Home » అక్రమ కేసులు పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తా

అక్రమ కేసులు పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తా

-జగన్‌ రెడ్డి ఫొటోను చూస్తే గొడ్డలి గుర్తొచ్చేలా చేస్తున్నారు…
-ప్రజలు చూసి భయపడాలనేది వైసీపీ లక్ష్యం
– రైతులకు అండగా నిలవలేని దద్దమ్మ నాయకుడు ఎలా అవుతాడు?
– జగన్‌ ధన దాహానికి మహిళల మాంగల్యాలు మంటగలిసిపోతున్నాయి
– నాది అభివృద్ధితో కూడిన రాజకీయాలు…సైకోవి హత్యా రాజకీయాలు
– మన ఆస్తులపై సైకో బొమ్మలు వేసి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు
– జగన్‌ రెడ్డి ఫొటోను చూస్తే ప్రజలకు గొడ్డలి గుర్తుకొచ్చేలా చేస్తున్నారు
– మన మేనిఫెస్టో అదిరింది…సైకో మేనిఫెస్టో అడ్రస్‌ లేకుండా పోయింది
– మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో ప్రకటించాం
– కొవ్వెక్కిన వైసీపీ నాయకుడు దళితులను చంపితే..వాళ్లను సైకో పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు..
– జిల్లాల వారీగా మాలలు, మాదిగలకు రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత తీసుకుంటాను
– దెందులూరుకు ఎర్రిపప్ప కొడుకు వచ్చాడు..ఎర్రిపప్పను చేసి ఇంటికి సాగనంపాలి
– చింతమనేని, మహేష్‌ యాదవ్‌ను గెలిపించుకునే బాధ్యత దెందులూరు ప్రజలదే
– వంగవీటి రాధాకృష్ణకు గుర్తింపునిచ్చే బాధ్యత నాదే…
– దెందులూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు

ఈరోజు విడుదల చేసిన మన మేనిఫెస్టో అదిరిపోయింది…సైకో మేనిఫెస్టో అడ్రస్‌ లేకుండా కిందికి దిగిపోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం దెందులూరు ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. గంజాయి ఇచ్చి యువతను నాశనం చేసేవాడు నాయకుడెలా అవుతాడు? నాయకుడు అంటే సింహాన్ని, పులిని అని చెప్పుకోవడం కాదు. సమర్థవంతమైన పాలనతో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. గంజాయి ఇచ్చి యువత భవిష్యత్తును నాశనం చేయకూడదు. నాయకుడు అంటే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి, అభివృద్ధి చేయాలి…కానీ, పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వలేని దద్దమ్మ నాయకుడా? ప్రజా ప్రతినిధా? అని ప్రశ్నించారు. రానున్న ఐదేళ్లలో ఏమి చేయబోతున్నాం? ప్రజల ఆశలను ఎలా తీర్చాలి? అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోను విడుదల చేశామని వివరించారు. వృద్ధులు, చిన్న పిల్లలు నొక్కే బటన్‌ను ఇంటిలో ఉండి నొక్కుతూ…నేను అంతా చేసేశాను అని జగన్‌ చెప్పుకుంటున్నాడని ధ్వజమెత్తారు.

అక్రమ కేసులు పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా
చింతమనేనిపై 43 అక్రమ కేసులు పెట్టారు…నాపైనా కేసులు పెట్టారు. మేము ప్రజల కోసం..ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం…ఎన్ని ఇబ్బందులు పెట్టినా కష్టపడి పనిచేస్తూనే ఉంటాం…మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా నిలుస్తాం. తప్పుడు కేసులు పెట్టిన ప్రతిఒక్కరికీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాది…ఎవరూ తప్పుడు కేసులకు భయపడొద్దు. నా మంచితనాన్నే ఇప్పటి వరకు చూస్తున్నారు. రానున్న కాలంలో నా కఠినత్వాన్ని కూడా కొంత మంది చూడబోతున్నారు. నాయకుడికి నాయకత్వ పటిమ, దూరదృష్టి, సమర్థవంతమైన పరిపాలనపై పట్టు ఉండాలి. ఫలితాలు సాధించేవాడు, సుపరిపాలన అందించేవాడే నాయకుడు.

