జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రెమా రాజేశ్వరి

Spread the love

– నల్లగొండ జిల్లాకు తొలి మహిళా ఎస్పీగా బాధ్యతల స్వీకరణ
– 2009 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి
– గతంలో అదనపు ఎస్పీగా నల్లగొండ జిల్లాలో పనిచేసిన అనుభవం

నల్లగొండ : జిల్లా నూతన ఎస్పీగా రెమా రాజేశ్వరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుత ఎస్.పి. ఏ.వి. రంగనాధ్ నుండి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన రంగనాధ్ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ ట్రాఫిక్ కమిషనర్ గా బదిలీ కాగా ఆయన స్థానంలో 2009 బ్యాచ్ కు చెందిన రెమా రాజేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. గతంలో నల్లగొండ జిల్లాలో ఆమె అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు.

సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ రెమా రాజేశ్వరికి డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, సురేష్ కుమార్, మొగిలయ్య, రమణా రెడ్డి, సిసి కార్తీక్, పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జయరాజ్, సోమయ్య, ఏ.ఓ. మంజుభార్గవి,, సూపరింటెండెంట్లు అతిఖుర్ రెహమాన్, బి. దయాకర్ రావు, సబితా రాణి, ఆర్.ఐ.లు, నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, శ్రీనివాస్, సిఐలు, ఎస్.ఐ.లు, డిపిఓ సిబ్బంది తదితరులు ఆమెకు స్వాగతం పలికారు.

Leave a Reply