Suryaa.co.in

Andhra Pradesh

‘సైకో’ పాలన పోయి ‘సైకిల్’ పాలన రావాలి

– జగన్ ధనదాహానికి మహిళల తాళిబొట్లు తెగుతున్నాయి
– రాష్ట్ర ఖజనాకు చేరే ఆదాయం కన్నా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరే ఆదాయం ఎక్కువ
– ‘మాటా-మంతి’ కార్యక్రమం ద్వారా గ్రామాలలోని మహిళలను చైతన్యపరుస్తాం
– తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
– తెలుగు మహిళా ఆధ్వర్యంలో మాటామంతి కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించిన తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెలుగు మహిళలు

‘సైకో’ పాలన పోయి ‘సైకిల్’ పాలన రావాలని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. మంగళవారం తెలుగు మహిళా ఆధ్వర్యంలో మాటామంతి కార్యక్రమం పోస్టర్ ను మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెలుగు మహిళలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితమాట్లాడిన మాటలు మీ కోసం…!

రాష్ట్రంలో జగన్ ను నమ్మి ఒటేసి మహిళా వర్గం మోసపోయింది. జగన్ రెడ్డి వలలో పడి రాష్ట్ర మహిళలు అన్ని విధాల మోసపోయారు. ఇందుకు జగన్ చేతకానితనం, అనుభవరాహిత్యమే కారణం. రాష్ట్రంలో మహిళలు ఆరోగ్య, ఆర్థిక, మానసిక హింసికు గురౌతున్నారు. జగన్ కు ధన పిశాచి ఆవహించిందా అనే అనుమానం కలుగుతోంది. ఉచ్ఛ నీచాలు మరచి ఆడబిడ్డలనే కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎన్నికలకు ముందు ఎక్కువగా ఆదరించింది మహిళలే. ప్రస్తుతం మహిళలను టార్గెట్ చేసి హింసిస్తున్నారు. ఎన్నికలకు ముందు మహిళలచే నోరారా ‘అన్నా’ అని పిలిపించుకొని నేడు మహిళల నోరు మూయిస్తున్నారు. మహిళల కన్నీళ్లలో జగన్ రెడ్డి కొట్టుకుపోవాలని మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులను చూసి మహిళల కడుపు మండుతోంది. రాష్ట్రంలో పూటకో అత్యాచారం జరుగుతుంటే దిశ చట్టం ఏమైంది? చట్టమే లేకుండా ఆర్భాటంగా పోలీసు స్టేషన్ లను ఏర్పాటు చేశారు. ఈ రోజుకి దిశా చట్టపరంగా ఒక్క కేసు ను కూడా నమోదు చేయలేదు. రాష్ట్రంలో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. మహిళా కమిషన్ కు అత్యాచారాలు, హత్యలు జరిగిన వివరాల బుక్ ను ఇచ్చాం. క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మహిళా కమిషన్ లో చలనం లేదు.