ఐదేళ్లలో జగన్‌ బటన్‌ నొక్కడం తప్ప…పొడిచిందేమీ లేదు
నేను ఏమీ చేయలేను…తాను ఏదో చేస్తాను, పొడుస్తాను అని జగన్‌ అంటున్నాడు. ఐదేళ్లు జగన్‌ ఏం పొడిచాడో చూశారు మీరంతా…బటన్‌ నొక్కి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు…ఏమీ మిగల్లేదు. జగన్‌ పాలనలో రేట్లు అన్నీ పెంచేసి బాదుడే బాదుడు… క్వార్టర్‌ మద్యం ధర గత పాలనలో రూ.60 ఉండేది…ఇప్పుడు రూ.200లకు పెంచేశారు. జగన్‌ పాలనలో కల్తీ మద్యంతో ఆరోగ్యాలు పాడైపోయి ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచేసిన వ్యక్తి సైకో.

అబద్ధాలు చెప్పడంలో జగన్‌ రెడ్డి పీహెచ్‌డీ చేశాడు
జగన్‌ రెడ్డి అబద్ధాలు చెప్పండలో జగన్‌ పీహెచ్‌డీ చేశాడు. ఏ యూనివర్శిటీలో చేశాడో మనకు చెప్పడు. జగన్‌ రెడ్డి బాధితులనే నిందితులను…నిందితులను బాధితులను తన అబద్ధాలతో చేస్తున్నాడు. సొంత బాబాయ్‌ని చంపేసిన వ్యక్తి…నేడు వివేకా కూతురిపై కేసులు పెట్టి వేధిస్తున్నాడు.

ప్రజల భూములు కొట్టేసేందుకు జగన్‌ రెడ్డి కొత్త చట్టం
జగన్‌ రెడ్డి కొత్తగా ఓ చట్టం తెచ్చాడు…దాని పేరు ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌. రాష్ట్ర ప్రజలకు తెలియకుండానే ప్రజల ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో మార్చేసి తన పేరుమీద రాసేసుకుంటాడు..జాగ్రత్త. మీ ఆస్తికి జగన్‌ రెడ్డి ఓనర్‌ అయిపోతాడు. పులివెందులలో జగన్‌ రెడ్డి భార్య ఎన్నికల ప్రచారం చేస్తుంటే…మా పితరుల ఆస్తులపై మీ భర్త ఫొటో ఎందుకు అని పులివెందులలో భాస్కరరెడ్డి అనే వ్యక్తి నిలదీస్తే సమాధానం లేక మౌనం పాటించాల్సి వచ్చింది. మీ ఆస్తులపై సైకో ఫొటో వేసుకుంటున్నాడు. నిద్ర లేచిన వెంటనే సైకో ఫొటో చూడాలని భావిస్తున్నారు..సైకో ఫొటో చూడగానే ప్రజలకు గొడ్డలి గుర్తు రావాలి..ప్రజలు భయపడాలనేదే వైసీపీ లక్ష్యం. ప్రజాస్వామ్యాన్ని జగన్‌ రెడ్డి అపహాస్యం చేశాడు…భ్రష్టు పట్టించాడు, బెదిరించాడు…ఎక్కడికక్కడ మీ జీవితాలను నాశనం చేశాడు.

నేను ఒక్కసారి కూడా కరెంటు చార్జీలు పెంచలేదు
గడిచిన ఐదేళ్లలో కరెంటు చార్జీలు తొమ్మిది సార్లు పెంచారు…అసలు కరెంటు చార్జీలు పెంచనని చెప్పి ఇలా చేశాడు. నేను సీఎంగా ఉన్నప్పుడు కరెంటు చార్జీలు ఒక్కసారి కూడా పెంచలేదు. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాలు, చెత్తపన్ను, ఇంటిపన్ను, వృత్తి పన్ను ఇలా అన్నిటిపై రేట్లు పెంచేసి బాదేస్తున్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు… 2019 ఎన్నికల ముందు మెగా డీఎస్సీ, జాబ్‌ క్యాలెండర్‌ అని ఇష్టమొచ్చినట్లు వాగ్ధానాలు చేసి ఒక్కటీ అమలు చేయలేదు. ఇకపై అమలు చేసే అవకాశమూ లేదు.

జగన్‌ రెడ్డిది నేరపూరిత రాజకీయం, హత్యారాజకీయం
జగన్‌ రెడ్డిని నేను చంపుతానని నాపై అభాండాలు మోపుతున్నాడు…బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. నాకు తెలిసింది అభివృద్ధి రాజకీయాలు…జగన్‌ రెడ్డికి తెలిసింది నేరపూరిత, హత్యా రాజకీయాలు. హత్యలు చేసి, నేరాలు వేరొకరిపై నెట్టేసి తప్పించుకుని బయట తిరిగే రకం జగన్‌ రెడ్డి నైజం….హత్యలు చేసిన వాడిని బోను ఎక్కించే రాజకీయాలు చేసే నైజం నాది. 2019 ఎన్నికల ముందు గొడ్డలితో బాబాయ్‌ని చంపేసి ఆ నేరాన్ని నాపై నెపం నెట్టేశారు.

కోడికత్తి డ్రామా ఆడాడు. నేడు గులకరాయి డ్రామా. నేటి యువత, పిల్లలు బ్యాండేజీలు కట్టుకుని వస్తున్నారు…ఏమైంది అని అడిగితే గులకరాయి తగిలిందని చేబుతున్నారు. నేను జగన్‌ రెడ్డిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నానని జగన్‌ రెడ్డి, తన భార్య, ఏ2 మాట్లాడుతున్నారు…అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ల నోళ్లకు గట్టిగా వాత పెడితే తప్ప..సిగ్గు రాదు. మీరు చేసే పనులను ప్రత్యర్థులపై నెట్టాలని చూస్తున్నారు…మా ప్రాంతంలో హత్యా రాజకీయాలు లేవు. దెందులూరు, .పశ్చిమగోదావరిలో హత్యా రాజకీయాలు లేవు… పులివెందు లలో కూడా లేవు..కానీ, జగన్‌ రెడ్డి మాత్రమే హత్యా రాజకీయాలకు తెరలేపాడని ధ్వజమెత్తారు.

వైసీపీ నేతలు కొవ్వెక్కి దళితులను చంపారు
గోదావరి జిల్లాకు చెందిన కారు డ్రైవర్‌, ఒక ఎస్సీ యువకుడిని చంపి, డోర్‌ డెలివరీ చేసి అంత్యక్రియలు చేసుకోవాలని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దుర్మార్గులకు కొవ్వెక్కిపోయింది.వీళ్ల మక్కెలు విరగ్గొట్టేవాళ్లు లేక ఆటలాడుతున్నారు. దళితులను చంపేవాడిని పక్కన పెట్టుకుని జగన్‌ రెడ్డి తిరుగుతున్నాడు. ఇలాంటి జగన్‌ రెడ్డి పాలనలో ప్రజలకు భద్రత లేదు. యువతకు భద్రత లేదు…మహిళలకు భద్రత లేదు. పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించాను…ఈ విషయంలో ఎవరికీ అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. అభివృద్ధి చేశాను. 28 సార్లు పోలవరాన్ని విజిట్‌ చేశాను…80 సార్లు వర్చువల్‌గా సమీక్ష చేసి, 72 శాతం ప్రాజెక్టును పూర్తిచేస్తే ఆ ప్రాజెక్టును గోదావరిలో ముంచేసిన దుర్మార్గుడు జగన్‌ రెడ్డి.

