శబరిమల ఆలయానికి రూ.357.47 కోట్ల ఆదాయం

-50 లక్షల మంది యాత్రికులు
-కెఎస్‌ఆర్‌టీసీ పంపాకు 38.88 కోట్ల ఆదాయం

శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్‌లో భక్తుల రద్దీ పెరిగింది. మండల-మకరవిళక్కు సీజన్‌లో ఆలయానికి రూ.357.47 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే 10.35 కోట్ల ఆదాయం పెరిగినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు పీఎస్‌ ప్రశాంత్‌ తెలిపారు.

గత సీజన్‌లో రూ.347.12 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఆలయానికి ‘అరవణ’ ప్రసాదం విక్రయం ద్వారా రూ.146,99,37,700, ‘అప్పం’ విక్రయం ద్వారా రూ.17,64,77,795 వచ్చనట్లు ఆలయ మేనేజ్‌మెంట్ తెలిపింది. కానుక (నైవేద్యం)గా ఇచ్చిన నోట్లు, నాణేల లెక్కింపు ఇంకా జరగలేదు. అవి 10 కోట్ల వరకు ఉంటుందని టీడీబీ అంచనా వేస్తోంది.

ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు ప్రకారం, ఈ సీజన్‌లో 50,06412 మంది యాత్రికులు శబరిమలకు చేరుకున్నారు. గత ఏడాది ఈ సంఖ్య 44 లక్షలుగా ఉంది. ఈసారి 5 లక్షల మంది యాత్రికులు అదనంగా అయ్యప్పను దర్శించుకున్నారు. 41 రోజుల పాటు సాగిన మండల-మకరవిళక్కు సీజన్ ముగియడంతో శబరిమల ఆలయాన్ని శనివారం మూసివేశారు. సీజన్‌కు 7 నెలల ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించినట్లుటీడీబీ తెలిపింది.

స్వార్థ ప్రయోజనాలతో కొందరు పాదయాత్రకు సంబంధించి తప్పుడు సమాచారం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే పాదయాత్ర సజావుగా సాగిందన్నారు. జనవరి 15న మకరవిళక్కు ఉత్సవం.. శుక్రవారం మలికప్పురం ఆలయంలో ‘గురుతి’ నిర్వహించారు. ఈ ఏడాది మండల-మకరవిళకం సందర్భంగా కెఎస్‌ఆర్‌టీసీ పంపాకు సర్వీసులు నిర్వహించడం ద్వారా ఈసారి 38.88 కోట్లు వచ్చింది.

Leave a Reply