– ఏడాదికి 50వేల కోట్ల అవినీతి
– గత సిఎండి సంతోష్ రావు దే కీలక పాత్ర
– గత రెండు సంవత్సరాల్లో జరిగిన అవినీతి ప్రేమ కథ క్లైమాక్స్ లో ఉంది
– ఇందులో హీరోయిన్ ఒక్కరే, ఇద్దరు హీరోలు
– ఒక హీరోయిన్ కాకపోతే ఇంకొక హీరోయిన్ తెచ్చుకుంటారు
– తోషిబా,షిర్డిసాయి ఎలక్ట్రానిక్ మాత్రమే క్యాలిపికేషన్ ఇచ్చి, అర్డర్లు ఇచ్చే విదంగా టెండర్ నిబంధనలు మార్చారు
– ఒకే సంస్థకు 90 శాతం పనులు.. సప్లయి చేయకపోయినా బిల్లులు డ్రా
– నేనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని చెప్పిన వారు ఎందుకు అవినితి గురించి మాట్లాడరు?
– తిరుపతి ‘సెంటర్ ఫర్ లిబర్టీ’ ఆల్ పార్టీ రౌండ్‌టేబుల్ లో మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
తిరుపతి: ‘‘ఆదారాలతో సహా మేము విద్యుత్ అవినీతిపై చూపించాము. ఇది ట్రయిలర్ మాత్రమే.పకడ్బందీగా అవినీతి సామ్రాజ్యం నిర్మించారు. ఈ దందా వల్ల పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలు నష్టపోతారు. నేనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని చెప్పిన వారు ఎందుకు అవినితి గురించి మాట్లాడారు? అవినీతికి ఎస్పీడిసిఎల్ ఎక్స్ పర్ మెంట్ ల్యాబ్ గా మారింది. ఓ మాఫియా చేతిలో ఇప్పటికి ఎస్ పి డిసిఎల్ ఉంది. ప్రభుత్వం మారిన మాఫియా చేతుల్లోనే ఉంది.
కాంపీటేషన్ లేకుండా నిబంధనలు మార్చి ఇద్దరికే టెండర్లు వచ్చే విదంగా నిబంధనలు మార్చారు. తోషిబా,షిర్డిసాయి ఎలక్ట్రానిక్ మాత్రమే క్యాలిపికేషన్ ఇచ్చి, అర్డర్లు ఇచ్చే విదంగా టెండర్ నిబంధనలు మార్చారు. ఈ దరిద్రాన్ని మిగతా రెండు డిస్టిబ్యూషన్ కు అంటించారు ’’ అని మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు విద్యుత్ కాంట్రాక్టులపై విరుచుకుపడ్డారు.
గత సిఎండి సంతోష్ రావు దే కీలక పాత్ర. క్యాన్సర్ లాగా మాపియా అక్రమించింది. ఒకే సంస్థకు 90 శాతం పనులు ఇచ్చారు. ఇన్స్ పెక్షన్ ఉండదు. సప్లయి చేయకున్న బిల్లులు డ్రా చేశారు. షిరిడి సాయి గోడౌన్ లో మీటర్లు పరికరాలు ఉంటాయి. బిల్లులు మాత్రము ఇస్తారు. 11లక్షల మీటర్ల పరికరాల బిల్లు 1400కోట్లలో ఏన్నికల ముందు 1000కోట్లు డ్రా చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత మిగతా 200కోట్లు డ్రా చేశారు. ఈ అన్యాయం ఇంకా ఎందుకు కొనసాగుతుంది?
ఆర్ డి ఎస్ గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ సరపరా చేసే పనులను మూడు సంస్థలకు ఇచ్చారు. ఇవి కూడా షిరిడి స్థాయి,రాఘవ, ఎన్ సిసి సంస్థలకు అప్ప చెప్పారు. 20వేల ట్రాన్స్ పార్మర్లు పంపిణీ చేసామన్నారు. రెండు సంవత్సరాలుగా బిగించలేదు. గత ప్రభుత్వం నిసిగ్గుగా 2023లో మొదలు పెట్టిన ఈ దోపిడిని ఎందుకు ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది? ఈ ప్రభుత్వానికి అపే శక్తి సామర్థ్యం లేవా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఏబీ వెంకటేశ్వరరావు ఇంకా ఏమన్నారంటే.. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మొట్టమొదట్లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీరు చూశారు. ఇవేవి కొత్త విషయాలు కావు, మేము మీ ముందు పెట్టిన విషయాలు ఏవి మీకు తెలియనివి కావు కాదు, కానీ పేపర్లలో చూసో, నోటి మాట ద్వారా పుకార్లుగానో మాట్లాడుకోకుండా , ఆధారాలతో సహా చూపించినప్పుడు మాత్రమే దానికి విశ్వసనీయత కలుగుతుంది.
