Home » ప్రభుత్వానికి పార్టీకి సంబంధమే లేదు

ప్రభుత్వానికి పార్టీకి సంబంధమే లేదు

సంబంధం ఉందనడం సజ్జల అవివేకం
అడ్వర్టైజ్మెంట్లలో గత ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు
పేరు చివరన రెండు అక్షరాలు ఉండడం, అధికార పార్టీ బూట్లు నాకే వాడు అయితే వదిలేస్తారా
అమెరికాలో కూర్చొని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న వాడి ఆస్తులను కూడా జప్తు చేయగలరా?
సంజు , సుధా చేసే కామెడీని ఆస్వాదించా
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ప్రభుత్వానికి, పార్టీకి సంబంధం ఉండదు. సంబంధం ఉందని పేర్కొనడం సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అవివేకమే అవుతుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. పార్టీ ప్రభుత్వం ఒక్కటేనని ప్రభుత్వ సలహాదారు, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అద్భుతమైన నిర్వచనాన్ని ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇది మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరు కూడా అంగీకరించారన్నారు.

గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఏ పీ వై నీడ్ జగన్ అనే కార్యక్రమంలో వాలంటీర్లను, సచివాలయ, ప్రభుత్వం ఉద్యోగులను భాగస్వాములను చేస్తారట. మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్లు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయమని ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని నిర్వహిస్తారట. ప్రభుత్వ ఖర్చుతో గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ముద్రించిన 24 పేజీల బుక్ లెట్ ను ప్రజలకు పంచుతారట అని విమర్శించారు. గతంలో పత్రికల్లో ఇదే మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ లు ఇచ్చేవారు. గత ప్రభుత్వం పనులుచేయలేదని పచ్చ రంగులో ముద్రిస్తూ, తాము అన్ని పనులను తాము చేశామని నీలిరంగులో ముద్రించే వారిని గుర్తు చేశారు.

ప్రభుత్వ ఖర్చుతో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లలో గత ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు. ముఖ్యమంత్రి ఎవరైనా ఉండవచ్చు. ఆయన కూడా ఒక ప్రభుత్వానికి అధినేతనే. గత ప్రభుత్వాన్ని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు కనీస విజ్ఞత లేకుండా విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏ పీ వై నీడ్ జగన్ అనే పార్టీ కార్యక్రమంలో వాలంటీర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొని ఇంటింటికి బుక్ లెట్ పంచడం కరెక్ట్ కాదని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు. ఈ విషయాన్ని న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం సోషల్ వర్కర్స్ దాఖలు చేయాలని సూచించారు.

రాజకీయ నాయకులు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తే, రాజకీయ రంగు పులుముకుంటుందని న్యాయస్థానాలలో న్యాయమూర్తులు మాట్లాడుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చేవారు కూడా నిస్వార్ధంగానే సేవ చేయాలని అనుకుంటారు. కానీ ఇప్పుడు చాలామంది నిస్వార్థ సేవను మరిచి, తమ స్వార్థానికి రాజకీయాలను వాడుకుంటున్నారన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే పోలీసుల చేత వేధింపులకు గురి చేస్తున్న,
ఈ కిరాతక ప్రభుత్వాన్ని ఎదుర్కొని సామాన్యులు ముందుకు వచ్చి న్యాయస్థానాలలో ఎలా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తారని ప్రశ్నించారు.

ఏ చట్టం ప్రకారం ఆస్తులను జప్తు చేస్తారో సిఐడి చీఫ్ వెల్లడించాలి
ముఖ్యమంత్రికి, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆస్తులను జప్తు చేస్తామని సిఐడి చీఫ్ సంజయ్ పేర్కొనడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు . ఏ చట్టం ప్రకారం ఆస్తులను జప్తు చేస్తారో ఐపీఎస్ అధికారి అయిన ఆయన చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేవు. అసభ్యంగా మాట్లాడితే క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చు. అంతగా తమ పరువుకు నష్టం కలిగిందని భావిస్తే, పరువు నష్టం దావా వేసుకోవచ్చు నని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేని పైవారు చెప్పిన మాటల్ని ఐపీఎస్ చదివి పాసైన సంజయ్ ఆస్తులను జప్తు చేస్తామని బెదిరించడం హాస్యాస్పదంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసెంబ్లీలోనే అసభ్యంగా మాట్లాడిన వారిని అభినందిస్తారు. ఒక ఎంపీని ఉద్దేశించి అసభ్యంగా దూషించిన గుర్కా గాడిని ప్రశంసిస్తారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి సోషల్ పోస్ట్ పెడితే మాత్రం ఆస్తులు జప్తు చేస్తాననడం ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి మరో ఆరు నెలల తర్వాత మాజీ ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు కూడా సంజయ్ ఇవే మాటలు చెబుతారా? అంటూ నిలదీశారు. విదేశాలలో ఉన్న అకౌంట్లను కూడా ఎలా పసికట్టాలో తమకు తెలుసునని పేర్కొన్న సిఐడి చీఫ్, విదేశాల్లో కూర్చొని పేరు చివర రెండు అక్షరాలు ఉన్న ఒక పిచ్చి కుక్క మహిళల గురించి, న్యాయమూర్తుల నోటికి వచ్చినట్లు వాగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.

పేరు చివరన రెండు అక్షరాలు ఉండడం, అధికార పార్టీ బూట్లు నాకే వాడు అయితే వదిలేస్తారా? అంటూ రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రికి ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఏ చట్టం ప్రకారం ఆస్తులను జప్తు చేస్తారో స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమెరికాలో కూర్చొని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న వాడి ఆస్తులను కూడా జప్తు చేయగలరా? అని ప్రశ్నించారు.

పార్టీ కార్యక్రమాలలో వాలంటీర్ల సేవలను ఎలా ఉపయోగించుకుంటారు?
వాలంటీర్లను పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటూ, ఓట్లను రాబట్టుకోవాలని చూస్తున్న వైనాన్ని సిటిజన్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులైన కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి సంపత్ , రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ , జన విజ్ఞాన సమితి అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి , విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాల్ రావు , విశ్రాంత న్యాయమూర్తి భవాని ప్రసాద్ ఇప్పటికే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని న్యాయస్థానంలో దాఖలు చేయడం జరిగిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు .

వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో వాడుకోవడాన్ని వారు తప్పు పట్టారు. ప్రభుత్వ నిధులతో జీతాలను ఇస్తూ, పార్టీ కార్యక్రమాలకు వాలంటీర్లను ఎందుకు వాడుకుంటున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి పెద్దగా అనుభవం లేదని సలహాలు ఇవ్వడానికి ఆయన ఒక సలహాదారున్ని నియమించుకున్నారు. ఆ సలహాదారుడు పార్టీకి, ప్రభుత్వానికి తేడా లేదని పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం ఏమిటి రా… బుద్ధి ఉందా? అని సిటిజన్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు ప్రశ్నించాలని రఘురామ కృష్ణంరాజు కోరారు.

సొంత బాక పత్రికను వాలంటీర్లకు అమ్ముకోవడానికి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో సచివాలయాలను ప్రభుత్వ ధనంతో నిర్మించి వాటికి పార్టీ రంగులు వేశారు. ఇప్పుడు పార్టీ, ప్రభుత్వం ఒకటేనని పేర్కొని, వాటిని పార్టీ కార్యాలయాలు మార్చనున్నారు. సుప్రీంకోర్టు తప్పు పట్టినప్పటికీ, సచివాలయాలకు పార్టీ రంగులు వేశారు. ప్రభుత్వ ఖర్చుతో 24 పేజీల బుక్లెట్ ప్రింట్ చేసి ప్రజల బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తున్నారని, అయినా బ్రెయిన్ ఉన్న ప్రజలు వీరి మాటలను విశ్వసించే పరిస్థితి లేదన్నారు. ప్రజలు తమ మాటలను విశ్వసించి ఓట్లు వేయరని తెలుసుకొని మా ఓట్లు వేరుగా ఉన్నాయని సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని గుర్తు చేశారు.

