Suryaa.co.in

Telangana

సంఘ్ కు చెందిన వారే అధ్యక్షులుగా ఉండాలనే రూల్ లేదు

– అధ్యక్ష పదవికి ఎంపీ ఈటల రాజేందర్ కూడా అర్హుడే
– ఫ్లైట్ రేట్లు మేము పెంచింది కాదు
– అసద్ ను ముస్లింలే వ్యతిరేకిస్తున్నారు
– బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని అంటే చెంప చెళ్లుమనిపించండి
– నా వార్త మూడో పేజీలో సింగిల్ వార్త వస్తుంది
– అదే రేవంత్ రెడ్డి మేడ్చల్ వరకు మెట్రో అనగానే ఆ వార్తను బ్యానర్ వేస్తారు
– మేము కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాం దాన్ని మీడియా గ్రహించాలి
– మా పార్టీ క్యాండిడేట్ నియామకం మా ఇష్టం
కేటీఆర్ సుప్రీంకోర్టు జస్టిస్ అయ్యారు
– మీడియాతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిట్ చాట్

హైదరాబాద్: బీజేపీ అధ్యక్షులుగా ఆరెస్సెస్ నేపథ్యం ఉన్నవారే కావలసిన అవసరం లేదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అధ్యక్ష పదవికి ఎంపి ఈటల రాజేందర్ కూడా అర్హుడేనని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ చిరంజీవి తన ఆహ్వానం మేరకే సంక్రాంతి వేడుకలకు హాజరయ్యారని, ఇంకా చాలామంది సినీనటులతో పార్టీకి సంబంధాలున్నాయన్నారు. ఈమధ్య కేటీఆర్ సుప్రీంకోర్టు జడ్జి అయ్యారంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. మీడియాతో చిట్‌చాట్ చేసిన కిషన్‌రెడ్డి వివిధ అంశాలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మీడియా: చిరంజీవి బీజేపీలో చేరుతున్నారా ?
స్టార్టింగ్ లోనే AK 47 తో ఫైరింగ్ చేస్తున్నారా(నవ్వుతూ).. సంఘ్ కు చెందిన వారే స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండాలనే రూల్, ఇతరులు ఉండొద్దనే రూల్ ఏం లేదు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. మరో వారం సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే స్టేట్ ప్రెసిడెంట్ నియామకం జరగనుంది. దానిపై జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. స్టేట్ ప్రెసిడెంట్ గా ఎంపీ అవ్వొచ్చు, ఎమ్మెల్యే అవ్వొచ్చు, ఏ పదవి లేని వారు కూడా కావొచ్చు.

మీడియా: కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాబోతున్నారా?
నేను ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నాను. జాతీయ అధ్యక్షుడి పదవి విషయంలో పార్టీదే నిర్ణయం. బీఆర్ఎస్ పక్కా ఫ్యామిలీ పార్టీ. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన 50 రోజుల్లోనే సంస్థాగత ప్రక్రియ మొదలైంది. అందుకే కొన్ని యాక్టివిటీస్పై దృష్టి సారించలేకపోయాం. సుమారు 700 మండల కమిటీలకు గాను 650 కమిటీలు పూర్తయ్యాయి. కమిటీ అధ్యక్షులుగా మహిళలు ఎక్కువగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. 50 శాతం కంటే ఎక్కువ మంది బీసీలకు మండల కమిటీ అధ్యక్షులుగా నియమిస్తున్నాం. 33 శాతం రిజర్వేషన్లను పార్టీలో అంతర్గతంగా అమలు చేస్తున్నాం. మా పార్టీలో కచ్చితంగా ప్రతి 3 ఏండ్లకు ఓసారి సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి. గతంలో జిల్లా అధ్యక్షుల నియామకం డైరెక్ట్ గా జరిగేది. ఇప్పుడు అలా లేదు. మండల కమిటీలకు వయస్సు నిబంధన ఉంది.. యువరక్తం మాకు ప్లస్ అవుతుంది. మా బేస్ స్ట్రాంగ్ గా ఉండేందుకు ఇది ఒక కారణం. ఇది ఇతర పార్టీల్లో ఉండదు. అదే మాకు.. ఇతర పార్టీలకు తేడా. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటాం. లోకల్ బాడీ ఎన్నికల్లో వినిపించే వాయిస్ బీజేపీ మాత్రమే. ఎందుకంటే బీఆర్ఎస్ బిల్లులు పెండింగ్ పెట్టింది.. జీపీ ఫండ్ ను డైవర్ట్ చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ప్రజలను మోసం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వమే గ్రామాలను అభివృద్ధి చేస్తోంది. శ్మశాన వాటికల నుంచి నరేగా నిధుల వరకు అన్ని కేంద్రప్రభుత్వమే పంచాయితీలకు అందిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద జీతాలు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవు.. వాళ్లు గ్రామపంచాయతీలను ఏం అభివృద్ధి చేస్తారు? కాంగ్రెస్ అప్పుల కోసం ఎదురుచూస్తుంది.