కాబట్టి, చక్రవర్తి ఎంతో ఓర్పుగా, చాలా కష్టపడి ఈ విషయాలన్నింటినీ అనధికారికంగా సేకరించి ఈ ప్రెజెంటేషన్ మీ ముందు ఉంచారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, దీన్ని చూసి మీకు అర్థమై ఉంటుంది ఇందులో డెప్త్ ఎంత ఉందో, ఎంత విస్తృతమైన స్థాయిలో ఎంత పగడ్బందీగా అవినీతి సామ్రాజ్యాలని నిర్మించారో మీ అందరికీ అర్థమై ఉంటుంది.
ఇది రెండు ప్రభుత్వాల అవినీతి ప్రేమ కథ. ఇందులో హీరోయిన్ ఒక్కరే, ఇద్దరు హీరోలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ హీరోయిన్ ని వెంటబడుతూ ఉన్నారు. మేము ఏ సంస్థల పేర్లు పాడు చేయడం మా ఉద్దేశం కాదు, ఎవరిని పేరు పెట్టి పిలిచి వాళ్ళని అవమానించడం మా ఉద్దేశం కాదు.
ఎవరిదైనా సంస్థ పేరు తీసుకుంటున్నాం అంటే ఎంతో బాధతో తీసుకుంటున్నాం తప్ప, వాళ్ళ మీద మాకు అసలు వాళ్ళు వ్యక్తులు ఎవరో మాకు తెలియదు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం, ప్రజల రోజువారి జీవితానికి సంబంధించిన విషయం, ప్రజల జేబులకు సంబంధించిన విషయం, నెల నెల కట్టే బిల్లులకు సంబంధించిన విషయం.
చాలా పెద్ద స్థాయిలో ప్రజలు దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు, ప్రభావితం అవుతున్నారు కాబట్టి మేము ఈ శిరిడీ సాయి కంపెనీ, ఇలాంటి కంపెనీల పేర్లు తీసుకుని మాట్లాడాల్సి వస్తుంది. కంపెనీలు ఏవైతే ఉన్నాయో అది ఆ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ వచ్చేదేమో. ఇది ముఖ్యంగా ప్రభుత్వాల ప్రేమ కథ, ఒక హీరోయిన్ కాకపోతే ఇంకొక హీరోయిన్ తెచ్చుకుంటారు.
ఈ సంస్కరణలు విద్యుత్ సంస్కరణలని మనం ఏవైతే వింటుంటామో దానికి చాలా మంది క్లెయిమ్ చేసుకుంటారు. నేనే సంస్కరణలు తెచ్చాను, నేనే బాగు చేశాను, నేనే సంస్కరణలు తెచ్చాను, నేనే బాగు చేశాను అనే వాళ్ళు ఎవ్వరూ కూడా.. ఇవాళ అవినీతి కూడా నేనే దాంట్లో, దానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాదే అని ఎవ్వరూ అనరు. దానికి ఎవరు బాధ్యత తీసుకోరు. సుమారు 27-28 సంవత్సరాల క్రిందట, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు, ఖచ్చితమైన సూచనలు దానికి కావలసిన ఇన్సెంటివ్స్, రాయితీలు ఇచ్చి, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ సంస్థలన్నిటిని సంస్కరించారు . మనకంటే ముందు హర్యానా, ఒరిస్సా ఈ సంస్కరణలు అమలు చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమలు చేసింది. మనతో పాటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా సంస్కరణలు అమలు చేశాయి. మూడు నాలుగు సంవత్సరాల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ అనేది రాష్ట్రాల సబ్జెక్టు, రాజ్యాంగం ప్రకారం, కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్‌గా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు.
ఇది కేవలం విద్యుత్తే కాదు, విద్యా రంగంలోనూ, ఆరోగ్య రంగంలోనూ రాష్ట్రాలకు ఉన్న ప్రతి రంగంలోనూ కేంద్రం కాలు మోపింది మనకు తెలియదు. అది సరే, చాక్లెట్లు చూపించి అన్ని రాష్ట్రాలతోనూ విద్యుత్‌లో సంస్కరణలు చేయించింది. తమిళనాడు మాత్రమే దాని జోలికి పోలేదు, ఇంకా అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డే పని చేస్తుంది.
