రైతులను కేసీఆర్ ఉరితీస్తున్నారు

– టీఆర్‌ఎస్-బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్
– టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్

కేసీఆర్ ప్రభుత్వం గత మూడు నెలల నుంచి రైతులను ఉరితీస్తోందని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్-బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ ఫలితంగా తెలంగాణలో రైతులు హరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అంబర్‌పేట పోలీసుస్టేషన్‌లో మీడియా మాట్లాడిన రేవంత్ ఏమన్నారంటే…

పండించిన పంట కొనుగోలు చేయక పోవడం వల్ల రైతుల చనిపోయారు.చివరి గింజ వరకు పంటను కొనాల్సిందే. వరి కొనుగోలు చేయకుంటే సీఎం కేసీఆర్ ని రైతులు ఉరేస్తారు. పంట కొనుగోలు విషయంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు దొందు.. దొందే.రైతులను వరి వద్దు అని కేసీఆర్ మాత్రం తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాలలో వరి ఎందుకు వేసాడు?

రైతులు చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ధైర్యం నింపలేకపోతుంది.రైతుల కల్లాల దగ్గరకి వెళ్ళి రైతులకు ధైర్యం చెప్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్.రైతుల సమస్యలు పక్కన పెట్టి,నిరుద్యోగ సమస్య ముందు పెట్టుకుంది రాష్ట్ర బీజేపీ నేతలు. బీజేపీ,టీఆరెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు.ఉద్యోగాల విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నిరుద్యోగులను మోసం చేశారు.దయచేసి రైతులు అధైర్య పడి ఆత్మహత్య చేసుకోవద్దు. చావు పరిష్కారం కాదు.రైతుల వరి పంటను కొనుగోలు చేయను అని మాట్లాడిన కేసీఆర్.. తన ఫామ్ హౌస్ లో పండిన పంటను ఎవరికి అమ్ముతారు?

కేసీఆర్ వడ్లు కొన్న వాళ్ళు… రైతుల వడ్లు కొనరా? కాంగ్రెస్ ప్రభుత్వం చత్తిస్ ఘడ్ రాష్ట్రంలో మాదిరి తెలంగాణ లో వరి కొనుగోలు చేయాలి.రచ్చబండ కార్యక్రమం కొనసాగిస్తాం. ప్రజలు టీఆరెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లో ఉన్నాయి. బీజేపీ, టీఆరెస్ నేతల వైఖరి వల్లనే నేడు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను రాజులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. యాసంగి లో వడ్లు పండించండి.. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి అయిన సరే కొనుగోలు చేయిస్తాం.

Leave a Reply