– మహిళమోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పరెడ్డి
హైదరాబాద్ :కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించి మోసం చేస్తోందని, ఆ హామీలు అమలయ్యేలా నిలదీయాలని మహిళమోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పరెడ్డి పేర్కొన్నారు. పోయిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇలానే హామీలు ఇచ్చి మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో కాలం గడుపుతోంది.ఈ అంశాలను ప్రతి మహిళా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళలను ప్రధాని మోదీ నారిశక్తి గా అభివర్ణింస్తుంటే. కొందరు ప్రతిపక్ష నేతలు అవహేళన చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలోని 10 కోట్ల మంది మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌లు ఇచ్చాము. ఈ అంశాలను ప్రతి మహిళా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో అయిదేళ్లపాటు రేషన్ బియ్యం ఇవ్వబోతున్నాం. అంగన్వాడీ, ఆశావర్కర్‌లకు ఆయుష్మాన్ భారత్ వర్తిస్తున్నాం. మోదీ కాబినెట్‌లో 11 మహిళలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. మహిళలను ఫ్రీ బస్సు పేరుతో కాంగ్రెస్ నేతలు మోసం చేస్తున్నారు. మహిళలకు ఇస్తామన్న 2500 భృతి ఇప్పటికీ ఇవ్వలేదు. మనం మోదీ పరివార్‌గా, మోదీ బంటుగా మన అరుణమ్మను గెలిపించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.