అందుకే దొంగ ఓట్ల నమోదుపై ఎక్కువగా దృష్టి సారించారు. వాలంటీర్లను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం పట్ల ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన సిటిజన్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు, అడిషనల్ అఫిడవిట్ రూపంలో మరొక పిటిషన్ వేయాలని కోరారు. దీనితో పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్న వాలంటరీ వ్యవస్థను సుప్రీంకోర్టు రద్దు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.

రెండు పోస్టులు ఒకే వర్గానికా?
వైకాపా నాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సాధికారిక యాత్రను నిర్వహిస్తున్న తరుణంలో, రెండు కన్ఫామ్డ్ ఐఏఎస్పోస్టులకు ఇద్దరు రెడ్డి అధికారులనే ఎంపిక చేశారు. రాష్ట్రంలో ఎంతోమంది నిజాయితీపరులైన అధికారులు ఉండగా, పేరు చివరన రెండు అక్షరాలు ఉన్న వారిని ఎంపిక చేయడం ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కన్ఫామ్డ్ ఐఏఎస్ అధికారుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని ఎందుకు పాటించలేదని నిలదీశారు.

ముఖ్యమంత్రి పాటించే సామాజిక న్యాయం అంటే, తన సామాజిక వర్గానికి పెద్దపీట వేయడమేనని అనుకుంటున్నారేమోనని విమర్శించారు. సామాజిక సాధికారిక యాత్ర నిర్వహిస్తున్న ప్రస్తుత సమయంలోనైనా, కనీసం ఇతర వర్గాలకు న్యాయం చేస్తున్నట్లుగా నటించాలని హితవు పలికారు. ఒకవైపు కులము చూడం, మతం చూడమని చెబుతూనే… మరొకవైపు పేదల పక్షాన పెత్తందారులతో పోరాడుతున్న మీ బిడ్డకు మద్దతుని ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే. పేదలు, పెత్తందారులకు మధ్య ఉన్న వ్యత్యాసం ఆయనకు తెలియడం లేదు.

బహుశా పెత్తందారులు అంటే తినడానికి తిండి లేని వారిని ఆయనకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడు చెప్పి ఉంటారు. పేదవాళ్లు అంటే ఖరీదైన కార్లలో తిరుగుతూ, విలాసాలతో జీవించే వారిని చెప్పి ఉంటారని అందుకే ఆయన తాను పేదల పక్షాన పెత్తందారులతో పోరాడుతున్నానని చెబుతున్నారంటూ అపహస్యం చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ని మించిన పెత్తందారి మరొకరు లేరు. ఢిల్లీ పెద్దలు ఇలాగే చూస్తూ ఊరుకుంటే, దేశంలో ఆయనను మించిన పెత్తందారి మరొకరు ఉండరన్నారు.

విధినిర్వహణలో ఎలా మసులుకోవాలో తెలియని వారిపై పిల్ వేశా
సిఐడి చీఫ్ సంజయ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వ్యవహార శైలిపై సత్యనారాయణ అనే వ్యక్తి న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయగా, దానిలో నేను ఇంప్లిడ్ అయ్యానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సంజు , సుధా చేసే కామెడీని నేను ఆస్వాదించాను. గతంలో తెలుగు సినిమాలలో దర్శకులు జంధ్యాల, ఇవివి సత్యనారాయణ తమ సినిమాలలోని పాత్రధారుల చేత ఇదే తరహా కామెడీ చేయించేవారు.

టీవీ9 ఛానల్ డిబేట్లో పాల్గొన్న సుధాకర్ రెడ్డి, ఛానల్ యాంకర్ కు అవసరమయితే 164 స్టేట్మెంట్ ను అందజేస్తానని పేర్కొనడం ఆశ్చర్యం కలిగించింది. 164 స్టేట్మెంట్ అనేది పోలీసులు లేకుండానే న్యాయమూర్తి సమక్షంలో ఇచ్చే వాంగ్మూలం. దాన్ని పై కోర్టుకు కూడా సీల్డ్ కవర్లో అందజేస్తారు. అటువంటి రహస్య డాక్యుమెంట్ ను బహిర్గతం చేస్తానని చెప్పడాని, న్యాయస్థానంలో నేను ప్రశ్నించాలని అనుకున్నా ను. అందుకే నేను కూడా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద పిటిషన్ దాఖలు చేయాలని భావించాను. అప్పటికే సత్యనారాయణ అనే వ్యక్తి పిల్ దాఖలు చేయడంతో, నేను ఇంప్లిడ్ అయ్యానని తెలిపారు.

