Suryaa.co.in

Andhra Pradesh

అట్టహాసంగా ప్రారంభమైన నూతన విశాఖపట్నం-వారణాసి ఎక్స్ప్రెస్ రైలు

– బీజేపీ ఎంపీ జీవీఎల్ చే శాస్త్రోక్తంగా ప్రారంభోత్సవం
– వారణాసికి ఎక్స్ప్రెస్ రైలు సాధించగలగడం పూర్వజన్మ సుకృతం
– హరహర మహాదేవ, జై శ్రీ రామ్ నినాదాలు

పెద్ద సంఖ్యలో బిజెపి శ్రేణులు, ఉత్తర భారతీయులు,కుల సంఘాల నాయకులందరూ హజరవగా హరహర మహాదేవ, జై శ్రీ రామ్ అని నినాదాలు మిన్నంటుతూ ఉండగా ఎంపీ జీవీఎల్ తన ప్రయత్నంతో సాధించిన ఉత్తర భారతీయులు, హిందూ సంఘాలవారు, తెలుగువారు ఎంతోకాలంగా కోరుతున్న విశాఖపట్నం వారణాసి ఎక్స్ప్రెస్ రైలుకు ఎంపీ జీవీఎల్ ప్రారంభోత్సవం చేశారు.

ఈరోజు విశాఖపట్నం రైల్వే స్టేషన్ 1వ ప్లాట్ ఫార్మ్ లో పెట్టబడిన విశాఖపట్నం వారణాసి ఎక్స్ప్రెస్ రైలుకు వేద పండితుల మంత్రోచ్చారణతో జీవీఎల్ పూజాదికాలు నిర్వహించి తెలుగు సాంప్రదాయ పద్ధతిలో గుమ్మడికాయ కొట్టడం ద్వారా ప్రారంభోత్సవం చేశారు.

తమ స్వస్థలాలకు సులువుగా చేరుకునే అవకాశాన్ని ఈ రైలు ద్వారా కల్పించినందుకు మరియు హిందువులందరూ జీవితకాలంలో ఒక్కసారైనా సందర్శించాలని తపించే కాశీ యాత్రకు మార్గాన్ని సుగమం చేసినందుకు అనేకమంది ఉత్తరభారతీయులు, హిందూసంఘాల వారు, బిజెపి పార్టీ శ్రేణులు వందలాదిగా హాజరై జీవీఎల్ ను అభినందించారు.

జీవీఎల్ మాట్లాడుతూ విశాఖపట్నం నుంచి వారణాసికి ఎక్స్ప్రెస్ రైలు సాధించగలగడం తన పూర్వజన్మ సుకృతం అని, ఈ రైలు కేటాయించి నందుకు ప్రధాని మోడీ గారికి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఇక విశాఖ వాసులకు, ఉత్తరాంధ్ర వారికీ కాశీ క్షేత్ర సందర్శనం ఆ మహాశివుని దయ వలన సులభతరం కానుందని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE