– మంత్రుల కక్షలు ఆలయ గౌరవాన్ని కలుషితం చేస్తున్నాయి
– భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. కళ్యాణ్ నాయక్
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన మేడారం జాతర ఆధ్యాత్మికత, భక్తి, సంప్రదాయాల మేళవింపు. కానీ తాజాగా మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి, మంత్రి కొండ సురేఖ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు, శాతం లెక్కల రాజకీయాలు, జాతర యొక్క పవిత్రతను చెడగొడుతున్నాయి.
పర్సంటేజీలు ఎవరి కోసమో కాక, భక్తుల కోసం ఏర్పాట్లు చేసే సమయమిది.
కానీ ప్రభుత్వం మాత్రం శుభ కార్యాన్ని కూడా కమిషన్ కాసుల దారిలో మార్చేసింది. గతంలో పని చేసిన సంస్థను పక్కన పెట్టి, కొత్త కంపెనీకి టెండర్లు అప్పగించిన తీరు పారదర్శకతకు విరుద్ధం. ఆలయ విశిష్టతను విస్మరించిన చర్య.
“మేడారం గద్దెల గౌరవాన్ని కూడా మంత్రుల పట్ల హస్తక్షేపానికి గురిచేయడమంటే ఇది అధికార అహంకారానికి పరాకాష్ఠ” అని డా. కళ్యాణ్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే ప్రభుత్వం అనుచితంగా ఇచ్చిన టెండర్లను రద్దు చేయాలి. మేడారం దేవస్థాన గౌరవానికి తగిన, అనుభవజ్ఞులైన సంస్థకే పనులను అప్పగించాలి. మంత్రులు అధికార పోరాటాలను పక్కన పెట్టి, భక్తుల భద్రత, ఆలయ గౌరవానికి ప్రాధాన్యం ఇవ్వాలి. భక్తుల మనోభావాలు, ఆధ్యాత్మిక సంపత్తిని ఓ “పర్సంటేజ్” పంచాయితీగా మార్చడం బాధాకరం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వకపోతే, భాజపా రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని ప్రారంభించనున్నదని డా. కళ్యాణ్ నాయక్ హెచ్చరించారు.