– అన్నా లెజినోవా కి ఎమ్మెల్సీ విజయశాంతి బాసట
హైదరాబాద్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా తలనీలాలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్న ఆమెపై ట్రోల్‌చేస్తున్న వారిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి విరుచుకుపడ్డారు.
“అన్నా లెజినోవా గారు దేశం కాని దేశం నుంచి వచ్చారు. పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ, ఆమె హిందూ ధర్మాన్ని విశ్వసించారు. ఆమెను కొందరు ట్రోల్ చేయడం సమంజసం కాదు. దురదృష్టకర అగ్నిప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడేందుకు కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడి కరుణాకటాక్షాలే కారణమనే విశ్వాసంతో శ్రీవారిని దర్శించుకున్నారు.
తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్ కు విరాళం కూడా ఇచ్చారు. హిందూ సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవాను ట్రోల్ చేయడం సరికాదు” అని విజయశాంతి, పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా కు బాసటగా నిలిచారు.