టెన్త్ , ఇంటర్ లో కవలలకు సమాన మార్కులు
600 మార్కులకుగానూ 571 మార్కులు
పదో తరగతి ఫలితాల్లోనూ ఈ కవలలిద్దరికీ 625 మార్కులకు 620
సహజంగా కవల పిల్లలు ఒకేలా ఉంటారు. పోలికలు, అలవాట్లు కూడా అలాగే ఉంటాయి. ఇవన్నీ మనం సినిమాల్లో కూడా చూసినవే. కానీ విచిత్రంగా కవల పిల్లలకు, చివరకు పరీక్షల్లోనూ ఒకే మార్కులు రావడం మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? లేదు కదా? ఇప్పుడు కర్నాటకలో ఆ చిత్ర విచిత్రాన్ని మీరే వినండి. చూడండి.
కర్ణాటకలోని హసన్ కు చెందిన కవల అమ్మాయిలు చుక్కి, ఇబ్బనిచంద్ర తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సమాన మార్కులు సాధించారు. వీరికి 600 మార్కులకుగానూ 571 మార్కులు వచ్చాయి. విశేషం ఏమిటంటే రెండేళ్ల కిందట పదో తరగతి ఫలితాల్లో ఈ కవలలిద్దరికీ 625 మార్కులకు 620 మార్కులొచ్చాయి.ఇది పూర్తిగా యాదృచ్ఛికమని, సమాన మార్కులు ఎలా వచ్చాయో తమకే అర్థంకావడం లేదని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.