జగన్ ను, ఆయన సతీమణిని ఎవరైన ఏమైనా అంటే డీజీపీ.. మహిళా కమిషన్ కార్యాలయం మెట్లెక్కి ఫిర్యాదు చేస్తారు. పది రోజుల క్రితం విజయవాడలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. తాడేపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో సంఘటన జరిగినా రక్షించుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రావికాంతం మండలంలో ఇద్దరు పిల్లల తల్లిపై గ్యాంగ్ రేప్ జరిగింది. మైనర్ లు నలుగురు కలిసి అత్యాచారం చేశారు. చర్యలు మాత్రం శూన్యం. దేశంలోని నేరాల్లో 70 శాతం ఘోరాలు నేరాలు మద్యం మత్తులో జరిగినవే. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మద్యాన్ని అరికడతానని ఉత్తర ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి మహిళలను నమ్మించి మోసం చేశాడు. అమ్మఒడి, ఆసరా, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని మహిళలు జగన్ కు ఓట్లు వేయలేదు. కేవలం సంపూర్ణ మద్యపాన నిషేదం విధిస్తామని చెబితేనే ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి ఆడబిడ్డలు బలౌతున్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వెంకటరెడ్డి అనే వ్యక్తిని ఇంతవరకు పట్టుకోలేదు. కాబోయే భర్తతో వస్తున్నా రక్షణ లేని పరిస్థితులు నేడున్నాయి. మద్యం మత్తులో పైశాచిక వాంఛ బయటికి వస్తోంది. ఘోరాలు, నేరాలకు పాల్పడుతున్నారు. అనేకమంది జే బ్రాండ్స్, గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడ్డారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మగినూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తి తన తల్లి మైనే అఘాయిత్యం చేయబోయాడు. తాగిన మత్తులో తల్లికి, చెల్లికి, ముసలివాళ్లకి, వికలాంగురాలికి కూడ తేడా లేకుండా వీరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. పై పొజిషన్ లో ఉన్న జగన్ ఏంచేస్తున్నారు? రేపల్లె నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ లోనే ఒక అమ్మాయిపైనే అత్యాచారం జరిగితే చర్యలు లేవు. అనూషను కిరాతకంగా చంపితే పోలీసులు ఆత్మహత్యగా చిత్రీరించారు. అనూష, తేజశ్వినీ, శ్రీలక్ష్మి, రమ్య, స్నేహలతలు చంపబడితే దిక్కులేదు. ఎన్ని బేవరేజెస్ లను, ఎన్ని డిస్టలరీలను మూయించారో చెప్పాలి. ఎన్ని బ్రాండ్లను తగ్గించారు? నాటుసారాను తగ్గించారా? అని వైసీపీ నాయకులు గడప గడపకు కార్యక్రమానికి వెళ్లినప్పుడు మహిళలు అడిగితే ఏం సమాధానం చెబుతారు? ఇంటర్నేషనల్ బ్రాండ్లు, నేషనల్ బ్రాండ్లు ఉంటాయి. వాటిని టెస్టులు చేసి అమ్ముతారు. రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు. దేశంలోని అన్ని లిక్కర్ బ్రాండ్లని బ్యాన్ చేశారు. లోకల్ బ్రాండైన జే బ్రాండ్ ని తీసుకొచ్చారు. క్వాలిటీ పెంచారా? రేటు తగ్గించారా? లేదు. దరిద్రమైన క్వాలిటీ. విషపూరిత పదార్థాలు అందులో ఉన్నాయని ల్యాబ్ రిపోర్టులు వచ్చాయి. గవర్నమెంటు ఏరోజు కూడా స్పందించలేదు. 5 రూపాయలకు ఒక విస్కీ బాటిల్ తయారు చేయడానికి గవర్నమెంట్ కొనుక్కుంటే దాన్ని బయటికొచ్చి 125 రూపాయలకు అధిక ధరలకు అమ్ముతున్నారు. కల్తీ మద్యం బారిన పడి చనిపోయిన వారి సంఖ్య కరోనాతో చనిపోయిన వారి సంఖ్యతో పోలిస్తే కల్తీ మద్యం బారిన పడి చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

మద్యం షాపులలో ఎందుకు నగదు లావాదేవీలను ప్రవేశపెట్టడంలేదు? డిజిటల్ మార్కెటింగ్ ను మద్యం షాపుల్లో పెట్టిస్తామని చెప్పి సంవత్సరం అయింది. ఇంతవరకు అమలు చేయలేదు. కోర్టుకు ఇచ్చిన అఫిడెవిట్ ను కూడా వీరు బుట్టదాఖలు చేశారు. కోర్టు అఫిడెవిట్ నే బేఖాతరు చేసినవారు సాధారణ మహిళలను పట్టించుకుంటారా? రాష్ట్రంలో రిహాబిలేషన్ సెంటర్లు ఏమయ్యాయి? వైసీపీ నాయకులు మద్యం షాపులు, ఖజానా గురించి మాట్లాడుతారేగాని మహిళల కష్టాల గురించి మాట్లాడరు. ఇండ్లల్లో భర్తలు తాగుడుకు బానిపైనా, నిరుద్యోగులు ఉన్నా అందుకు ఓటేసి కుర్చీపై కూర్చోబెట్టిన జగనే కారణం. మహిళలు తమ పిల్లల్ని పోషించుకోలేకున్నారు. ధరలు విపరీతంగా పెరిగాయి. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. రాష్ట్ర ఖజనాకు చేరే ఆదాయం కన్నా తాడేపల్లి ప్యాలెస్ కు చేరే ఆదాయం ఎక్కువ. గ్రామా గ్రామానికి వెళ్లి మాటామంతి కార్యక్రమం ద్వారా మహిళలను చైతన్యపరుస్తాం. ప్రతి మహిళకు న్యాయం జరగాలనే విధానంతో ముందుకుళ్తాం. జగన్ చేస్తున్న మోసాల్ని ప్రతి మహిళ గ్రహించాలి.

చంద్రబాబు హయాంలో మహిళలు ఎలా ఉన్నారు, జగన్ ప్రభుత్వ హయాంలో మహిళలు ఎలా ఉన్నారు? అనే విషయాలను గ్రహించాలి. జగన్ ప్రభుత్వంలో మహిళల పరిస్థితి ఘోరాతి ఘోరంగా మారింది. మహిళలకు కావాల్సిన సంక్షేమ పథకాలను వారే కోరుకుంటూ తెలుగుదేశం మ్యానిఫెస్టోను తయారు చేసుకునే విధానం తెస్తాం. గ్రామాల్లోని ప్రతి మహిళ వద్ద నుండి సమాచారం సేకరించి మా మ్యానిఫెస్టోలో పొందుపరుస్తాం. గవర్నమెంటును నడిపించడంలో మహిళలే కీలకపాత్ర పోషించాలి. ప్రతి మహిళ దీనిపై దృష్టి పెట్టాలి, తోడ్పాటును అందించాలని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు.

LEAVE A RESPONSE