Suryaa.co.in

హిందూ ఆచారాలపై ‘టైమ్స్’ విద్వేషపూరిత వ్యాసం
Telangana

హిందూ ఆచారాలపై ‘టైమ్స్’ విద్వేషపూరిత వ్యాసం

– నిరసనగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రతుల దగ్ధం
హిందువుల ఆచరాలను వెక్కిరిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో వచ్చిన ఒక వ్యాసం దుమారం రేపుతోంది. ఆ వ్యాసం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ హిందూ సంస్థలు రోడ్డెక్కాయి.
‘‘ హిందూ సాంప్రదాయం నమ్మే ప్రతి ఒక్కరూ, భగవంతుడు అనుగ్రహించిన వేదము వేదాంగములను, అనుసారంగానే తన జీవన విధానాన్ని గడుపుతారు. మహమ్మదీయులకు ఖురాన్ లాగా, క్రైస్తవులకు బైబిల్ లాగా, హిందూ సంప్రదాయంలో పుట్టిన ప్రతివాడూ వేదము వేదాంగములను ఆచరిస్తారు. ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూ,ఎదుటివారిని గౌరవించాలనే రాజ్యాంగ బద్ధమైన చట్టాన్ని గౌరవించకుండా, పత్రిక స్వేచ్ఛ అనే ముసుగులో, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వారు ద్వేష పూరితమైన, శీర్షిక రాయడం జరిగింది ’’ అని ఇదంబ్రాహ్మం ప్రతినిధి డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు.
ఇటువంటి ద్వేష పూరితమైన,అసహనాన్ని, రెచ్చగొట్టే కథనాలు మానుకోవాలని, దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో వచ్చిన శీర్షికకు, వివిధ కులాలకు చెందిన హిందూ బంధుమిత్రులు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ని తగల పెట్టడం జరిగింది.టైమ్స్ ఆఫ్ ఇండియాtimes-file కథనాన్ని నిరసిస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ధర్మశక్తి ,ఇదంబ్రాహ్మం పక్షాన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్, దర్శనం మరుమాముల వెంకట రమణ శర్మ, చెరువు రాంబాబు, యామిని, సుచరిత తదితరులు, టైమ్స్ పత్రికలో హిందువులకు వ్యతిరేకంగా వచ్చిన

వ్యాసంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టైమ్స్ హిందూ వ్యతిరేకి అని ఆరోపించారు. సంతుష్ఠీకర విధానాలు అవలంబిస్తున్న టైమ్స్ యాజమాన్యం తాజా వ్యాసానికి క్షమాపణ చెప్పకపోతే, ఆ పత్రికను హిందూజాతి బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు.
‘‘ టైమ్స్‌కు హిందూ ఆచారాలు, సంప్రదాయాలంటే అంత చులకనా? ముహుర్తాలంటే మూర్ఖత్వమా? ముహుర్తాలంటే ఉన్మాదమా? ఆ పత్రిక ఇంత అజ్ఞానంలో బతకుతోందా? హిందువుల ఆచారాలపై విమర్శనాత్మక వ్యాసాలు రాస్తున్న టైమ్స్‌కు ముస్లిం-క్రైస్తవుల ఆచారాలను విమర్శించే దమ్ము, ధైర్యం ఉందా? హిందూ జాతి అంటే మీకు అంత చేవచచ్చిన సమాజంలా కనిపిస్తోందా? హిందువుల మౌనం

మీకు అసమర్ధతగా కనిపిస్తోందా? టైమ్స్ పత్రిక ఎడిటర్‌కు దమ్ము ధైర్యం ఉంటే ఇదే తరహాలో ముస్లిం-క్రైస్తవుల ఆచారాలపై విమర్శనాత్మక వ్యాసాలు ప్రచురించాలి. లేకపోతే హిందూ ఆచారాలను విమర్శించినందుకు జాతికి క్షమాపణలు చెప్పాల’’ని ధర్మశక్తి ప్రతినిధి మరుమాముల వెంకటరమణ శర్మ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE