– పార్టీ శ్రేణులంతా కొనుగోలు కేంద్రాల దగ్గర నిరసన చేయాలి
– సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన
– సదాశివపేట శనిగేల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కేటీఆర్
సంగారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయలేక ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది. రేవంత్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతుబంధు సమయానికి వేయలేదు. రైతులకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది.
రైతులకు సమయానికి రైతుబంధు వేసిన చరిత్ర కేసీఆర్‌ది. ప్రభుత్వం పంటలను కొనకుండా అన్నదాతలను వేధిస్తోంది. ఆంక్షలు లేకుండా పంటలను కొన్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి.
రాబోయే వారం రోజులపాటు కొనుగోలు కేంద్రాలను పరిశీలిద్దాం.పార్టీ శ్రేణులంతా కొనుగోలు కేంద్రాల దగ్గర నిరసన చేయాలి. తహశీల్దార్, ఆర్డీవోలకు వినతిపత్రాలు ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీద్దాం. మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలి. వరి, జొన్నలు, శనిగలకు మద్దతు ధర ఇవ్వడం లేదు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ కదంతొక్కుతుంది.
బీఆర్ఎస్ శ్రేణులకు ఇక్కడి నుంచి పిలుపునిస్తున్న. వారం రోజుల పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలి. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు ఉండాలి. ధాన్యం కొనేవరకు అండగా ఉండాలి. ఒకవేళ ప్రభుత్వం కొనకపోతే..
తహసీల్దార్, కలెక్టర్ కారాయలం ముందు ఆందోళన చేయాలి. ప్రభుత్వం చివరి గింజ కొనే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు
పంట కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు చనిపోతున్నారు. రైతులు చనిపోడాని కి కారణం రాష్ట్ర ప్రభుత్వమే. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. రైతుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.