– 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదు
– మహిళలకు 2500, పెన్షన్ల మొత్తాన్ని పెంపుపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పోస్టు కార్డు ఉద్యమం
– ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు
– సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దాం. రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యాని పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చారు. 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదు. రేవంత్ రెడ్డికి అబద్దాలు ఆడడం అలవాటైంది.
గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదు. యస్.. అసెంబ్లీ పెడుదాం. ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసినదానిపై చర్చిద్దాం. కేసీఆర్ దమ్మెంతా అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం. రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలి. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. వృద్ధులకు రూ 2 వేల పెన్షన్ ను రూ 4 వేలు చేస్తామన్న హామీని విస్మరించిన కాంగ్రెస్. వికలాంగుల పెన్షన్ ను రూ 4 వేల నుంచి రూ 6 వేల కు పెంచకుండా మోసం చేసిన కాంగ్రెస్.
మహిళలకు నెలకు రూ 2500 ఇస్తామన్న హామీ ఏమైంది ? గ్యారెంటీలపై సోనియా గాంధీ సంకతం పెట్టిన గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంచారు. సోనియాగాంధీ ముఖం చూసి ఓట్లేసిన మహిళలను, వృద్ధులను, వికలాంగులు మోసం చేశారు. అందుకే సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు పంపించారు.పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని రేవంత్ రెడ్డికి ఆదేశాలివ్వాలని సోనియా గాంధీని కోరాము.