Suryaa.co.in

Andhra Pradesh

స‌త్యం గెలిచింది..అస‌త్యంపై యుద్ధం ఆరంభం

– మ‌న నాయ‌కుడు చంద్ర‌బాబు క‌డిగిన ముత్య‌మే
– టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్

స‌త్యం గెలిచింది..అస‌త్యంపై యుద్ధం మొద‌ల‌వ‌బోతోంద‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్ర‌బాబుకి స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ని పేర్కొంటూ లోకేష్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

“స‌త్య‌మేవ‌జ‌య‌తే“ మ‌రోసారి నిరూపిత‌మైంది. ఆల‌స్య‌మైనా స‌త్య‌మే గెలిచింది. జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లో వ్య‌వ‌స్థ‌ల మేనేజ్మెంటుపై స‌త్యం గెలిచింది. చంద్ర‌బాబు గారి నీతి, నిజాయితీ, వ్య‌క్తిత్వం మ‌రోసారి స‌మున్న‌తంగా త‌ల ఎత్తుకుని నిల‌బ‌డింది. “నేను త‌ప్పు చేయ‌ను, త‌ప్పు చేయ‌నివ్వ‌ను“ అని బాబు గారు ఎప్పుడూ చెప్పేదే మ‌రోసారి నిజ‌మైంది.

చంద్ర‌బాబు గారిపై పెట్టిన‌ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కేసు, జ‌గ‌న్ కోసం..జ‌గ‌న్ వ్య‌వ‌స్థ‌ల ద్వారా బ‌నాయించింద‌ని బెయిల్ మంజూరు చేసిన సంద‌ర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్య‌ల ద్వారా స్ప‌ష్ట‌మైంది. అరెస్టు చేసి 50 రోజుల‌కి పైగా జైలులో పెట్టి క‌నీసం ఒక్క ఆధార‌మూ ఇప్ప‌టికీ కోర్టు ముందు ఉంచ‌లేక‌పోయిన త‌ప్పుడు కుట్ర‌లు న్యాయం ముందు బ‌ద్ద‌ల‌య్యాయి. కేసులో ఆరోపించిన‌ట్టు షెల్ కంపెనీలు అనేవి లేవ‌ని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు ప‌డ్డాయ‌నేది ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని, వాట్సాప్ మెసేజ్ చాట్ అంతా బూట‌క‌మ‌ని స్ప‌ష్ట‌మైంది.

చంద్రబాబుకి రూపాయి కూడా రాని స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టు కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చార‌నేది అవాస్త‌వ‌మ‌ని న్యాయ‌స్థానమే తేల్చేసింది. స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కీంని స్కాంగా మార్చేసి చంద్ర‌బాబు గారి 45 ఏళ్ల క్లీన్ పొలిటిక‌ల్ ఇమేజ్ డ్యామేజ్ చేయ‌డానికి జ‌గ‌న్ అండ్ కో ప‌న్నాగ‌మ‌ని దేశ‌మంత‌టికీ తెలిసింది. హైకోర్టు వ్యాఖ్య‌ల‌తో క‌డిగిన ముత్యంలా మా బాబు గారు ఈ కుట్ర‌కేసుల‌న్నింటినీ జ‌యిస్తారు. స‌త్యం గెలిచింది. జ‌గ‌న్ అనే అస‌త్యంపై యుద్ధం ఆరంభం కానుంది.

LEAVE A RESPONSE