Suryaa.co.in

Telangana

షర్మిలకి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

-బిచ్కుంద మండల పరిధిలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం
-బండరంజాల్, గుండెనేమలి గ్రామాల్లో షర్మిల గారికి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

8 ఏళ్లుగా కేసీఅర్ చేస్తున్నది రాజకీయమే. 8 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను చేస్తున్నది మోసమే. ఎన్నికలు ఉంటే నే దొర గడి నుంచి బయటకు వస్తాడు. ఇప్పుడు మునుగోడు ఎన్నికలు రావడంతో బయటకు వచ్చాడు. ఓట్లు వేయించుకోవడం…మళ్ళీ ఫాం హౌజ్ కి పోవడం. ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు అనేది కేసీఅర్ కి లెక్కే లేదు. అన్ని ధరలు మూడింతలు పెంచేశారు. పేదవాడి నడ్డి విరుస్తున్నారు. కేసీఅర్ కి311693823-657241019101117-5003263287525255895-n రైతులు అంటే లెక్కే లేదు..నిరుద్యోగులు అన్నా లెక్కే లేదు. ఇక్కడ ఉద్ధరించినది చాలదు అన్నట్లు ఇప్పుడు దేశం మీద పడ్డాడు. ఈ సారి కేసీఅర్ కి బుద్ది చెప్పాలి. ఒక్క ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. బీజేపీ,కాంగ్రెస్ లు సైతం 8 ఏళ్లుగా ప్రజలను మోసమే చేస్తున్నాయి. కాంగ్రెస్,బీజేపీ లు ప్రతి పక్ష పార్టీ పోషించడం లేదు. అందుకే YSR తెలంగాణ పార్టీ పెట్టా. YSR సంక్షేమ పాలన ప్రతి గడపకు అందిస్తా.

కేసీఅర్ ను ముఖ్యమంత్రి కాదు. కేసీఅర్ ను మోసగాడు అనాలి. మాట నిలబెట్టుకొలేని ముఖ్యమంత్రి కి మోసగాడు అనాలి. ఇదే జుక్కల్ నియోజక వర్గానికి 8 ఏళ్లుగా మోసమే కదా. YSR 5 ఏళ్లలో నిజాంసాగర్ ప్రాజెక్టు మరమత్తులు చేయించారు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ కి 450 కోట్లు కేటాయించారు. దీంతో 3 లక్షల ఎకరాలకు నీళ్ళు పారుతున్నాయి. జుక్కల్ నియోజక వర్గానికి టూరిజం నియోజక వర్గం చేయాలని అనుకున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ను మైసూర్ గార్డెన్ చేద్దామని వైఎస్సార్ అనుకున్నారు…భూ సేకరణ చేయించారు. YSR బ్రతికి ఉంటే ఈ జుక్కల్ నియోజక వర్గ రూపు రేఖలు మార్చే వారు. లెండి ప్రాజెక్ట్ కోసం 20 కోట్లు కేటాయించారు ..మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. వైఎస్సార్ మరణానంతరం ఈ ప్రాజెక్ట్ పట్టించుకున్న వారు లేరు. ఈ నియోజక వర్గంలో డిగ్రీ కాలేజీలు, పాల్ టెక్నిక్ కాలేజీలు,గురుకులాలు ఇచ్చారు. జుక్కల్ నియోజక వర్గానికి 5 ఏళ్లలో 16 వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో 6 వేల కుటుంబాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ భూములను అటవీ శాఖ గుంజుకుంది.ఎన్నికలప్పుడు కుర్చీ వేసుకుని పట్టాలు ఇస్తామని చెప్పిన హామీ ఏమయ్యింది కేసీఅర్..?. మత్తులో మాట ఇచ్చావా…?. లేక కుర్చీ దొరకలేదా..?

నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చారు కేసీఅర్ గారు..?. ఈ నియోజక వర్గంలో పప్పు దినుసులు ఎక్కువగా పండుతాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్… టెక్స్ టైల్స్ పార్క్ అన్నారు ..ఏమయ్యింది కేసీఅర్ గారు..?నిక ఎమ్మెల్యే హనుమత్ షిండే అంట. ఈ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తుంటే షిండే ను ఉతికి పారెయ్యమని జనాలు చెప్తున్నారు. అసలు ఎందుకు ఈయన మీద వ్యతిరేకత ఉంది అని అడిగా. అసలు ఈ ఎమ్మెల్యే నియోజక వర్గంలో ఉండడట. ప్రతి మండలాన్ని అనుచరులకు పంచేశాడట. అసలు స్థానిక సమస్యలు పట్టించుకున్న పరిస్థితి లేదట. అనుచరులతో311661144-657241025767783-6405036002679791754-n దందాలు చేపిస్తడట…వాటాలు తేసుకుంటాడట. స్కూళ్ల గోడలు పడిపోతున్నా పట్టించుకొడట. ఆసుపత్రిలో కనీసం నర్స్ లేదని చెప్పినా పట్టించుకోడట. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తా అని ఇచ్చిన హామీ ఏమయ్యింది. ఈయన కు ఒక్కటే చేతనయ్యింది. ఈ షిండే ఇసుక బకాసురుడు అంట కదా. మొత్తం ఇసుక ను దున్నేశాడట కదా. ఇసుక మాఫియాకి కింగ్ ఈ ఎమ్మెల్యే. 5 మీటర్ల వరకు తవ్వడానికి వీలు లేదని చెప్పినా…15 మీటర్ల వరకు తవ్వాడట కదా. ఈయన వ్యాపారం మూడు లారీలు..6 కోట్లు లా ఉందట. మంజీర నదిలో 15 మీటర్ల లోతు తవ్వితే 4 గురు చనిపోతే కనీసం చర్యలు కూడా లేదు. ఇసుక మాఫియా మీద మాట్లాడితే 18 మంది మీద కేసులు పెట్టాడట. ఒక VRA ప్రశ్నిస్తే బండి తో తొక్కించడాట. ఇలా ఉంది ఈ షిండే దౌర్జన్యం. కొత్త బిచ్చ గాడు పొద్దు ఎరగడు అన్నట్లు ఉంది ఈ ఎమ్మెల్యే పరిస్థితి. ఇసుక మాఫియా లో అందిరిని మ్యానేజ్ చేస్తాడట. పోలీస్ లు,ప్రతిపక్షాలకు వాటాలు పంపిస్తాడట. డబ్బులు ఇస్తే ఇక నోరు ఎందుకు పెకులుతుంది. ఈ నియోజక వర్గంలో గూండాల రాజ్యం నడుస్తుంది. ఇక్కడ సంపాదించి మహారాష్ట్ర ,కర్ణాటక లో భూములు కొంటాడట. నేను నల్లగా ఉంటా…రోడ్లు కూడా అలానే ఉంటాయని చెప్పాడట. ఈయన ఇసుక మాఫియా తో మేకప్ వేసుకుంటాడు కావొచ్చు. అందుకే రోడ్ల పరిస్థితి కనిపించడం లేదు. ఈయన దళిత ఎమ్మెల్యే… దళితుల పక్షాన ఏనాడు నిలబడలేదు. నేరెల్ల లో దళితుల మీద దాడులు జరిగితే కనీసం ఈ ఎమ్మెల్యే నోరు కూడా మెదపలేదు.

తెరాస లో అందరూ ఇలానే తయారయ్యారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నాడు…24 గంటలు పవర్ ఇస్తున్నడట. మాటలు కోటలు దాటుతున్నాయి… చేతలు గడప దాటడం లేదు. 24 గంటలు కరెంట్ ఇస్తే మోటర్లు ఎందుకు కాలిపోతాయి..?. విద్యుత్ శాఖ మంత్రి ఇలాకా సూర్యాపేట లో మోటర్లు కాలిపోయిన సంగతి మీకు తెలియదా..?. ఇద్దరు రైతులు కరెంట్ షాక్ తో చనిపోతే పట్టించుకున్నవా…?. నియోజక వర్గంలో సమస్యలు పక్కన పెట్టీ… అందరూ మునుగోడు మీద పడ్డారు. ఒక్కో ఎమ్మెల్యే కి ఒక్కో గ్రామం ఇచ్చారట. మందు తాగిస్తున్నారు… ఓట్లను కొంటున్నాడు. మునుగోడు లో వీదుల్లో కుక్కల కొట్లాట. పాలన మొత్తం గాలికి వదిలేశారు. ఎమ్మెల్యేలు,మంత్రులు మొత్తం మునుగోడు311700394-657241095767776-7588422121690891754-n చేరారు. 118 నియోజక వర్గాల్లో పాలన గాలికి వదిలేసి… ఒక నియోజక వర్గం మీద పడ్డారు. ఇక కేసీఅర్ ఢిల్లీలో మకాం వేశారు. బిడ్డను అరెస్ట్ చేయకుండా లాబియింగ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల డబ్బు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నారు. TRS ను BRS చేశారు… కోడి కొటర్ లు పంచుతున్నారు. ఇక్కడ దోచుకున్నది చాలదని…ఇక దేశం మీద పడ్డాడు. బంగారు తెలంగాణ అని చెప్పి బ్రతుకే లేని తెలంగాణ చేశారు కదా..!. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఅర్ చేతిలో పెడితే 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. తెలంగాణ లో కనీసం పండించిన పంటకి కూడా బరోసా లేదు. రైతు అంటే ఈ ప్రభుత్వానికి విలువే లేదు. కేసీఅర్ సార్ కి సీఎం పదవి కాదు…ఇప్పుడు PM పదవి కావాలట. కేసీఅర్ కి మాత్రం ఆశ చావదు…రైతులు మాత్రం 59 ఏళ్లకే చావాలా..?. కాళేశ్వరం,మిషన్ భగీరథ పేరు చెప్పి లక్ష కోట్లు కాజేశారు. పాలమూరు ప్రాజెక్ట్ కి 17 వేల కోట్లు ఖర్చు చేశారు…ఇప్పుడు అనుమతులు లేవట. జాతీయ పార్టీలు పెట్టీ విమానాలు కొనడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి .?. వేల కోట్ల విలువ జేస్తే ఆస్తులకు కేసీఅర్ కూడా బెట్టుకున్నారు. కేసీఅర్ అరాచకాలను ప్రశ్నించే పరిస్థితి తెలంగాణ లో లేదు. బండి సంజయ్,రేవంత్ రెడ్డి ఇద్దరు మెగా కృష్ణా రెడ్డి కి అమ్ముడు పోయారు . కాళేశ్వరం పై ఢిల్లీ స్థాయిలో ఉద్యమం నేను చేస్తున్న. బీజేపీ దగ్గర ఆధారాలు ఉన్నాయి…ATM అంటున్నారు…కానీ చర్యలు లేవు. తెలంగాణ లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకే పార్టీ పెట్టాం. YSR ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తా.

LEAVE A RESPONSE