Suryaa.co.in

Features

‘ఛావా’… కాషాయ కాంతితో..

మనదేశంలో వచ్చిన గొప్ప సినిమాల్లో ఒకటి ఛావా. చాల గొప్ప సినిమా ఛావా.
దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ ఉన్నతమైన ప్రతిభతో ఉత్కృష్టంగా తీసిన సినిమా ఛావా! ఒక దర్శకుడు ఒక కథను ఇంత గొప్పగా తెరకెక్కించడం విశేషం; ప్రత్యేకం. షాట్ మేకింగ్ చాల గొప్పగా ఉంది. అద్భుతమైన ‘Frame sense’తో సినిమాను నిర్మించాడు దర్శకుడు. విషువల్స్ కావ్య స్థాయిలో ఉన్నాయి. గొప్ప ‘poetic sense’తో సినిమాను సుసంపన్నం చేశాడు దర్శకుడు. సినిమా చివరి ఘట్టాలలో సాహసోపేతంగా కవిత్వాన్ని పొందుపరిచి సినిమాకు చవిని పొదివారు లక్ష్మణ్ ఉతేకర్.
శ్రేష్ఠమైన సినిమా టోగ్రఫీ. సౌరభ్ గోస్వామి aesthetic sense చాలా మేలుగా ఉంది. సంభాషణలు గొప్పగా ఉన్నాయి.

Tone and texture… సినిమా tone and texture విశేషంగా ఉన్నాయి. షాట్ షాట్ లో మాత్రమే కాదు ఫ్రేమ్ ఫ్రేమ్ లోనూ దర్శకుడి ప్రతిభ ద్యోతకమౌతోంది. కథను, సంఘటనలను విప్పుకుంటూ, చెప్పుకుంటూ వెళ్లిన ‘శైలి’ ప్రతిభావంతంగా ఉంది.
Pace…సినిమా pace చాలా ప్రత్యేకంగా ఉంది.
అంతర్జాతీయ స్థాయి సంగీతం! ఎ.ఆర్. రహ్మాన్ back ground score అంతర్జాతీయ స్థాయిలో అమరింది. పాటలు కూడా మేలుగా ఉన్నాయి.
Emotion… సినిమాలో ఎమోషన్ అద్భుతంగా అలుముకుని హృదయంగమంగా ఉంది.

విక్కి కౌశల్ శంభాజీగా ఎంతో గొప్పగా నటించాడు. అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రను చాల గొప్పగా చేశాడు. పాత్రకు తగ్గట్టు రశ్మిక సరిగ్గా నటించింది. సినిమాలో నటీనటులందరూ చాల మేలుగా నటించారు. విక్కి కౌశల్‌కూ, అక్షయ్ ఖన్నాకు జాతీయ అవార్డులు రావచ్చు.

మన దేశంలో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా వచ్చినందుకు కాస్తంత గర్వంగా ఉంది. ఈ అంతర్జాతీయ సినిమాలో హిందూత్వం తొణికిసలాడుతూండడం మరింత గర్వాన్ని కలగజేస్తోంది. మనదేశంలో భారతీయతా భావాలతో ఇలాంటి సినిమాలు రావడం అవి ఘనవిజయాన్ని సాధిస్తూండడం ఎంతో సంతోషకరం! ఇటీవలి కాలంలో మనదేశంలో భారతీయతా భావాల లేదా సనాతన భావజాల సినిమాలు రావడం అవి సూపర్ హిట్స్ అవడం అన్న గొప్ప trend మొదలై వర్ధిల్లుతోంది.

మన తెలుగు సినిమా దర్శకులు రాజమౌళి, ‘ఆర్. ఆర్. ఆర్’ వంటి సినిమాతోనూ, బోయపాటి శీను ‘అఖండ’ వంటి సినిమాతోనూ, సుకుమార్ ‘పుష్ప’ సినిమాలోని ‘జాతర’ తోనూ, కన్నడంలో రిషబ్ శెట్టి ‘కాంతారా’ సినిమాతోనూ, మరి కొందరు దర్శకులూ ‘Hindu-sense’తో గొప్ప విజయాల్ని, జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు.

1960ల నుంచే మన సినిమాల్లో మస్లీమ్‌లు, క్రైస్తవులను మంచివాళ్లుగానూ, సినిమాల్లో విలన్‌లను హిందువులుగా మాత్రమే చూపిస్తున్న గర్హనీయమైన స్థితి ఉంది. ఇది ఒక రకమైన మానసిక బలహీనత; ఇది మానసిక బానిసత్వం. ఈ దుస్థితి నుంచి తెప్పరిల్లి ఇటీవలి కాలంలో మన సినిమా వాంఛనీయమైన, అభినందనీయమైన Hindu-Senseలోకి నడవడం గొప్ప పరిణామం.

‘కాషాయ కాంతి’… ఛావా సినిమాలో కాషాయ కాంతి మెరుస్తూనూ, కాషాయ కాంతితో ఛావా సినిమా మెరుస్తూనూ పెద్ద స్థాయి జనామోదాన్ని జనాదరణనూ అందుకుంది! విదేశీ వర్ణాలు, జనహానికర కొడవలి-సుత్తి మన సినిమాకు ఇక వద్దు. సినిమాల ద్వారా కూడా విదేశీ మతోన్మాదానికి, విదేశీ విధ్వంసక భావజాలానికి మనం తీవ్రంగా గాయపడ్డాం. ఇక మనం పుంజుకోవాలి. మన సినిమాల్లో విదేశీ వర్ణాలు కాదు మన సినిమాల్లో మన మట్టి రంగు మెరుస్తూండాలి.

ఛావా లాంటి సినిమాల అవసరం ఇప్పటి పరిస్థితుల్లో మన దేశానికి ఎంతైనా ఉంది.
‘India needs Hindu-sense movies’
జాతీయతా భావాల సినిమాల వెల్లువ మన దేశంలో రావాలి. ఛావా విజయం మనదేశ సినిమాకు దిశా నిర్దేశం చేస్తోంది.
ఛావా నిన్నటి వరకూ 360కోట్ల పైచిలుకు కలెక్షన్లతో… 800 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు… అన్ని రకాలుగానూ ‘An epitome of excellence ఛావా’;
‘An exqisite and an exemplary movie’ ఛావా’.
ఛావా దర్శకుడి ప్రతిభకు ప్రత్యేక అభినందనలు. విక్కి కౌశల్‌కూ, అక్షయ్ ఖన్నాకు ప్రత్యేక అభినందనలు.

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE