– కేసీఆర్ ను ముఖ్యమంత్రి కాదు… మోసగాడు..హంతకుడు అనాలి
– ఈ పాపం ముమ్మాటికీ కేసీఆర్ దే
– ఇదేనా బంగారు తెలంగాణ
– ఇది బీర్లు తెలంగాణ..బార్ల తెలంగాణ
– ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నాయి
– వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
– ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గం పెనుబల్లి మండలం పాత కరాయి గూడెం లో వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంకా ఏమన్నారంటే…
వైఎస్సార్ హయాంలో లక్షల ఉద్యోగాలు భర్తీ. ఒకే సారి 50 వేల టీచర్ ఉద్యోగాలు జంబో డీఎస్సీ ఇచ్చిన
ఘనత వైఎస్సార్ ది.వైఎస్సార్ హయాంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు లేవు. పరిపాలన అంటే వైఎస్ఆర్ ది.రెండు సార్లు కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే.. ఒక్క పనైనా చేశారా?కేసీఆర్ ను ఎందుకు ముఖ్యమంత్రి చేశాం అని తలలు పట్టుకుంటున్నారు. కేసీఆర్ తనకోసం..తన కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారు.
నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వలేదు.2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ లో భర్తీ చేయాల్సి ఉంది.చెట్టంత కొడుకులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి.. నిరుద్యోగానికి కారణం కేసీఆర్.ఆత్మహత్యలకు కారణం నిరుద్యోగం. మా పరిస్థితి ఇంకొకరికి రావొద్దని కేసీఆర్ కి లేఖలు రాసి ఆత్మహత్యలు. చేసుకుంటున్నారు .
ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలు. ఈ పాపం ముమ్మాటికీ కేసీఆర్ దే. ప్రతి ఏడాది ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.కేసీఆర్ కి తెలిసింది ఫామ్ హౌజ్ కి వెళ్లి పడుకోవడం.ఉద్యోగం ఇవ్వక పోతే నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి కాదా . ఎందుకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పావు కేసీఆర్.?
కేసీఆర్ ను ముఖ్యమంత్రి కాదు… మోసగాడు..హంతకుడు అనాలి.ఉద్యోగులు లేక నిరుద్యోగులు హమాలీ పనులకు పోతున్నారు. డిగ్రీలు,పీజీ లు చదివిన పిల్లలు కూలి పనికి పోతున్నారు. డిగ్రీలు పీజీలు చదివి
కులవృత్తులు చేసుకోవాలా..? ఇదేనా బంగారు తెలంగాణ..ఇందుకోసమే నా సాధించుకున్నది..? ఉద్యోగాలు వస్తాయని చెప్తే తెలంగాణ లో వందల మంది బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వచ్చాక కూడా ఆత్మహత్యలు చేసుకోవాలా? చదువుకున్న బిడ్డలు రోడ్ల పై తిరగాలి..కేసీఆర్ బిడ్డలు రాజ్యాలు ఏలాలి.
5,6 చదివిన వాళ్లు మంత్రులుగా ఉన్నారు. కేసీఆర్ ది పరిపాలన అంటారా? ఆయనకు పరిపాలన చేతనవుతుందా..?పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ ఎందుకు ఉండాలి ముఖ్యమంత్రి పదవిలో? రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చెయ్యి. ఎలక్షన్లు అయితే మీ తో పని అయిపోతుంది.ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణ గా..ఆత్మహత్యల తెలంగాణ గా మార్చారు. ఇది బీర్లు తెలంగాణ..బార్ల తెలంగాణ.. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నాయి.
పార్టీ పెట్టక ముందు నుంచే నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నాం. మా దీక్షలతో అధికార పక్షానికి, ప్రతిపక్షాలకు సోయి వచ్చింది. మా పోరాట ఫలితమే ప్రస్తుత నోటిఫికేషన్లు. 8 ఏళ్లు ఆలస్యం చేసినందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. పోలీస్ శాఖలో తప్పితే ఎక్కడ భర్తీ లు లేవు. తెలంగాణ లో 3లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. లక్ష 91 వేల ఉద్యోగాలతో పాటు.. పూర్తి స్థాయిలో భర్తీ చేపట్టాలి లక్షా 91 వేలు అని చెప్పి 80 వేలకు కుదించారు. లక్షా 91 వేల ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇచ్చే వరకు ప్రతి మంగళవారం దీక్ష ఆగదు.