– కాంట్రాక్టర్ జై ప్రకాష్ గౌర్
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారు చనిపోయారని జేపీ అసోసియేట్స్ యజమాని జై ప్రకాష్ గౌర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు రోజులుగా టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం ఆపరేషన్ కొనసాగించారు. అయితే ఇవాళ టన్నెల్ చివరి వరకు వెళ్లినా వారి ఆచూకీ లభించలేదు. బురదలో కూరుకుపోయి చనిపోయి ఉంటారని, వారి మృతదేహాలు బయటకు తీశాక ప్రాజెక్ట్ కంటిన్యూ చేయాలో వద్దో మంత్రులతో మాట్లాడినట్లు ప్రకాష్ తెలిపారు.