-స్పీకర్, దళిత ఎమ్మెల్యేపై టీడీపీ నేతల దాడిని ఖండించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
-ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతల తీరును ఎండగట్టిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు
-టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ట్వీట్స్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభా చరిత్రలో ఇవాళ బ్లాక్‌డే అని మంత్రులు, వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సోమవారం శాసనసభ లో టీడీపీ నేతలు సభ సజావుగా సాగకుండా అడ్డతగిలి.. స్పీకర్ పోడియం వద్ద అనుచితంగా ప్రవర్తించారు. టీడీపీ నేతలు పేపర్లు చించి స్పీకర్‌పైకి విసరడంతో పాటు ప్లకార్డ్‌ను ఆయనకు అడ్డుగు పెట్టిన సభలో గందరగోళ పరిస్థితికి దారి తీశారు. స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వెళ్లకుండా వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మోహరించగా, ఈ క్రమంలో అధికార పార్టీ సభ్యులపై టీడీపీ నేతల దాడికి దిగారు. దళిత ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబుపై టీడీపీ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ఖండించారు.
మంత్రులు, ఎమ్మెల్యేల ట్వీట్స్ ..
మంత్రి ఆర్కే రోజా
సభలో ప్రతి రోజూ ఎస్సీ నేతలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను అసభ్య పదజాలంతో తిట్టించడం, స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి రచ్చ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను శాశ్వతంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి ఆర్కే రోజా డిమాండు చేశారు.
గడికోట శ్రీకాంత్‌రెడ్డి
శాసన సభ సాక్షిగా వైయస్‌ఆర్‌సీపీ దళిత ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై టీడీపీ ఎమ్మెల్యేలు దాడి చేయడం హేయమైన చర్య. ప్రజాస్వామ్య చరిత్రలో ఇవాళ బ్లాక్‌డే
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
శాసనసభలో ఏకంగా స్పీకర్ గారి మీద దాడికి ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యే సంస్కారహీనుడు డోలా వీరాంజనేయస్వామిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే..
ఎమ్మెల్యే బియ్యపు మధుసుధన్‌రెడ్డి
అసెంబ్లీలో ఏకంగా స్పీకర్ గారి మీద దాడికి ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఎస్సీ నేతను ముందు పెట్టి చోద్యం చూస్తూ రాక్షసానందం పొందే చంద్రబాబుని శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా చేయాలి
ఎంపీ నందిగాం సురేష్
శాసన సభ సాక్షిగా వైయస్‌ఆర్‌సీపీ దళిత ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై టీడీపీ ఎమ్మెల్యేలు దాడి చేయడం శేయమైన చర్య. ఏపీ అసెంబ్లీ చరిత్రలో ఇవాళ బ్లాక్‌డే
ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి
శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరును ప్రజాస్వామ్యంలో ఇవాళ బ్లాక్‌డేగా చెప్పుకోవాలి. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి దౌర్యన్యం చేయడమే కాకుండా దళిత ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై దాడి చేయడం హేయమైన చర్య
ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
ఏపీ శాసన సభా చరిత్రలో ఇవాళ బ్లాక్‌డే. బీసీ వర్గానికి చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం గారిపై దాడికి ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఇది రాజ్యాంగ వ్యవస్థలో సరైన పద్ధతి కాదు.
ఎంపీ మార్గాని భరత్
బీసీ వర్గానికి చెందిన స్పీకర్ తమ్మినేనిపై దాడికి ప్రయత్నించిన టీడీపీ శాసన సభ్యులపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఇది టీడీపీకి బీసీలపై ఉన్న కపట ప్రేమ .
మాజీ మంత్రి పుష్పా శ్రీవాణి
సభలో ప్రతి రోజూ ఎస్సీ నేతలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, స్పీకర్‌ను అసభ్య పదజాలంతో తిట్టించడం, స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి రచ్చ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి భవిష్కరించాల్సిందే
మంత్రి విడదల రజిని
అసెంబ్లీ సాక్షిగా వైయస్‌ఆర్‌సీపీ దళిత ఎమ్మెలే సుధాకర్‌బాబుపై దాడి చేసిన టీడీపీ నేతలు
మంత్రి మేరుగ నాగార్జున
అసెంబ్లీ సాక్షిగా వైయస్‌ఆర్‌సీపీ దళిత ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై దాడి చేసిన టీడీపీ నేతలు.