Suryaa.co.in

Telangana

విమోచన విలీనం విషయంలో బిజెపి పాత్ర ఏ మాత్రం లేదు

– ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి

హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం, విమోచన విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్రను పోషించింది. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్ర మరువలేనిది.ఎలాంటి రక్తపాతం లేకుండా చతురతను ప్రదర్శించి, రాజనీతితో సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలోకి విలీనం చేయించారు.

హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలోకి విలీనం చేయించడంలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించింది. ఈ ఖ్యాతి అప్పుడు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు, కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేని బీజేపీ సహా ఇతర పార్టీల నాయకులు విమోచన, విలీనం విషయంలో అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు.

విమోచన విలీనం చరిత్ర తెలియకుండానే బిజెపి నాయకులు ఇస్టారీతిన మాట్లాడుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయ్యే నాటికి బిజెపి పుట్టనే లేదన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు మరిచిపోతున్నారు. విమోచన విలీనం విషయంలో బిజెపి పాత్ర ఏ మాత్రం లేదు.

చరిత్ర ఆధారంగా భవిష్యత్ నిర్మాణం జరుగుతుంది. చరిత్రను ఎవరూ మార్చలేరు. విమోచన విలీనం చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం బిజెపి నాయకులకు ఏమాత్రం తగదు. భావి తరాలకు చారిత్రక వాస్తవాలు తెలిపాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఉంటుంది.

రాజకీయాల కోసం చరిత్రను విస్మరిస్తే రాజకీయ పార్టీల ఉనికి గాని బిజెపి పరువు గాని బజారుపాలు అవుతుంది. హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీనం, విమోచన అంశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే కీలకమైన పాత్రను పోషించిందన్న చారిత్రక వాస్తవాన్ని ఎవరు కూడా మరిచిపోవద్దు. ఈ విషయంలో బిజెపి సహా పలు పార్టీల నాయకులు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు.

LEAVE A RESPONSE