Suryaa.co.in

Andhra Pradesh

గుంతకల్లులో వైద్యం అందక పదమూడేళ్ల మొబీనా మృతి

-డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
-ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం

ఆడుతూ పడుతూ ఉండే వయస్సు, రోగం అంటే తెలియని అమ్మాయి పదమూడు ఏళ్ల షేక్ ముబీనా గుత్తి వాస్తవ్యురాలు తల్లిదండ్రులు అసంఘటిత రంగంలో పనిచేస్తారు ప్రస్తుతం గుంతకల్లు హనుమేష్ నగర్ లో నివాసం ఉంటున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న మొబీనా ఈ నెల ఏడో తారీఖు తీవ్రమైన కడుపునొప్పి తో గుంతకల్లు సర్వజన ఆసుపత్రి ఔట్ పేషంట్ గా వెళ్ళింది. మొబీనా కు కనీస పరీక్షలు జరపకుండా కేవలం పదవ తేదీ వరకు నిర్లక్ష్యం చేస్తూ పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు.

అక్కడ ఉన్న డాక్టర్ రామాంజనేయులు. మూడు రోజులు తరువాత కడుపు నొప్పి తీవ్రం కావడంతో డాక్టర్ పై ఒత్తిడి తీసుకురావడంతో అమ్మాయికి స్కానింగ్ బయటకు వెళ్లి చేయించాలని చెప్పడంతో అప్పు చేసి మొబీనా తల్లి మస్తానీ స్కానింగ్ ఇతర పారా మెడికల్ పరీక్షలు చేయించారు. రిపోర్టు తీసుకొని డా రామాంజనేయులు కు చూపితే, అయన పరిస్థితి విషమించింది అని అనంతపురం సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లాలని సెలవిచ్చారు. అప్పటికే మొబీనా కు అప్పెండిక్స్ చిట్లిపోయి ప్రాణాంతకంగా మారింది. అనంతపురం సర్వజన ఆసుపత్రికి తీసుకెళితే కర్నూల్ ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు.

చేసేది లేక అతి కష్టం మీద కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చిన మరుసటి రోజు చనిపోయింది. దీనికంతటికి ప్రధాన కారణం గుంతకల్లు లో ఉన్న డాక్టర్ రామాంజనేయులు. పరిస్థితి ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు పరీక్షలు చేయించక, అలాగే పరిస్థితి చేయిదాటి పోయినప్పుడు కూడా అనంతపురం అక్కడ నుండి కర్నూలు తిప్పి ప్రాణాలను తీశారు. డా రామాంజనేయులు ప్రైవేటుగా నర్సింగ్ హోమ్ నడుపుతూ తక్కువ సమయం విధులలో ఉండటం అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషంట్లను అనవసర పరీక్షలు బయట చేయిస్తూ వారిని తన శ్రీ విద్య చిన్న పిల్లల నర్సింగ్ హోమ్ కు పంపే ఏర్పాటు చేస్తుంటాడు. పేద పిల్ల షేక్ మొబీనా పరిస్థితి అరణ్యరోదనే అయ్యింది. వైద్యులు చకచకా స్పందించాల్సిన చోట అలసత్వం ప్రాణాలు తీసింది.

వైద్యులను దేవుడిగా భావిస్తారు కొందరు డాక్టర్లు వ్యవహరించే తీరు మొత్తం డాక్టర్ల వృత్తికే కళంకం తెచ్చే విధంగా ఉంది. కొందరు డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహారించి రోగుల ప్రాణాల మీదికి తెస్తున్నారు. సరియిన వైద్యం అందక రోజు ఎందరో మొబీనాలు చనిపోతున్న డాక్టర్ల నిర్లక్ష్య ధోరణి ఎక్కడ తగ్గడం లేదు ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన ఎక్యుప్మెంట్ లేక కనీస పరీక్షలకు ప్రయివేటు ల్యాబ్ కు వెళ్లాల్సిన పరిస్థితి. ముక్కు పచ్చలారని షేక్ మొబీనా మృతితో అయినా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చలనం వస్తుందా ఆంటే అవి కనిపించడం లేదు. డాక్టర్ల ధోరణిలో ఎక్కడ ప్రశ్చాత్తాపం లేదు.

మొబీనా మృత దేహాన్ని తీసుకురావడానికి కూడా తల్లితండ్రుల దగ్గర డబ్బు లేకపోవడంతో గుత్తి కి చెందిన 108 శ్రీనివాసులు, వరిగడ్డి షేక్షావలి, రఫీ తదితరులు తోడ్పాటుతో మొబీనా మృత దేహాన్ని గుత్తి కి తీసుకురాగా గుంతకల్లుకు చెందిన దాతల సహకారంతో ఖననం చేశారు. ప్రభుత్వ వైద్యశాలలు దారుణంగా ఉన్నాయనడానికి మొబీనా ఉందంతం చెబుతుంది. పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం విస్మరిస్తుందనటానికి పెద్ద కారణాలు చూపక్కర్లేదు. షేక్ మొబీనా మృతికి కారణమైన డాక్టర్ రామాంజనేయులు నిర్లక్ష్య ధోరణి ప్రధాన కారణంగా భావించి డాక్టర్ రామాంజనేయులు పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.image-1

LEAVE A RESPONSE