Suryaa.co.in

Features

ఇంగ్లీషులో మాట్లాడేవారు తెలుగువారే!

ఓసారి ఒక నర్తకీమణి శ్రీ కృష్ణ దేవరాయల వారి ఆస్థానానికి వెళ్ళి మహారాజా నేను ఎనిమిది భాషల్లో పాడుతూ నృత్యం చెయ్యగలను. అయితే అంతా అయ్యాక అందులో నా మాతృ భాష ఏదో సరిగ్గా చెప్పగల వారెవరైనా ఉన్నారేమో చూద్దాం అందిట.

సరేనని ప్రభువులు ఆమె కార్యక్రమం ఏర్పాటు చేశారు. బ్రహ్మాండమైన ఆ కార్యక్రమం తరవాత ఆ నర్తకీమణి ఒక ఉచితాసనం మీద సేద తీరుతుండగా, రాయల వారు ముందుగా అష్టదిగ్గజాలను అడిగారుట. అప్పుడు పెద్దన్నగారు పెదవి విరిచారుట. తిమ్మన గారు కిమ్మన లేదుట.
యథాప్రకారం రాయల వారు తెనాలి రామకృష్ణునికి సైగ చేయగా, వారు లేచి సాలోచనగా ఆ నర్తకీమణి ముందు నుంచి నడిచి వెళుతూ, ఆమె బొటన వేలు మీద కాలేసి కసిక్కున తొక్కారుట! అప్పడా నర్తకీమణి “యూ బ్రూట్, కాంట్ యూ సీ వాట్ యూ ఆర్ డూయింగ్?” అని కోపగి౦చుకుందిట.
యథా ప్రకారం రాయల వారు “ఏమి రామకృష్ణా! ఏమిటిది?” అని గద్దించారుట.

అప్పుడు రామకృష్ణుడు “మన్నించండి మహారాజా, ఈ నర్తకీమణి అచ్చమైన తెలుగమ్మాయి. ఆ విషయం తెలుసుకోడానికే ఇలా చెయ్యవలసొచ్చింది” అన్నాట్ట. అపుడా నర్తకి “ఆయ్, నిజవేఁనండి! అయ్ బాబోయ్, ఎలా కనిపెట్టీసార౦డీ” అందిట! అపుడు సభనుద్దేశించి రామకృష్ణుడు “ఎవరైనా ఏదైనా హఠాత్ సంఘటన జరిగినా, దెబ్బ తగిలినా, ఆశ్చర్యాన్ని, బాధని వారి మాతృ భాషలో వ్యక్తం చేస్తారు. కానీ అటువంటి సమయంలో కూడా ఇంగ్లీషులో మాట్లాడేవారు తెలుగువారే!

– వెలగపూడి గోపాలకృష్ణ

LEAVE A RESPONSE