Suryaa.co.in

Features

మున్నంగి

మున్నంగి .. మున్నంగి
ముగ్ధ మనోహర గంగి.
పూర్వం మునుల తపస్సు చెలరేగి
ముని కోటి పురం గా కొనసాగి.
కాల గమనంలో నేడు మున్నంగి
వైభవానికి మరో వేంగి.
అభిమానాన్ని చెక్కే వడ్రంగి
సంస్కారంలో వాడని సంపంగి.
అనురాగానికి సారంగి
అలుపెరుగని సివంగి.
మేధావుల మేజరు పంచాయతి
మండలంలో ఇదో అవంతి.
వ్యవసాయంగా మెట్ట, మాగాణి
చెంతనే ప్రవహించే కృష్ణవేణి.
చెరువు లో జల, కమలల నిధి
కరువు లేని కష్ట పడే పరమావధి.
శాంతి, సమైక్యతకు కాణాచి
సమవాదానికి పరిచే తివాచి.
అపర చాణక్యులకు నివాసి
తిరకాసు తిమ్మరుసులకు
సహవాసి.
అనుభూతులకు వాసి
ఆనందాలకు ఆవాసి.
అన్ని వర్ణాల వృత్తులకు
కావడి
అద్వైతానికి ఆదిశంకరుని కాలడి.
బడుల, గుడుల బాంధవి
పాడి, పంటల మాధవి.
మైత్రి చూపే స్నేహ రీతి
మైమరపించే గ్రామ నీతి.
విద్యా, విజ్ఞాన సాగుబడి
పాఠశాల స్వర్ణోత్సవ సారధి.
మున్నంగి .. మున్నంగి
మాటలకు అందని మాతంగి.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యొక్క
స్వర్ణోత్సవ వేడుక సందర్భంగా రచన
మున్నంగి,
కొల్లిపర మండలం,
తెనాలి డివిజన్,
గుంటూరు జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్.

రచన…….
భీమవరపు అప్పి రెడ్డి
చింతపల్లి వెంకటరమణ

LEAVE A RESPONSE