అప్పటివరకు ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డులను రద్దు చేసి, విద్యుత్ ఉత్పత్తి అంటే జనరేషన్, పవర్ ప్లాంట్లను సెపరేట్ చేసి, డిస్ట్రిబ్యూషన్ అంటే లైన్లు లాగటం, బిల్లులు వసూలు చేయడం, డిస్ట్రిబ్యూషన్‌ని సెపరేట్ చేసి, ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి లైన్లు, కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు – లక్షల సంఖ్యలో ఉంటాయి. అందువల్ల రాష్ట్రాన్ని వివిధ డిస్ట్రిబ్యూషన్ సంస్థలుగా స్వతంత్ర సంస్థలుగా దేనికది కార్పొరేషన్‌గా, ఒక కమర్షియల్ సంస్థగా రిజిస్టర్ చేసి, వాటికి ఒక సీఎండిని నియమించి నడిపించడం జరిగింది.
ప్రభుత్వ ప్రమేయం వీటి రోజువారి నడవడికలో లేకుండా చేయడాన్ని సంస్కరణ అనుకుంది. మంచి ఉద్దేశంతో చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు 25 ఏళ్ళ తర్వాత వెనక్కి చూసుకుంటే ఇందుకు నష్టమే తప్ప లాభం జరిగినట్టుగా ఏ మాత్రం కనపడటం లేదు.
నేను నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటే నాకేంటి లాభం? లేకపోతే డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఉంటే నాకేంటి నష్టం? నిష్పక్షపాతంగా చూస్తే అంతలో ఏ మాత్రం లాభం ఉన్నట్టుగా మాకు కనపడటం లేదు. ఎంతో ముందు “ఎలక్ట్రిసిటీ బోర్డు” అంటే కనీసం విద్యుత్ శాఖ మంత్రి, కొంత జవాబుదారితనం ఉండేది, ప్రభుత్వానికి కొంత బాధ్యత ఉండేది.
ఈ జవాబుదారితనాన్ని కూడా తీసేసి, ఏం చేశారు? ఈఆర్సి అని చెప్పి, ఒక రిటైర్డ్ జడ్జిని కూర్చోబెట్టారు. ఆయన పర్యవేక్షిస్తాడు, విద్యుత్ సంస్థల పనితీరులను అని మంచి ఉద్దేశంతో పెట్టి ఉండొచ్చు, కానీ ఇప్పుడు 25 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అది “ఫెయిల్యూర్” అయినటువంటి సంస్థ, ఈ ఈఆర్సి చరిత్రలో ఏ తప్పుని సరిదిద్దారో, ఏ ఈఆర్సి రిటైర్డ్ జడ్జి ఏ తప్పుని సరిదిద్దారో చెప్పమనండి. విద్యుత్ రంగ సంస్థల తప్పిదాలకు అధికార ఆమోదం ముద్ర వేయడానికే పనికొస్తున్నాయి. ఇదొక దరిద్రం. ఇప్పుడు ఎవరిని అడగడానికి లేదు.
అసెంబ్లీలో ఎవరో ఎమ్మెల్యే గారో, ఎమ్మెల్సీ గారో ఒక ప్రశ్న వేశారు – మన దగ్గర కొనే ట్రాన్స్ఫార్మర్లు, వస్తువులు, రేట్లు చాలా ఎక్కువైపోయాయి అంటున్నారు. దీని మీద సమాధానం – మార్గదర్శకాన్ని ఇవ్వలేదు, “మేము హైయర్ స్టాండర్డ్ నాణ్యత, బ్రహ్మాండమైన క్వాలిటీ” ఉన్నవి కొంటున్నాం అందుకే, కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటూ ఐదు కోట్లు దాటిన కాంట్రాక్ట్ ఇది అంత స్థాయి కి జరిపారని చెప్పారు.
ఈ ఈఆర్సి ను కనుక్కుంటే.. గత రెండు సంవత్సరాల్లో జరిగిన అవినీతి ప్రేమ కథ క్లైమాక్స్ లో ఉంది, ఇప్పటికీ క్లైమాక్స్ నడుస్తూనే ఉంది. ఊహించరాని స్థాయిలో ఏదైతే అవినీతి జరిగిందో, ఆ అవినీతిలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు ఈఆర్సి నుంచి పర్మిషన్ లేదు.
