అయిదేళ్లుగా అవినీతి పాలన కారణంగా ఎపి రాష్ట్రప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు

ప్రజాగళం సభలో బిజెపి జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజు ప్రసంగం

ప్రజాగళం సభ ఎపి రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోంది.గత అయిదేళ్లుగా అవినీతి పాలన కారణంగా ఎపి రాష్ట్రప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలంటే ఎన్ డిఎ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. దేశంలో ఎన్నో కొత్తరాష్ట్రాలు ఏర్పాటయ్యాయి, రాజధాని లేని రాష్ట్రం ఎపి మాత్రమే. అవినీతితో పాటు రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన ఘనత వైసిపి ప్రభుత్వానిదే. వెనుకబడిన యుపిని అక్కడి సిఎం యోగీ ఆదిత్యనాథ్ మిగులుబడ్జెట్ రాష్ట్రంగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించాలంటే ఎన్ డిఎ కూటమి అధికారంలోకి రావాలి.

Leave a Reply