దెందులూరు ప్రజలకు లిఫ్టులు పెట్టి అయినా నీళ్లు ఇచ్చి ఆదుకుంటా
ఈ ప్రాంతంలో అప్‌ ల్యాండ్స్‌, మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. పోలవరం, చింతలపూడి పూర్తి అయితే ఈ భూములకు నీరు పుష్కలంగా అందుతాయి. పంటలు బాగా పండి ఆదాయం పెరుగుతుందని నేను ఆశపడ్డాను. దెందులూరు ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైతే రెండు లిఫ్టులు పెట్టి చింతలపూడి లేదా పోలవరం నుండి నీళ్లు తెస్తామని హామీ ఇస్తున్నాను. ఆక్వా రైతులకు రూ.1.50లకే యూనిట్‌ కరెంటు ఇస్తాను..పామాయిల్‌ కు మద్దతు ధర ఇస్తాం..ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం…ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20వేలు ఆర్థికసాయం చేస్తాను. .పామాయిల్‌ రైతులకు 90శాతం సబ్సిడీతో డ్రిప్‌ పరికరాలు అందిస్తాను. వ్యవసాయాన్ని ఆధునీకరణ చేస్తాం. యువతకు మెగా డీఎస్సీ ఇస్తాం…మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తాను…ఐదేళ్లలో 20ల క్షల ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అందిస్తాం…

ఆడపడుచులను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో ప్రకటన
మన మేనిఫెస్టోలో ఆడపడుచులను దృష్టిలో పెట్టుకుని పథకాలు ప్రకటించాము. మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు, ఐదేళ్లలో 90వేలు ఇచ్చే బాధ్యత నాది. జగన్‌ రెడ్డి అమ్మఒడి అందరికీ ఇస్తానని చెప్పి కటింగులు, ఫిటింగులు పెట్టాడు. మనం అధికారంలోకి వచ్చాక ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు ఇచ్చి చదివిస్తాను. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తాను. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాను.

మహిళలకు రక్షణగా ఉంటాను…ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్‌ చేయండి… మీకు అండగా నిలబడే బాధ్యత నాది. జగన్‌ రెడ్డి మాదిరిగా నేను రూ.10 ఇచ్చి, రూ.100 దోచేయను. గత ఐదేళ్లలో ఖర్చులు పెరిగాయి….ఆదాయం తగ్గిపోయింది. దీని నుంచి బయటపడేందుకు అప్పుల్లో మునిగిపోయారు. మేం అధికారంలోకి వచ్చాక మీ ఆదాయాన్ని పెంచుతాను..ఖర్చులు తగ్గిస్తాను. మీ జీవన ప్రమాణాలను పెంచు తానని హామీ ఇస్తున్నాను. సైకో మీ ఆదాయాన్ని పెంచడం లేదు…మిమ్మల్ని రేట్లు పెంచి చితక్కొడుతున్నాడు. పామాయిల్‌ మద్దతు ధర లేదు…వరి పంటకు గిట్టుబాటు ధర లేదు.

మేం అధికారంలోకి వచ్చాక సంపదను సృష్టిస్తాను…ఆ ఆదాయాన్ని మీకు పంచుతాను…ఆ తెలివితేటలు టీడీపీకి ఉన్నాయి… పవన్‌కళ్యాణ్‌కు కూడా ప్రజలకు న్యాయం చేయాలనే తపన ఉంది. మనకు కేంద్రం సహకారం కూడా ఉంది…2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ చేయాలని చూస్తున్నాడు. 2047 నాటికి తెలుగుజాతి అగ్ర జాతిగా ఉండాలనే ఆలోచన చేస్తున్నాను. నేను పేదవాళ్ల పక్షపాతిగా ఉంటాను. మీ కష్టాలకు పరిష్కార మార్గాలను కూడా చూపిస్తాను. చేపలు ఇవ్వడమే కాదు…చేపలు పట్టడం కూడా రాష్ట్ర ప్రజలకు నేర్పిస్తాను. మీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను. జగన్‌ రెడ్డి జలగ మాదిరి మీ రక్తాన్ని పీల్చేస్తున్నాడని వ్యాఖ్యానించారు.

