టిడిపి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటానికి కారణం ఎన్టీఆర్ సిద్ధాంతాలు ఆశయాలు
ప్రాంతీయ పార్టీల కూటమితో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి కేంద్ర ప్రభుత్వంలో స్థానాన్ని సంపాదించిన ఘనుడు ఎన్టీఆర్
పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు.
– సోమిరెడ్డి, బీద, అబ్దుల్ అజీజ్, రమేష్ రెడ్డి
నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 42 వ ఆవీర్భవా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా వారు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి నివాళులు అర్పించి, తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నెల్లూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటానికి కారణం నందమూరి తారక రామారావు ఆశయాలు సిద్ధాంతాలేనని అన్నారు.నెంబర్ వన్ హీరో స్థానంలో ఉండి కూడా పేద ప్రజల కోసం వాటన్నిటినీ వదులుకొని పార్టీని స్థాపించారని, పేదలకు రేషన్ కార్డు, పింఛన్లు ప్రారంభించిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు
రాజకీయ అనుభవం లేని తొలి ముఖ్యమంత్రిగా ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీలో కొనసాగటం తమకెంతో గర్వకారణమని అన్నారు.
ఈ సందర్భంగా బీద రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ.. పేదవాడి ఆకలి కేకలు రైతన్నల ఆర్తనాదాలు విని కార్మిక కర్షక తేజ పొడుగు బలహీనవర్గాల కోసం సినీ రంగంలో రారాజుగా వెలుగుతున్నటువంటి దైవాంశ సంభూతుడు అందరి చేత అన్నగా పిలిపించుకునే ఎన్టీఆర్ 42 ఏళ్ల క్రితం టీడీపీ ను స్థాపించారని అన్నారు. పార్టీ ని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రాంతీయ పార్టీల కూటమితో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి కేంద్ర ప్రభుత్వంలో స్థానాన్ని సంపాదించిన ఘనుడు అని అన్నారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ స్థాపించిన 42 సంవత్సరాలు పూర్తయిందని ఈ 42 సంవత్సరాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన ఎన్టీఆర్, చంద్రబాబు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తూవచ్చారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాకే తెలుగు జాతికి గౌరవం లభించిందని లేదంటే ఈ జాతీయ పార్టీలు మనల్ని మద్రాసీలు అని పిలిచే పరిస్థితులు ఉండేవని అని అన్నారు.
ఈ సందర్భంగా తాళ్లపాక రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిన ఘనత నందమూరి తారక రామారావుది అని అన్నారు.
కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజెర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాజా నాయుడు, డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్, మాజీ ఆప్కబ్ చైర్మన్ కొండూరు పాలిసెట్టి, ధర్మవరపు సుబ్బారావు, పనబాక భూలక్ష్మి, మన్నెం పెంచల నాయుడు, బ్రహ్మం గుప్తా, దర్శి హరికృష్ణ, సారంగి గున్నయ్య, నన్నే సాహెబ్, దోర్నాల హరిబాబు, ఎస్ ఏ రసూల్, ఉయ్యాల జగన్మోహన్, సికారి భాస్కర్, ధారామల్లి, పొత్తూరి శైలజ, రేవతి, శ్రీదేవి, బివి లక్ష్మి, అబీదా సుల్తానా, ఖాదర్ బాషా, తదితరులు పాల్గొన్నారు