కేసీఆర్ పొంకనాలకు పోయి డబుల్ బెడ్రూం ఇండ్లు కడుతానని మోసం చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. తెలంగాణలో 6 గ్యారెంటీలు సక్సెస్ ఫుల్ గా అమలుచేస్తామని ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెబుతున్నారు.. ఆయన మాటలు అక్కడ ఎవరు నమ్మరు. ఉచితాలకు వ్యతిరేకమని బీజేపీ ఎన్నడూ చెప్పలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధారంగా హామీలు ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పాం. తెలంగాణలో 7 నెలలుగా వీధి దీపాల ఏర్పాటుకు నిధుల కొరత ఉంది. బీర్, బ్రాందీ అమ్మగా వచ్చిన నిధులను సైతం కాంగ్రెస్ డైవర్ట్ చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బైఫర్ కేషన్ యాక్ట్ ప్రకారమే ఏపీకి నిధులు ఇస్తున్నాం. స్టీల్ ప్లాంట్ కు రూ.11,445 కోట్లు ఇచ్చాం. హైడ్రా కొత్తదేమి కాదు. పేరు మారిస్తే అది కొత్త చట్టమా? చెరువులను కబ్జా చేస్తే చర్యలు తప్పవనేది ముందు నుంచే ఉంది. మెట్రో ఫస్ట్ ఫేస్ లో రూ. 1250 కోట్లు కేంద్రం ఇచ్చింది. అది పూర్తి చేయకుండా అఫ్జల్ గంజ్ లో బీఆర్ఎస్ అడ్డుకుంది. అప్పుడు మజ్లిస్ కూడా మెట్రోను వ్యతిరేకించింది. ఎలా కడతారో చూస్తానని అక్బరుద్దీన్ అన్నారు. అలాంటి వాళ్లే ఇప్పుడు స్టాండ్ మార్చుకుని కట్టాలని కోరుతున్నారు. కట్టడానికి ముందుకొస్తే ఇప్పుడు కూడా కేంద్రం నిధులు కేటాయిస్తుంది.

బీఆర్ఎస్ RRR లైన్ అలైన్మెంట్ లో, కాంగ్రెస్ RRR అలైన్మెంట్ లో చాలా మార్పులు ఉన్నాయి. అసద్ ను ముస్లింలే వ్యతిరేకిస్తున్నారు. ఆయన పరిస్థితి పిట్టల దొరలాగా మారింది. మోడీని ఓడిస్తా అన్నాడు. 3 సార్లు పీఎం అయ్యారు. రామజన్మభూమి నిర్మిస్తే అంతు చూస్తామన్నారు. కట్టి చూపించాం. మూసీ సుందరీకరణ జరగాల్సిందే. కానీ పేదల ఇండ్లు కూల్చకుండా చేపట్టాలనేది మా డిమాండ్. మూసీ సుందరీకరణకు కేంద్ర సహకారం ఉంటుంది.

ప్రయాగ్ రాజ్ కు ఫిబ్రవరి 26 వరకు 13 వేల ట్రైన్లు నడుపుతున్నాం. ఫ్లైట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయంటే అది మేము పెంచింది కాదు. బొగ్గు గనుల మంత్రిగా ఆ శాఖకు చెందిన కార్మికులు 6 లక్షల మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వబోతున్నాం. బొగ్గు గనుల వేలం లేకపోవడంతో దుర్వినియోగాయానికి పాల్పడుతున్నారు. బొగ్గు గనుల వేలాన్ని ఆక్షన్ ద్వారా చేపట్టాలనేది సుప్రీంకోర్టు తీర్పు. మైన్స్ నేషనల్ ప్రాపర్టీ. రాష్ట్రాలకు హక్కు ఉండదు. అన్నీ కేంద్రం పరిధిలోకి తీసుకుంటాం.

కాంగ్రెస్ మాకు ప్రధాన రాజకీయ శత్రువు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ఎవడో ఏదో అన్న కామెంట్స్ ను మమ్మల్ని అడగొద్దు. ఎవరైనా అలా అంటే చెంప చెళ్లుమనిపించండి. టెక్స్ టైల్ పార్క్ కు ల్యాండ్ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంటే పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన 211 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయలేదు.

ప్రజల పక్షాన నిలబడి రాష్ట్ర అభివృద్ధి కోసం వందలకొట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వే స్టేషన్ లు నిర్మిస్తుంటే, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెస్తుంటే, RRR లాంటి పెద్ద ప్రాజెక్ట్ లు తీసుకొస్తే, నా వార్త మూడో పేజీలో సింగిల్ వార్త వస్తుంది. అదే రేవంత్ రెడ్డి మేడ్చల్ వరకు మెట్రో అనగానే ఆ వార్తను బ్యానర్ వేస్తారు. మేము కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా పనిచేస్తున్నాం దాన్ని మీడియా గ్రహించాలని కోరుతున్నాం.

3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవబోతున్నాం మంచి అభ్యుర్థులు బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. కరీంనగర్ స్థానం.. నుంచి పోటీ చేసే వ్యక్తి మల్క కొమురయ్య కార్పొరేట్ వ్యక్తి కాదు. విద్య సంస్థలు పెట్టి పేదలకు విద్య అందిస్తున్నారు. దశాబ్దాలుగా విద్యారంగంలో ఉన్నారు. మా పార్టీ క్యాండిడేట్ నియామకం మా ఇష్టం. రాష్ట్ర అధ్యక్షుడి పోస్టుకు 2 క్రియాశీల సభ్యత్వాలు మస్ట్.

మీడియా: అధ్యక్ష పదవికి ఈటలకు అవకాశం ఉంటుందా? ఉండదా?
ఈటల మా పార్టీ నుంచి 4 ఎన్నికల్లో పోటీ చేశారు . హుజూరాబాద్ బైపోల్, గజ్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ, మల్కాజిగిరి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. కాబట్టి ఆయన అర్హుడే. కేటీఆర్ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి సెటైర్లు.. ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ అయ్యారంటూ ఎద్దేవా.

LEAVE A RESPONSE