లండన్‌ బాబు పేకాట కంపెనీలు తెచ్చాడు
దెందులూరులో ఓ ఎమ్మెల్యే ఉన్నాడు…దెందులూరును దందాల ఊరుగా మార్చిన వ్యక్తి లండన్‌ బాయ్‌. దెందులూ రులో ఎలాంటి అభివృద్ధి లేదు…ఐటీ కంపెనీ తెస్తానని చెప్పి తీసుకురాలేదు. లండన్‌ బాబు తెచ్చిన కంపెనీ…పేకాట కంపెనీ….జూదాలు ఆడుతున్నాడు… ఐటీ చదివాడు…లండన్‌ పోయాడు…బుద్ధి మంచిదేమో అనుకున్నాను…కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు. లండన్‌ బాబు గుడి, బడి అనే తేడా లేకుండా మద్యం అమ్ముతున్నాడు. పోలవరం కాలువ మట్టి దోచేశాడు…ఇది చాలా పెద్ద నేరం.

దీనివల్ల ప్రజల పొలాల్లోకి నీళ్లు వచ్చి పంటలు పాడైపోతాయి. కొల్లేరులో అక్రమంగా చెరువులు తవ్వారు. కొల్లేరు 5 నుంచి 3 కాంటూరుకు రావాలని మీ కోరిక… అధికారంలోకి వచ్చాక మీ కోరికను నెరవేరుస్తాను… కేంద్రంతో ఈ విషయాన్ని చర్చిస్తాను. సెంటు పట్టాల విషయంలో రూ.20 లక్షల భూమిని రూ.40 లక్షలకు కొనుగోలు చేసి డబ్బులు దోచుకున్నారు. జగన్నాధపురం ఎత్తిపోతల పథకానికి తాడేపల్లి నుంచి బటన్‌ నొక్కాడు..ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు. జగన్‌ రెడ్డి బటన్‌ నొక్కితే మీ నదిలో ఇసుక మాయమైపోతుంది…మీ పనులు పూర్తికావు. కాలువల పూడికలు తీయిస్తాం…రైతులకు కష్టాలు లేకుండా ఆదుకుం టాం.

ఎర్రిపప్ప కొడుకుని ఎర్రిపప్పను చేయాల్సిన బాధ్యత మీదే..
రైతులకు గోనె సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప…తన కొడుకుని ఇక్కడికి పంపించాడు. ఎర్రిపప్ప కొడుకుని దెందులూరు ప్రజలంతా ఎర్రిపప్పను చేసి ఇంటికి పంపాలని కోరుతున్నాను. మహేష్‌ యాదవ్‌ అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి…మీకు న్యాయం చేస్తాడు. మహేష్‌ యాదవ్‌కు పరిశ్రమలు తెచ్చే శక్తి ఉంది…మీకు అందుబాటులో ఉండే వ్యక్తి… చింతమనేని ప్రభాకర్‌, మహేష్‌ యాదవ్‌లను మీకు అందుబాటులో పెడతాను…వీళ్లను గెలిపించే బాధ్యత మీది. జన సైనికులు ఒకవైపు…ఎమ్మార్పీఎస్‌ మరో వైపు మనకు అండగా ఉన్నారు. జిల్లాల వారీగా మాదిగలు, మాలలకు రిజర్వేషన్‌ క్యాటగిరీలు పెట్టే బాధ్యత తీసుకుంటామని మేనిఫెస్టోలో పొందుపర్చాం. ప్రతి వర్గానికి న్యాయం చేసే పార్టీ టీడీపీ…ఎన్డీఏ కూటమి.. రానున్న 10 రోజులు మాకోసం పనిచేయండి…రానున్న ఐదేళ్లు రాత్రింబవళ్లు మీకోసం కష్టపడి పనిచేస్తాను.

వంగవీటి రాధాకృష్ణకు గుర్తింపునిచ్చే బాధ్యత నాది
వంగవీటి రాధాకృష్ణ నిజాయితీగా ప్రజలకు ఏదొకటి చేయాలని తపన ఉండే నాయకుడు. తండ్రి పేరును అడ్డుపెట్టుకుని చాలా మంది పదవులు ఆశిస్తారు..కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ. ప్రజాక్షేత్రం లో ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి దూసుకెళుతున్నాడు. ప్రజలకు అండగా నిలిచేందుకు నిరంతర శ్రామికుడిలా పనిచేస్తున్నాడు. రాధాకృష్ణ సేవలు ఈ రాష్ట్రానికి అవసరం..సరైన గుర్తింపునిచ్చే బాధ్యత నాది.

Leave a Reply