ఇంట్లోనే నిరాహార దీక్షకు దిగిన కోడికత్తి కేసు నిందితుడి తల్లి, సోదరుడు

విజయవాడ: పోలీసుల అనుమతి లేని కారణంగా కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు విజయవాడలోని తమ ఇంట్లోనే దీక్షకు పూనుకున్నారు.

సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదని, తన కుమారుడి కోసమే దీక్షకు కూర్చున్నట్లు ఆమె స్పష్టం చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో దీక్షకు పోలీసుల అనుమతి కోరగా ఇవ్వలేదని.. అందువల్లే ఇంట్లోనే దీక్ష చేపట్టామన్నారు. వారి దీక్షకు విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక మద్దతు ప్రకటించింది..

Leave a Reply