– పీసీబీకి లాలూచీ లేకపోతే రాంకీ, హెటిరో డ్రగ్స్‌పై ఎందుకు చర్య తీసుకోవడం లేదు?
– నోటీసులతో ఎందుకు సరిపెడుతున్నారు?
– ఇందులో ప్రభుత్వ వాటా ఎంత ?
– సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ
పరవాడ: ఎన్జీటీ 7 కోట్ల రూపాయల జరిమానా విధించిన హెటిరో డ్రగ్స్‌పై ప్రభుత్వానికి ప్రేమెందుకో అర్ధం కాదు. పీసీబీతో హెటిరో డ్రగ్స్, రాంకీ ఫార్మాతో లాలూచీ స్పష్టమయింది. ఇప్పటివరకూ వాటిపై పీసీబీ చైర్మన్, మెంబర్ సెక్రటరీ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే దానిని ఎలా అర్ధం చేసుకోవాలి? పీసీబీకి ఎలాంటి లాలూచీ లేకపోతే రాంకీ, హెటిరో డ్రగ్స్‌పై ఎందుకు చర్య తీసుకోవడం లేదు? నోటీసులతో ఎందుకు సరిపెడుతున్నారు? ఇందులో ప్రభుత్వ వాటా ఎంత అన్న ప్రజల ప్రశ్నలకు జవాబు చెప్పాలి. గెడ్డల్లో తీస్తున్న శాంపిల్స్ వివరాలు ఎందుకు ప్రకటించడం లేదు?
హెటిరో డ్రగ్స్ పరిశ్రమ నుండి వదులుతున్న విష రసాయనిక జలాలు వలన రాజయ్యపేట మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే విడుదల చేస్తున్న జలాల వలన మత్స్య సంపద నాశనం అవుతుంది. 2023 డిసెంబర్ లో ఏడు కోట్ల రూపాయలు ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెటిరో డ్రగ్స్ యాజమాన్యానికి జరిమానా విధించిన మార్పు రాలేదు.
దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం బల్బ్ డ్రగ్ పరిశ్రమలను ఈ ప్రాంతంలో పెడితే.. మరింత కాలుష్యం ప్రజల జీవించే హక్కునే భరించే పరిస్థితి. ఆర్టికల్ 21 పూర్తిగా ఉల్లంఘనకి గురవుతుంది. హెటిరో డ్రగ్స్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి. బల్క్ డ్రగ్ పరిశ్రమను ఈ ప్రాంతంలో పెట్టకుండా ప్రభుత్వం పునరాలోచన చేయాలి.