పాత డేట్‌తో కొంచెం పర్మిషన్లు ఇవ్వండి, అని советలు మొదలవుతాయి. కాగితాలు పంపిస్తారు, ఈఆర్సి కి నెలల తరబడి ఛైర్మన్ లేదు, ఛైర్మన్ వేయడానికి ఓపిక లేదు, టైం లేదు. ఇక ఈ నెలల్లో జరిగిన అవినీతిని ఎవరు పర్యవేక్షించారో మనకి తెలియదు. పాత డేట్‌తో ఇస్తే ఆయన “నాకు వద్దు” అంటారు, ఐతే ఎవరూ సంతకం పెట్టరు. ఇవాళ్టికీ కూడా పర్మిషన్ లేదు.
ప్రభుత్వాన్ని అడగండి, మీడియా ఉండగా అడగండి, ఎక్కడ ఉందో పర్మిషన్ చూపించమని, ఏ నిర్ణయానికి పర్మిషన్ ఉందో చెప్పమని? లేవు. ఈఆర్సి పనితనం, సంక్షణల ఫలితాలు, ఒక్కసారి అన్నం ఉడికిందో లేదో చూసుకోవడానికి ఉదాహరణగా చెప్పాను.
ఈ సంస్కరణలు తీసుకున్న తర్వాత జవాబుదారితనం లోపించింది, పరిస్థితి అధ్వాన్నం అయిపోయింది తప్ప, ఎక్కడా మెరుగుదల కనపడటం లేదు. ప్రజలుగా – దీన్ని ఏం చేయాలి అన్నది ఆలోచించాలి.
తిరుపతి ఎందుకయ్యా?
ఇది ప్రధానంగా జరిగింది తిరుపతిలో. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎక్కువ కనెక్షన్లు వ్యవసాయ కనెక్షన్లు – 21 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అందులో వైజాగ్ కేంద్రంగా ఉన్న ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఓ ఐదు లక్షల కనెక్షన్లు ఉన్నాయి, విజయవాడ కేంద్రంగా ఉన్న సెంట్రల్ డిసిఎల్ కి ఐదు లక్షల కనెక్షన్లు ఉన్నాయి. 11 లక్షల కనెక్షన్లతో ముఖ్యమైన డిస్ట్రిబ్యూషన్ కమిషన్ తిరుపతిలో ఉంది – ఎస్ పిడిసిఎల్. ఇది అన్నిటికంటే పెద్ద డిసిఎల్ మన రాష్ట్రంలో, ఎక్కువ కనెక్షన్లు ఉన్నది ఇక్కడే.
ఇక్కడే ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, అవినీతి. వెంకటేశ్వర స్వామి ఆదాయం ఎంతంటే 5000 కోట్లు, ఈ ఎస్ పిడిసిఎల్ లో తిరుపతి కేంద్రంగా వెంకటేశ్వర స్వామి కొండ ముందు జరిగే అవినీతి సంవత్సరానికి 50 వేల కోట్లు దాకా ఉంది. ఇక్కడే ఎక్కువ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ లాగా ఎలా రాష్ట్రాన్ని ఒక ముఠా కంపెనీ కబ్జా చేసిందో వివరించారు.
వివిధ కంపెనీలకి టెండర్లు ఎలా కట్టిపారేసారు? రెండే కంపెనీలు క్వాలిఫై అయ్యేలా రూల్స్ మార్చారు. ఎక్కువ రేట్లకి పనులు ఇచ్చారు. సరైన ఇన్స్పెక్షన్ చేయలేదు. ఆనంతరం ఎలా తోటలో గోడౌన్ లో ఉంటే సరిపోతుందన్న టెక్నికల్ మాఫియా మెకానిజంలను వివరించడమే కాక, ఎన్నికలకే ముందే బిల్లులు మొత్తం తీసేసుకున్నట్టు, నిజంగా సరఫరా కాని మీటర్ల పై బిల్లులు వేయడం, సబ్ కాంట్రాక్టర్లను విడిచిపెట్టడం, అసలు సరఫరా కాని ఉపకరణాలకు కోట్ల బిల్లులు వేసే విధానం, ప్రభుత్వ మార్పున్నా అవినీతి బంధం మారకుండా ఉండడాన్ని సభలో కూలంకషంగా ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
ప్రజలు సందేశాన్ని అర్థం చేసుకుని, పరస్పరమైన బాధ్యతతో, ప్రభుత్వాల మార్పుకన్నా, పరివర్తన కోసం ప్రయత్నించాలి. అటు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులను ప్రశ్నించాలి. ఉద్యమ బాట పట్టించాలి అని ఏబీ స్పష్టం చేశారు.