వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం అసన్నమైంది

-ఓటమి భయంతో తట్టుకోలేక వైసీపీ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు
-మంత్రి అంబటి రాంబాబుకు మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ కౌంటర్

బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభ జన ప్రభంజనంలా చారిత్రాత్మకమైన సభలా జరిగింది. బొప్పూడి సభకు 12 కిలోమీటర్ల దూరంలో నేను ట్రాఫిక్‍లో ఇరుక్కుపోయానంటే.. సభకు ఎంత భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారనేది అర్థం చేసుకోవాలి. సభకు ఎటూ సూచినా 15 కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. సభలో ఒక భాగం ప్రజలుంటే.. మూడు భాగాలు సభ బయట ట్రాఫిక్‍లోనే ఉన్నారు. ట్రాఫిక్‍ను క్లియర్ చేయడంలో, జనాన్ని కంట్రోల్ చేయడంలో పోలీస్ వ్యవస్థ తీవ్ర వైఫల్యం చెందింది. పోలీస్ వ్యవస్థ కావాలనే ట్రాఫిక్ సమస్యను సృష్టించారు. ఓటమి భయంతో తట్టుకోలేక వైసీపీ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం అసన్నమైంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

Leave a Reply