– తెలంగాణను నాశనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే.
– మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్టాన్ని బిఆర్ఎస్ నిర్వీర్యం చేసింది. సివిల్ సప్లై శాఖ ను 3 వేల కోట్ల నుంచి 50 వేల కోట్లు భారం పెంచింది. సంస్థకు 11వేల కోట్లు నష్టం. లోన్లపై వడ్డీ 3 వేల కోట్లు. 15 వేల కోట్ల ప్యాడి స్ట్రాక్ మిల్లర్ల దగ్గర ఉందని చెబుతున్నారు. కృష్ణ బోర్డు పై మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
పదేళ్ళలో కృష్ణా రివర్ వాటర్ తెలంగాణకు ఎందుకు తగ్గింది. తెలంగాణకు రావాల్సిన కృష్ణా నీళ్లు ఏపీ డైవర్ట్ చేసుకున్నారు. ఏపీ వాళ్ళు 8 నుంచి 10 టీఎంసీలు తీసుకు పోతుంటే బీఆర్ఎస్ నాయకులు నోరు మెదపలేదు. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని తెలంగాణకు వస్తుంటే కాదని లక్ష కోట్లతో గోదావరి నీటిని వాడుకుంటామని కాళేశ్వరం కట్టారు. మీరు చేసిన ద్రోహాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీకి ఏడు మండలాలు పోయాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చింది. బిఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేయడం తగదు. తెలంగాణను నాశనం చేసింది, ద్రోహం చేసింది, దోచుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణ ఇతర అంశాల్లో క్రిమినల్ నెగెలిజెన్స్ ఉంది.
వ్యాప్కోస్ సంస్థ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 38 వేల కోట్ల వ్యయంతో నిర్మాణానికి డిజైన్ చేశారు. 94 వేల కోట్ల రూపాయల తో దేశంలో ఎక్కడా ఇలాంటి బ్యారేజీ కట్టలేదు. సీఐజి రిపోర్టు ప్రకారం 40 వేల ఎకరాలే. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు గత ప్రభుత్వ హయాంలో ఉన్న విధంగానే ఇప్పుడు ఉన్నాయి.