– టీడీపీ యువనేత లోకేష్
యువగళం సభలో నేను, మా టిడిపి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశామని పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నా తల్లిని అవమానించినవాళ్లు, మరో తల్లిని అవమానించకుండా బుద్ధి చెబుతాననడం రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా అవుతాయో! ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక పాలకులని ప్రశ్నించే బాధ్యతని ప్రతిపక్ష టిడిపి నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందో? రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై ప్రతిపక్షనేతగా వున్న జగన్ రెడ్డి చేసినవి. అపోజిషన్ లీడర్‌లా కాకుండా ఫ్యాక్షనిస్టులా చంద్రబాబుని కాల్చి చంపండి, ఉరి వేయండి, చెప్పులతో కొట్టండి, చీపుర్లతో తరమండి అని విద్వేషం నింపే ప్రసంగాలు చేశారు.