Suryaa.co.in

Andhra Pradesh

పేదల ప్రాణాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం

-తల లేని మొండెంలా రాష్ట్రం
-నమ్మకంతో అధికారం ఇస్తే నాశనం చేశారు
-గోదావరి ప్రక్షాళన నిధులు ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం
-రాష్ట్రంలో ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలి
-ఎక్కడ నుంచి వచ్చామన్నది కాదు…నిబద్ధత ముఖ్యం
-ఎన్టీఏ కూటమితోనే అభివృద్ధి పథం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురందేశ్వరి

నమ్మకంతో నమ్మకంతో అధికారం ఇస్తే నాశనం చేశారని, రాష్ట్రాన్ని తలలేని మొండెంలా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో ప్రజలు ఒక ఆకాంక్ష, విశ్వాసంతో వైసీపీకి మద్దతు పలికారు. కానీ వైసీపీ ఆ నమ్మకాన్ని కాపాడు కోలేకపోయిందని విమర్శించారు. సరైన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో పంటి బిగువున పరిశ్రమలు ఉన్నాయని, పెట్టుబడులు వెనక్కిపోతున్నాయని మండిపట్టారు. కొత్తగా పరిశ్రమలు రావడం లేదని, మహిళలకు కూడా సరైన స్థాయిలో న్యాయం చేసే పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.

పేరుకే కార్పొరేషన్లు..నిధులు లేవు
కార్పొరేషన్‌లు పేరుకు మాత్రమే ఉన్నాయి, వాటికి నిధులు లేవని తెలిపారు. ఎస్సీలకు సంబంధించి 27 పథకాల రద్దు చేశారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అంటే అభివృద్ధి గుర్తుకు వచ్చేది. కానీ, ఇప్పుడు తల లేని మొండెంలా తయా రైందని ధ్వజమెత్తారు. నకిలీ మద్యంతో పేద ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆడుకుంటుంది. ఇసుక మాఫియా వల్ల నిర్మాణరంగం కుదేలు అయిపోయింది. రాష్ట్రంలో ప్రజలు ఎన్డీఏ కూటమిని అధికారులకు తీసుకొస్తే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని, మన రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కారు కాదు ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కారు కావాలని ఆకాంక్షించారు. రాజమండ్రిలో ఈ రోజుకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునుగుతున్నాయని, గోదావరి ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం 57 కోట్లు మంజూరు చేసినా ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. కోరుకొండలో వ్యవసాయ భూములు ఎందుకు రిజిస్ట్రేషన్లు కావడం లేదు? ఈ సమస్యపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు.

ఎక్కడ నుంచి వచ్చామన్నది కాదు….
టంగుటూరి ప్రకాశం పంతులు కూడా రాజమండ్రి వారు కాదు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేది కాదు, వారు నిబద్ధతతో పని చేస్తారా లేదా? అన్నది కావాలన సమాధానమిచ్చారు. ఎన్డీఏ హయాంలో 42 శాతం రాష్ట్ర ప్రజలకు కేంద్రం తిరిగి ఇస్తుంది. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్ళించి జేబులు నింపుకుంటున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే వారిపై ఎవరైన ఫిర్యాదులు చేసుకోవచ్చు. నాపైన ఫిర్యాదులు చేయదల్చుకుంటే చేయవచ్చు. ఒకరికి కొమ్ము కాయాలనుకునే వారిపై ఈసీకి చర్యలు తీసుకునే అధికారం ఉందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరా జు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలవలిసిల హారిక, బేతిరెడ్డి ఆదిత్య, కాలెపు సత్య సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE