర్ చేపట్టారు. బీసీ-ఇ సర్టిఫికేట్ మీద న్యాయస్థానాల్లో పోరాడతాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి, జగన్ రెడ్డి, కలెక్టర్ కు సమాధానం చెప్తాం. ముస్లింల హక్కులను కాలరాస్తున్నారు.
ముస్లింలలో కులం, మతం లేదు..ఒక్కటే కులం..ఒక్కటే మతం. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ వాళ్లను బీసీ-ఇ గా పరిగణించాలి కోర్టులు చాలా సార్లు చెప్పాయి. గుంటూరు కలెక్టర్ ముస్లింలను రాజకీయంగా సమాధిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని వదిలిపెట్టం. ముస్లింల జోలికి రావద్దు. మీ దురాగతాలను ముస్లింలు ఒప్పుకోరు. ప్రతి ఒక్కరూ బీసీ-ఇ సర్టిఫికేట్ ఇవ్వాలని ముస్లింలు అడగాలి.

Leave a Reply