అంబేద్కర్ మహాశయుడు కమ్యూనిజాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు.
కానీ మన కమ్యూనిస్టులు లాల్ — నీల్ పేరుతో వారి ఉద్యమంలో చేరి, నిజమైన అంబేద్కర్ వాదులు చేస్తున్న ఉద్యమాన్ని కలుషితం చేస్తున్నారు.
కమ్యూనిజం అన్ని మతాలను వ్యతిరేకిస్తుంది.
కానీ మన కమ్యూనిస్టులు జిహాదీ లకు, మద్దతు ఇవ్వడమే కాకుండా వారి వినాశకర భావజాలానికి MOUTH PIECE గా పని చేస్తారు. క్రిస్టియన్ మత మార్పిడి ముఠాలతో కలిసి పని చేయడమే కాకుండా….. వారి అక్రమ సొమ్ము లో భాగస్వాములు అవుతారు.
కమ్యూనిజం దృష్టిలో భాషకు, జాతికి ఎలాంటి విలువ ఉండదు.
కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగా…. ఆర్య ద్రావిడ కుట్రపూరిత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తారు.
కమ్యూనిజం పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకం
కానీ మన దేశపు కమ్యూనిస్టులు, అవినీతి,దోపిడీ వ్యాపారస్తులకు అండగా పనిచేస్తూ ఉంటారు.
కమ్యూనిజం కార్మికులకు, కర్షకులకు భావజాల రీత్యా అనుకూలం.
కానీ మన దేశపు కమ్యూనిస్టులు, ప్రతి విషయానికి సమ్మెలు, ఆందోళనలు చేస్తూ వారి బతుకులు రోడ్డున పడే లాగా చేస్తారు.
కమ్యూనిజం ప్రజాస్వామ్యానికి సిద్ధాంతరీత్యా వ్యతిరేకమైనది.
కానీ మన కమ్యూనిస్టులు, దేశంలో రాజకీయపార్టీలు ఏర్పాటు చేసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రయత్నం చేస్తారు.
కమ్యూనిజం దైవం అనే భావనకి వ్యతిరేకం.
కానీ మన కమ్యూనిస్టులు.. అల్లా, జీసస్ మాత్రమే నిజమైన దైవం అనే భావజాలానికి మద్దతు తెలుపుతారు. అదే సమయంలో రాముడు ,శివుడు, దుర్గ, సరస్వతి లాంటి హైందవ దేవి దేవతలనే భావనకు బద్ద శత్రువులు.
కమ్యూనిజం వ్యక్తి సంక్షేమం కంటే రాజ్య శ్రేయస్సు ముఖ్యమని భావిస్తోంది.
కానీ మన దేశపు కమ్యూనిస్టులు, పెట్రోల్ రేట్ డీజిల్ రేట్ ల పెంపు అనే స్వల్ప కారణాలతో ప్రభుత్వంపై తిరగబడాలి అని దురుద్దేశంతో బోధిస్తారు.
కమ్యూనిజం నిరాడంబర జీవితాన్ని బోధిస్తుంది.
కానీ మన దేశపు కమ్యూనిస్టు.. బడా నాయకులు అక్రమంగా సంపాదించే అవినీతి సొమ్ముతో సిరిసంపదలతో తులతూగుతారు.
కమ్యూనిస్టు సిద్ధాంతం… దేశం అత్యంత శక్తిమంతంగా ప్రపంచంలో సూపర్ పవర్ గా నిలవాలని బోధిస్తుంది.
కానీ మన దేశపు కమ్యూనిస్టులు…. ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం…. బ్రేకింగ్ ఇండియా శక్తులతో కలిసి పని చేస్తారు.
( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)
– పెంజర్ల మహేందర్ రెడ్డి
అఖిలభారత ఓసి సంఘం
మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్
జాతీయ అధ్యక్షుడు