Home » కరెంట్ విషయంలో లెక్కలేని తనం..ముందుచూపు బ్రహ్మాండం!

కరెంట్ విషయంలో లెక్కలేని తనం..ముందుచూపు బ్రహ్మాండం!

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నార్త్ నుండి సౌత్ కు గ్రిడ్ కలిపి మోడల్ గా 24×7 కరెంటు సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చింది. గత ప్రభుత్వం చేసుకున్న ఎలక్ట్రిసిటీ పీ. పీ. ఎ అగ్రిమెంట్లు ( సోలార్ పవర్ హైడ్రో పవర్, విండ్ పవర్) రేట్లు ఎక్కువని వాటిని రద్దు చేస్తామని.. కరెంటు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యునిట్ రెండు రూపాయలకు దొరుకుతుందని, గత ప్రభుత్వం దుర్బుద్ధితో వ్యక్తిగత స్వార్థంతో ఎక్కువ రేటుకు అగ్రిమెంట్ చేసుకొన్నారని వాటిని రద్దు చేస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వ మంత్రులు ప్రహ్లాద్ జోషి ,ఏ కే సింగ్ జోక్యం చేసుకుని ఈ విధంగా చేయడం ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీనే దెబ్బ కొడుతుంది. ప్రైవేట్ పెట్టుబడిదారులు ఎవరు ఎలక్ట్రిసిటీ తయారుచేయడానికి పెట్టుబడి పెట్టరని ఇది మంచి సంప్రదాయం కాదని వివరించారు.
ఈ రోజున ఉన్నపళంగా మీరు మాకు ఎలక్ట్రిసిటీ వినియోగం 20% పెరిగింది. మాకు ఇప్పుడు కరెంటు ,బొగ్గు సరఫరా ఎక్కువ కావాలి అని ప్రధానమంత్రి కి ముఖ్యమంత్రి ఉత్తరాలు రాశారు ..గతంలో ప్రభుత్వం తీసుకున్న బొగ్గు సరఫరా దారులకు, మీరు బిల్లులు చెల్లించకుండా ఆ రేట్లు మేము ఇవ్వలేమని ఆపేసి, వారిని ఇబ్బందులకు గురిచేసిన విషయం ఎవరూ మర్చిపోలేదు .
ఈ రోజున కరెంట్ వినియోగం పెరిగిందని.. అప్పటికప్పుడు కరెంటు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది మీకు తెలియదా? ప్రధానమంత్రి కి లెటర్ రాస్తే వస్తుందా ? మీకు ముందు చూపు లేకుండా అన్ని రకముల కరెంటును ఉత్పత్తి చేయుటకు మీరు సహకరించకుండా , కరెంట్ అప్పటికప్పుడు మీకు కావలసినప్పుడు ఉత్పత్తి అవుతుందా ? మీకు ముందుచూపు లేక మీరు బొగ్గుకు డబ్బు కట్టకుండా ఉన్న ఉదాహరణ 1 మీకు చెప్తాను .
మా నెల్లూరు జిల్లాలో దామోదరం సంజీవయ్య ధర్మల్ పవర్ స్టేషన్, బొగ్గు ఆధారిత ఎలక్ట్రికల్ కేంద్రం ఉంది. 800 మెగావాట్ల కెపాసిటీ కలిగిన మూడు యూనిట్లు సరిపడా డిజైన్ చేసి కట్టి ఉన్నారు. దీనికి మొత్తం పెట్టిన ఖర్చు 18 వేల కోట్లు నుండి 20 వేల కోట్లు ప్రజల డబ్బు కానీ ఏ రోజు కూడా అందులో మూడు యూనిట్లు,ఎపుడూ పని చేయించలేదు.
నేను ఒకసారి ఆ పవర్ స్టేషన్ కెళ్ళి అధికారులను విచారిస్తే , మూడు యూనిట్లు ఎందుకు పని చేయవని అడిగితే వారు చెప్పే సమాధానం ఏమిటంటే … ఎప్పుడు బొగ్గు కొరత వల్ల పని చేయవు అని చెప్పారు. ఒకసారి ఆలోచిద్దాం. వేల కోట్లు ఖర్చు పెట్టి పవర్ జనరేషన్ సంస్థను నిర్మించి, బొగ్గుకు పెట్టుబడి పెట్టుకోలేక ఆపుకోవడం ఏంతో సిగ్గుమాలిన పని, చేతకాని పని, దద్దమ్మలు చేసే పని . అందువల్ల ఎంత నష్టంమో కింద లెక్క ఇస్తున్నాను.
ఆర్థికపరంగా లెక్కలు వేస్తే ఈరోజు ఒక యూనిట్ ను 18 నుంచి 20 రూపాయలకు బయట అమ్ముతున్నారు. అంటే ఎనిమిది వందల మెగావాట్ల ధర్మల్ స్టేషన్లో, ఒక గంటకు ఒక యూనిట్ రన్ చేస్తే 8,00,000 యూనిట్లు కరెంట్ ఉత్పత్తవుతుంది. ఒక 800 మెగావాట్ల యూనిట్ కు ఒక రోజుకు తొమ్మిది వేల టన్నుల బొగ్గు కావాలి. తయారయ్యే కరెంటు గంటకు ఎనిమిది లక్షల యూనిట్లు. రెండు యూనిట్లు ఆగి ఉన్నాయి అంటే ఒక గంటకు 16 లక్షల యూనిట్లు. కరెంటు అన్ని సదుపాయాలు ఉండి కేవలం , బొగ్గు కొననందువల్ల జరిగే నష్టం కింద వివరాలు చూద్దాం.
8,00,000 × 24 ( గంటలు) =19,20,000 యూనిట్స్
తయారు ఖర్చు. 19,20,000 × 4 = 768,00,000
ప్రస్తుత మార్కెట్ కరెంట్ రేటు 19,20,000 × 18 =34,56,00,000
రోజుకు బొగ్గు లేనందువలన నష్టం 34,56,00,000 – 7,68,00,000 =26,88,00,000. అంటే రోజుకు 26 కోట్ల 88 లక్షలు నష్టం . (ఎనిమిది వందల మెగావాట్ల యూనిట్లు రెండు ఆగి ఉన్నాయి) అంటే రోజుకు యాభై మూడు కోట్ల 76 లక్షల రూపాయలు నష్టం అన్నమాట.
దీనిని బట్టి మీకు ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మీద ఏ మాత్రం శ్రద్ధ ఉందో.. ఎంత లెక్క లేని తనం ఉందో అర్థమవుతుంది. అనవసరమైన పథకాలకు కోట్లు ఖర్చు పెట్టి, అవసరమైన బొగ్గు సరఫరాకు డబ్బులు ఖర్చు పెట్ట కుండ, రోజుకు 53 కోట్ల 76 లక్షల రూపాయలు నష్టం చేయడం క్షమించరాని నేరం. ఇటువంటి విషయాలలో ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోవడం ఏమనుకోవాలి? ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడా ఉండదు. ప్రజల డబ్బు అంటే మీ సొంత డబ్బులు లాగా అనుకొని, లాభనష్టాలు బేరీజు వేసుకొని బాధ్యతగా పరిపాలించాలి.

