– ఆమె కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదు
హైదరాబాద్: మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ)ను ఉల్లంఘించి ప్రార్థన స్థలాల వద్ద అనుమతులు తీసుకోకుండా ఎన్నికల ప్రచారం చేశారని కేసు నమోదు అయింది. యూసుఫ్ గూడ డివిజన్ వెంకటగిరిలో శుక్రవారం నమాజ్ చేయడానికి వెళ్తున్న వారిని, ఓటు వేయడానికి ప్రభావితం చేస్తున్నారని వారిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాగంటి సునీతను A1గా, మాగంటి అక్షరను A2గా చేరుస్తూ.. యూసుఫ్ గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్‌తో పాటు మరో నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.