చట్టాన్ని ఉల్లంఘించిన సంజు , సుధా పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అయితే, నేను దాఖలు చేసిన ఇంప్లిడ్ పిటిషన్ పరిశీలనకు అర్హత ఉందా లేదా అన్నదాన్ని వచ్చే వాయిదాలో నిర్ణయిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నట్లుగా సాక్షి దినపత్రికలో రాశారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం రాజకీయ నాయకులు దాఖలు చేస్తే, ప్రభుత్వం తరఫున రద్దు చేయమని కోరే అవకాశం ఉంది కదా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించినట్లుగా సాక్షి దినపత్రిక లో పేర్కొన్నారు.

నేను దాఖలు చేసిన పిటిషన్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాదు. విధి నిర్వహణలో ఎలా మసులుకోవాలో తెలియని ఇద్దరు అధికారులపై అని గుర్తు చేశారు. దీనికి సాక్షి దినపత్రిక రాజకీయ రంగు పులమడమిటో అర్థం కావడం లేదు. రానున్న ఎన్నికల్లో అభ్యర్థులు దొరకక, వీరిద్దరికీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నారా? అంటూ అపహాస్యం చేశారు.

ఫైబర్ గ్రిడ్ కేసు వాయిదా
ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ రిపోర్ట్ క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు పిటిషన్ పై తీర్పును వెలువరించకపోవడంతో, ఈ కేసులోనూ ధర్మాసనం తీర్పు వాయిదా వేసిందన్నారు.

అవినీతి నిరోధక చట్టం లోని 17 A నిబంధనను కచ్చితంగా ఈ రెండు కేసుల్లోనూ అమలవుతుందన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన అమలు గురించి ఎటువంటి అనుమానాలు అక్కరలేదన్నారు. దీపావళి పండుగ కంటే ముందే దీపావళి జరుపుకుంటామని భావించినప్పటికీ, దీపావళి పండుగ తర్వాత మరొకసారి దీపావళి జరుపుకునే అవకాశం లభిస్తుంది అన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన పై గతంలో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును, ద్విసభ్య ధర్మాసనం కాదనే అవకాశాలు లేవు.

ఈ కేసును మరొక బెంచ్ కు మారుస్తారని, రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తారన్న అనుమానాలు తలెత్తాయి. అటువంటి అనుమానాలు అక్కర్లేదు. తీర్పు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పు ఆధారంగానే ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారిస్తామని తెలియజేశారు. ఇది పర్సన్ స్పెసిఫిక్ కేసు కానీ, కేసు స్పెసిఫిక్ కాదని తెలిపారు.

కిలారు రాజేష్ ను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలి
తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్ ను హైదరాబాదులో సిఐడి విభాగానికి చెందిన అధికారి కాకుండా, వేరే విభాగానికి చెందిన అధికారి… మరొక వ్యక్తి పేరు చెప్పాలని బెదిరించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాజేష్ ని బెదిరించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరు బెదిరించారో ఆ అగంతకుడి ఫోటోను కూడా పోలీసులకు అందజేయడం జరిగిందన్నారు.

పాలకొల్లు ఉదంతంపై జర్నలిస్ట్ సాయి జగన్ కు జలక్ ఇవ్వబోయి, చంద్రబాబుకు జలక్ ఇచ్చిన రఘురామకృష్ణం రాజు అని ఒక వీడియోను విడుదల చేశారు. పాలకొల్లులో లబ్ధిదారుల పేరిట వారికి తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం 20 22 లో రుణాన్ని ఎత్తిందన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి ని, చంద్రబాబు నాయుడు కాదని గుర్తు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా జర్నలిస్టు సాయి కి ఫోన్ చేసి తెలిపానన్నారు.

Leave a Reply