మీ ఉద్దేశం కేంద్రానికి లెటరు రాశానులే.. ఆ బాధలు ఏవో వారే పడతారు అని మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. ఇది చాలా తప్పు. గతంలో కరోనా సందర్భంలో ఆక్సిజన్ సరఫరా దగ్గరనుండి, నిధులు సమీకరించే దగ్గరనుండి ,ప్రజలకు తోడ్పాటు అందించే దగ్గరనుండి, వ్యాక్సిన్ దగ్గరనుండి( ప్రపంచ దేశాలలో ఏ దేశంలో కూడా కరోన వచ్చిన ఏడు నెలల్లో స్వదేశంలో తయారీ వ్యాక్సిన్ తెచ్చినది మోడీ మాత్రమే. కరోన చావులు కూడా జనాభా ప్రాతిపదికన మన దేశంలో అతి తక్కువ) వచ్చిన కేంద్రం బాధ్యతగా పనిచేస్తే ,తప్పు అంతా కేంద్రానిది.. ఒప్పంతా రాష్ట్రాలదిగా ప్రచారం చేసుకున్నారు. ఈ పద్ధతి మానుకొని, ముందుచూపుతో ప్రభుత్వాలు నడవకపోతే మిమ్మల్ని ప్రజలు క్షమించరు.

– కరణం భాస్కర్
బిజెపి, నెల్లూరు
7386128877.

Leave a Reply