Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ ఉద్యోగస్తుల గర్జనతో “ప్రభుత్వ పునాదులు” కదిలాయి

– ఉద్యోగస్తులతో ఆటలు “ఉరికంబంతో” చెలగాటం లాంటిది!
– రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల,పెన్షనర్ల సహనాన్ని చేతగానితనంగా చూడకండి.”పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప” అన్న మహనీయుడు “కార్ల్ మార్క్స్” బాటలో విజయవాడ గర్జన సభకు మహిళలు సైతం రైలు పట్టాలపై సభాస్థలికి చేరుకోవడం ప్రజా చైతన్యానికి నాంది!

ఏపీ ఉద్యోగ సంఘాల విజయవాడ గర్జన విజయవంతంతో ప్రభుత్వ పతనం ప్రారంభమైంది!ఏపీ ఉద్యోగ సంఘ నాయకులు “సినిమా సెలబ్రిటీలు” కాదు ఒక్క పిలుపుతో విజయవాడ గర్జనకు పోటెత్తిన జనం సాక్షిగా ముమ్మాటికీ వారిది “ధర్మపోరాటమే” అని రాష్ట్ర ప్రజానీకానికి చాటి చెప్పారు!

తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా “బిర్యానీ” పొట్లాలకు “క్వాటర్” బాటిల్ లకు 2 వేల రూపాయలకు అధికార పార్టీ వాళ్లు బస్సులలో “తీర్ధయాత్రల” పేరుతో తరలించిన జనం లాంటి వారు కాదు విజయవాడకు తరలి వచ్చిన జన ప్రవాహం అన్న వాస్తవాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి!రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల ఉద్యోగస్తులు రైళ్లలో, బస్సులలో,వాహనాలలో ప్రభుత్వ అడ్డంకులను లెక్కచేయకుండా వివిధ వేషధారణలతో విజయవాడ నగరాన్ని చేరడంతోనే పిఆర్సి సాధన సమితి నైతిక విజయం సాధించారు!

తిరుపతి నగరంలోని టీటీడీ, ఎస్ వి యూనివర్సిటీ, నగరపాలక సంస్థ,ఆర్ అండ్ బి,ఇరిగేషన్, విద్యుత్, ఆర్టీసీ ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగస్తులు జడ్పీ మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘ నాయకులు వేలాది మందిని విజయవాడ సభకు వెళ్లనీయకుండా గృహనిర్బంధం చేయడం “అప్రజాస్వామికం”

రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు వెళ్లకుండా పిఆర్సి సాధన సమితి నాయకులతో చర్చించి ఉద్యమం మరింత ఉధృతం కాకముందే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య రాకముందే రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు

పడకుండా వెంటనే పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేస్తున్నాము!రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యోగస్తుల పోరాటంలో ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతామని హెచ్చరిస్తున్నాను.

LEAVE A RESPONSE